Pages

Showing posts with label రిపీటెడ్. Show all posts
Showing posts with label రిపీటెడ్. Show all posts

20 February 2014

సమైక్యత Vsఅనైక్యత



ఫేటేల్మని పాంజియా పగలకపోతే,
ఖండాలకి రూపుండేదా ?
ఈ జగతికి కళ వుండేదా ?
సమైక్యతని ఏడ్చేవారో, అనైక్యతని అరిచేవారో
ఎవరూ లేని ఆది కాలమది.

**
రోడ్డెమ్మట నడిచేవానికి, ప్రతిక్షణానికి దిక్కుమారదు
నడిసంద్రంలో ఈదేవానికి, భూభాగాల జాడే దొరకదు

ఓపికలేక అద్దం పగిలితే, ఎవడి ముక్కలో వాడి ముఖాలే
ఎన్ని వదిలినా, కొన్ని కలిపినా,
కష్టం - కనుమరుగై పోదు
 రాజ్యం - రమణీయం కాదు

**
సగం రాష్ట్రాన్నే దేశంగా రూపొందించేసామే
కూలిన గోడల దేశాన్నొకటి మొన్ననే చూశామే

ఎంత పట్టినా పాకిస్తాను పొరుగైపోలేదా ?
గాండ్రించిన రష్యా నేడు కుదేలు కాలేదా ?

అడగ్గానే తెల్లోడు స్వాతంత్ర్యం ఇచ్చాడా ?
నల్లోడొకడు గద్దెనెక్కితే దేశం సుభిక్షమయ్యిందా ?

బూతులతోటి భూభాగాలు బద్దలు అవుతాయా ?
గతకాలపు రాజ్యపు హద్దులు ఇంకా మిగిలే వున్నాయా ?

విడిపోతే స్వర్గం రాదు – కలిసున్నా సౌఖ్యం లేదు.
ఏ స్వార్థంతో లురేషియా ముక్కలైపోయిందో,
ఏ తంత్రంతో హిమాలయాలు పైపైకీ ఎగశాయో,.

ఎత్తులు, పై ఎత్తులలో - అరువుబతుకులా ఆకలుండదు,
ఆకలే లేని రోజున, ఆమరణ దీక్షకు విలువ వుండదు.

గందరగోళపు వ్యాఖ్యానాలు, ఉత్తకూతల ప్రేలాపనలు
జగడం ప్రాణసంకటం, నిబద్దతే ప్రశ్నార్థకం.

**
జీడిపాకమై సాగే కథలో చివరి మలుపులో ఏముందో
రెండు పిల్లుల కలహపు కథలో లబ్ధిపొందిన కోతేదో

విడిపోయే రోజొకటొస్తే,
ఆనందంగా విడిపోదాం  /  విద్వేషంతో కొట్టుకు చద్దాం
కలిసుండటమే తప్పనిసరైతే
అన్నదమ్ములుగా జీవిద్దాం  రాష్ట్రం రావణకాష్టం.

****
రాజ్యలక్ష్మికి మనసు వుండదు
కష్టజీవికి రాజ్యముండదు.
కరుకు గుండెలో కవితలుండవు
కవుల కలాలకు కుట్రలుండవు.
                                                                                                  Feb 2013



Note:  200 కోట్ల సంవత్సరాలకు పూర్వం అన్నీ ఖండాలు కలసివుండేవి,
దాన్ని పాంజియా అంటారు,.మొదట పాంజియా రెండు ముక్కలయ్యింది.
 అవి గోడ్వానాలాండ్, లురేషియా.
50 లక్ష్లల సంవత్సరాలకు పూర్వం ఆఫ్రికాలో భాగంగా వున్న ఇండియా,
ఆసియా ప్రాంతాన్ని ఢీ కొట్లడం వలన హిమాలయాలు ఏర్పడాయి

( కాంటినంటల్ డ్రిఫ్ట్ సిద్దాంతం ప్రకారం)

9 December 2012

ప్రపంచ తెలుగు బ్లాగుల దినోత్సవ శుభాకాంక్షలు


ప్రపంచ తెలుగు బ్లాగుల దినోత్సవం సందర్భంగా బ్లాగర్లందరికి శుభాభినందనలు,..

అందరికి మరోసారి మన బ్లాగుల గీతాన్ని, బ్లాగుల ప్రతిజ్ఞను గుర్తుచేద్దామని వాటిని పోస్ట్ చేస్తున్నాను.

బ్లాగు ప్రతిజ్ఞ
బ్లాగులే నా కలల ప్రపంచం, బ్లాగర్లందరు నా స్నేహితులు.
నేను నా  బ్లాగును ప్రేమించుచున్నాను.
సుసంపన్నమైన నా ఊహాశక్తి,
బహువిధమైన నా రచనాశక్తి నాకు గర్వకారణం.
విభిన్నంగా, విలక్షణంగా, కీర్తివంతంగా
నా బ్లాగ్ ను తీర్చిదిద్దడానికి సర్వదా నేను కృషి చేస్తాను.
గూగుల్, వర్డ ప్రెస్, అగ్రిగేటర్లు, సీనియర్ బ్లాగర్లందరిని నేను గౌరవిస్తాను. ప్రతి బ్లాగర్ తోను మర్యాదగా నడుచుకొంటాను.
తోటి బ్లాగుల పట్ల అభిమానంతో ఉంటానని,
చదివిన ప్రతి టపాకు వీలైనంతవరకు సహృదయ వాఖ్యలు చేస్తానని, ఎన్ని కష్టాలెదురైనా, ఎన్ని నష్టాలొచ్చినా టపాలు రాస్తూనే వుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.
తెలుగు బ్లాగుల శ్రేయోభివృద్దులే నా ఆనందానికి మూలము.
సూచనలు
1. ప్రతిరోజూ బ్లాగు తెరిచేముందు బ్లాగు ప్రతిజ్ఞ చేయాలి.

