ఇటు వెన్నెల అటు వెన్నెల
నడి శిరస్సుకు శ్రీ వెన్నెల
ఇటు వెన్నెల అటు వెన్నెల
చిరునవ్వుల కలవెన్నెల
ఇటు వెన్నెల అటు వెన్నెల
విరులల్లిన జడవెన్నెల
ఇటు వెన్నెల అటు వెన్నెల
చెంగల్వల జిగి వెన్నెల
ఇటు వెన్నెల అటు వెన్నెల
ఈశ్వరునికి తలవెన్నెల
ఇటు వెన్నెల అటు వెన్నెల
ఆకాశము మొల వెన్నెల
ఇటు వెన్నెల అటు వెన్నెల
మనసుల్లో మరువెన్నెల
ఇటు వెన్నెల అటు వెన్నెల
ఎటు చూచిన కనువెన్నెల
ఇటు వెన్నెల అటు వెన్నెల
పిచ్చెత్తే, వళ్ళంతా వెర్రేత్తే
దిక్కులకై పరుగెత్తే నా మనసున,
వెన్నెల్లో ప్రేయసి లేక,
అమావాస్య అమావాస్య అమావాస్య
మహాలయ అమావాస్య .
(నవకవితకు ఆద్యుడు, విస్మరించబడ్డ గొప్ప కవి శిష్ ట్లా ఉమా
మహేశ్వరరావుగారి గీతం ఇది,1938 లో ప్రచురించిన విష్ణుధనువు కవితా సంకలనం నుంచి. కవి పరిచయం తరువాతి టపాలలో చేస్తాను.)
good collection.
ReplyDeleteప్రేరణ గారు , ఈ రోజున మనమిలా స్వేచ్ఛగా కవిత్వం రాస్తున్నామంటే,అది ఆయన వేసిన మార్గమే, శ్రీశ్రీ కూడా శిష్ట్ లా ప్రేరణతో, ఆ తోవలో నడిచినవాడే, ఆయన్ను స్మరించుకోవడం, నా అదృష్టమే. ధన్యవాదాలు మీకు.
ReplyDeleteవెన్నెలా వెన్నెలా అన్నారు కాబట్టి ఈ గీతం బాగుంది. మీరు రాయలేదు కదా అందుకు కూడా అనమాట.. సరదాగా అన్నాను. బాగుంది వెన్నెల గీతం
ReplyDeleteవెన్నల గారికి ఓ గీతం అని రాయల్సిందండి. ha, ha,
Deleteమీ అభినందనలకు ధన్యవాదాలు.
bbagundi vennela ggeetam..
ReplyDeletemaaku vennela panchinanduku
dhanyavaadaalu bhaskar gaaroo!
@sri
శ్రీ గారు మీ అభినందనలకు ధన్యవాదాలు. మనం మరిచిన ఒక కవిని గుర్తు చేయడానికే అండి, ఈ గీతం.
Delete