Pages

22 April 2012

నానీలు - 8


కొత్త కవిత్వం,
కామెంట్లు కరువు.
వానై కురిసింది,
జలతారువెన్నల.
--------------------------
బాగా రాస్తారండి
మీరు భలే,
గొప్పతనం
గుర్తించిన మనసుది.
---------------------------------
అల్లరికి,
అరక్షణం చాలు.
గాయం మాన్పాలంటే,
జీవితమివ్వాలి.
-------------------
దేవుడా !!
కలలాంటి జీవితమిమ్మంటే....
జీవితం లాంటి
కలలిచ్చాడు.
-------------------------------
అమాయకపు అక్క,
చిక్కని చెల్లి,
నా కవిత్వానికి
చెరో రెక్క.
(వివరణ కోసం అవీ ఇవీ – 3 చూడండి)
---------------------------------------

2 comments:

  1. మీ బ్లాగ్ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు గాలించినా అవీ ఇవీ – 3 కనిపించలేదు.అప్పుడు అర్ధం అయ్యింది, అది మీరు ఇంకా రాయలేదని..మీ రెండు రెక్కలు ఎమిటా అని అలోచిస్తున్నా..ఇంతలో నాకు రెక్కలు వచ్చాయేమిటా అని అలోచిస్తే తేలింది ఏమిటంటే,, మీ నానిలో నా బ్లాగ్ పేరు కి చోటు దొరికిందని!

    ReplyDelete
  2. now it is posted, thanks for your viewing.

    ReplyDelete