2. పూర్తిగా చేయలేని పక్షంలో, చివరి వాఖ్యం చాలు.
---------------------------------------------------------------------
తెలుగు బ్లాగుల గీతం 
మా బ్లాగులమ్మకు లక్ష పూలాజల్లు
మన తెలుగు బ్లాగుకు నీరాజనాలు.
తెలుగు బ్లాగుల వృధ్ది  - మన భాష అభివృధ్ది
మనందరీ బుద్ది కదలాలి అటు కొద్ది.
                                                        మా బ్లాగులమ్మకు...
ఎక్కడెక్కడి తెలుగు ఇచటికే పరుగు
మన భాష వెలుగు బ్లాగులతో పెరుగు.
చిన్నప్పటి కథలు పెద్దవారి వెతలు
అనుభవపు పాఠాలు చిలిపి ఆరాటాలు
అన్నిటిని ఇక్కడే వెతుకుతాము
ఎన్నెన్నో విషయాలు హత్తుకొని వెళ్తాము
                                                                 మా బ్లాగులమ్మకు...
బెల్జియం బెజవాడ ఇంగ్లాండు, గుడివాడ
అమెరికా, మెక్సికో దుబాయి,ముంబాయి
సఖినేటిపల్లి ఆఫ్రికాలో పల్లి
కలకత్త, కనిగిరి ఎచ్చోట మేమున్నా
                                                           మా బ్లాగులమ్మకు...
కలల ఊహల ఊట సాహిత్య పూతోట
భావాల జడివాన - కురిసేను ఇచ్చోట
ఆకట్టు పోస్టులు - అలరించు కామెంట్లు
ఈ బ్లాగులా పంట - పండాలి ప్రతి ఇంట
                                                        మా బ్లాగులమ్మకు...
అపురూప కవితలు , చక్కని చిత్రాలు
సినిమాలు, గీతాలు, రాజకీయాలెన్నో
కళలు, విజ్ఞానాలు, కమనీయ విషయాలు
యాత్రవిశేషాలు, విశ్లేషణలు ఎన్నో
                                                         మా బ్లాగులమ్మకు...
తెలుగు భాషా శక్తి - బ్లాగర్ల ధీయుక్తి
విశ్వమంతా ఎగురు - తెలుగు బ్లాగుల కీర్తి
ఈ జీవితం మొత్తమూ ,ఇక బ్లాగులకే అంకితం
బ్లాగులే దైవమూ, బ్లాగులే మా ప్రాణమూ 

జై బ్లాగులమ్మ జై బ్లాగులమ్మ జైబ్లాగులమ్మ

సూచనలు
1. ప్రతి బ్లాగర్ల సమావేశం లో ప్రార్థనా గీతంగా పాడుకోవాలి.

2.తెలుగు బ్లాగుల గీతాన్ని గౌరవించి, ప్రచారం చేయాలి.

3. ఏ ఇద్దరు బ్లాగర్లు కలసినా జై బ్లాగులమ్మ అని అరుచుకోని, అభివాదం చేసుకోవాలి.

13 October 2012

ఇస్ట్ లు అను ....



రాత్రంతా కమ్మని కలలు కనీ కని,
పగలంతా శ్రమించీ, కష్టించీ,
రక్తం ధారపోసీ, పోసి
కన్నకలలకు,
ఎరుపు రంగు పులిమే,
చారిత్రక తప్పిదిస్ట్,
మన కమ్యూనిస్ట్.

ఎడాపెడా
వాడిపారేస్తుంటారందరు.
విజ్ఞానమో,వినాశనమో
సుఖిస్తారో, నశిస్తారో
ప్రయోగమే కుటుంబం,
ఆలోచనలే ఆస్థి.
ఎవరికీ పట్టడు,
ఎవరినీ పట్టించుకోడు.
 మన సైంటిస్ట్

ముగ్గులేస్తూ మొగుడు,
పడక్కుర్చీలో పెళ్లాం.
మాటలెక్కువ,
మార్పు తక్కువ.
మగజాతిని చీల్చిచెండాడే,
ఉద్రేకిస్ట్
మన ఫెమినిస్ట్.

ఒకడి చేతిలో పెన్ను,
ఇంకొకడి చేతిలో గన్ను.
లక్ష్యమేదైన,
గురిచూసి కాల్చడమే, రాయడమే
సిద్దాంతమేదైన,
ఎటో వైపుకి
జనజీవితాన్ని నడిపించడమే,
ఎవర్నో ఒకర్ని వణికించడమే,
మావోయిస్ట్  -  జర్నలిస్ట్.

వాడి గోల వాడిదే,
అదో ప్రపంచం.
రంగులో,  తలపులో
గీతలో, రాతలో
వ్యసనమో, అదే జీవితమో
లోకమే పట్టని,
పిచ్చి మా లోకం.
నిరంతర స్వప్నిస్ట్
మన ఆర్టిస్ట్.

అందరిలో
అప్పుడప్పుడు తొంగిచూస్తుంటాడు,
పక్కనోడి కష్టాలు,
పైకి పలకరింపులు.
వాడి మనసులో కిలకిలలు.
బయట పడని
లోపలి మనిషి,
మనందరిలో మనిషి,
శాడిస్ట్.