Pages

Showing posts with label ఒకానొక ఫీలింగ్. Show all posts
Showing posts with label ఒకానొక ఫీలింగ్. Show all posts

15 November 2013

ఒకానొక ఫీలింగ్ - 43

నేను తనవంక చూస్తూ,.
అదేపనిగా మాట్లాడుతున్నప్పుడు,.
అప్పుడు తనడుగుతుంది,.

ఎందుకంతా నిశ్శబ్థంగా వున్నావని.

4 December 2012

భయం



గాలి వీస్తున్నప్పుడల్లా,
జ్ఞాపకాలు చెదురుతాయా?
ఆజ్యం పోసినప్పుడల్లా,
ఆ సెగల్లో కాలతాయా?
ఎందుకలా బెదురుతావ్!!
ఏ తర్కము ప్రేమతో తర్కించలేదని,
ఏ కత్తులూ తెగనరకలేవని,
తెలుసా,తెలియదా సుమా,..ఇంతకీ నీకు,..

11 November 2012

ఎదురు చూపు



రాత్రంతా, ఆకసాన,
అలా వేలాడుతూనే,.
దినకరుని జాడకై,
మిణుకుమిణుకుమంటూ
ఎదురుచూసి, చూసి,.
ఆ తారకలు,
అతని రాకా అలికిడికే,
తమ సర్వస్వాన్ని అర్పించినట్లు,
నీ తలపుల అలకిడికే,
అంకితమైపోతున్నా, సుమా,..
నేను నీకు,నిరంతరమూ...
ధీర్ఘమైన నీ మౌనపు కుంచె కూడా,
నా హృదయానికి రంగులద్దుతూనే వుంది సుమా......

7 November 2012

భూమీ ఆకాశం


రెండు పొగడ్తలు,
నాలుగు ఎదురుచూపులు,.
ఒక నవ్వు, అరాకొరా మాటలు,
అప్పుడప్పుడు ఓ చాక్లెటో,కప్పు ఐస్ క్రీమో..
అవుతాయా నా ప్రేమకు పూలు పరిచిన బాటలు...
నా ఆతృతా, నీ నిర్లక్ష్యం,..
భూమీ ఆకాశమేనా,..ఇంకేమన్నా వుందా సుమా.....

24 September 2012

చెలి అధరాల తడి ముద్రలు


స్పందన రేకెత్తించడానికి,
చెలి అధరాల తడి ముద్రలే కావాలా....
భువిని ముద్దాడే,
వానచినుకుల చప్పుడులు సరిపోవా !!!!

22 September 2012

నేనెలా నిష్క్రమించగలను, సుమా....

అలలుఅలలుగా,
తెరలుతెరలుగా,
ఏ వెన్నల నవ్వులైతే,
అలా పరుచుకుని,
ఈ శూన్య హృదయాన్ని,
జీవజలంతో నింపుతాయో....
నా ఆనందాలన్నింటిని మోసుకొని,
ఏ మోము అయితే,
ఈ చుట్టుపక్కలే తిరుగుతూ,
ఉల్లాసాన్ని నాపై పన్నీరులా చిలుకరిస్తుందో.....
అలాంటి, నీ సమక్షాన్ని వదలి,
నేనెలా నిష్క్రమించగలను, సుమా....
నేనిక్కడనుంచి.

18 September 2012

మిగిలిపోయిన జ్ఞాపకం.


తేనెలోలికే నవ్వులతో,
చక్కెర కలిపిన మాటలతో,
ముద్దముద్దకు, ఓ ముద్దుపెట్టి
అమృతాన్ని తినిపిస్తావ్, నువ్వు....
ఆరగించింది, అరిగిపోయి

చాలా కాలమైపోయినా,
గిలిగింతలు పెడుతూ,
ఇంకా మురిపిస్తూనే వుంది, సుమా..
మిగిలిపోయిన జ్ఞాపకం.

13 September 2012

జ్వాలా జలము


జ్వాల వలే వేదనను,
జలము వలే స్వాంతనను,
ఏక కాలంలో
పరిచర్యా, పరితాపాలను
చూపగల నేర్పు,
నీ ప్రేమ జ్వాలా జలమునకు తప్ప
అన్యులకు సాధ్యమా,.. సుమా!!

23 August 2012

ఒకానొక ఫీలింగ్ – 35



నిను చూడాలని,
ఇంత కాలము, వేచి వేచి
ఎదురు చూసిన, ఈ కన్నులు,
అనుకోని ఆనందపు దాడికి,
తట్టుకోలేకేమో సుమా!
ఇలా భావరహితముగా,........




18 August 2012

నీ దేహపు స్పర్శా ప్రసాదం......



నీవు పలికిన
అర్థం లేని మాటలు కూడా,
వేణునాదమై, వీణావాదమై
ఈ బీడుకి తొలకరి జల్లై,
ఈ నాటికి, అలవోకగా అలాఅలా,
జీవాన్ని విత్తుతూనే వున్నాయ్,
నీ, నా జ్ఞాపకాలై........

ఇరుకిరుకు రోడ్లల్లో,
నీతో పాటు నడుస్తున్నప్పుడు,
నీ దేహపు స్పర్శా ప్రసాదం,
ఈ దాహార్తికి, అమృతమై,
నన్నింకా, వోత్తుకుంటున్నట్లే వుంది, సుమా!!

7 August 2012

ఒకానొక ఫీలింగ్ – 33



నీ నవ్వులు చాలు, సుమా
నా వేదన తీరుటకు.
నీ మాటలు చాలు, చెలి
ఆనందం పొందుటకు.
నీ స్పర్శే చాలు, సఖి
లోకాన్నే మరుచుటకు.

4 August 2012

కలల కత్తుల ఉచ్చు



నిరంతరం నీ జ్ఞాపకాలిక్కడ,
గస్తీ కాస్తుంటాయ్,
కునుకు కంటి దరి చేరకుండా.
ఎలాగోలా తప్పించుకొని,
పారిపోతానా అక్కడ నుంచి,
కలల కత్తుల ఉచ్చులో చిక్కుకొని,
విలవిలలాడిపోతాను, సుమా నేను.

28 July 2012

మరిచిపోకు నన్ను, సుమా.



ఒకానొక ఫీలింగ్ – 31

చెదిరిపోకు కలలాగా,
కరిగిపోకు హిమలాగా,
నిలిచిపోకు దూరానే,
మరిచిపోకు నన్ను, సుమా!!

24 July 2012

ఒకానొక ఫీలింగ్ – 30



అధరాలను ముద్దాడిన,
చక్కనైన మురళిగాంచి,
హృదయమెంతో వగచింది,
నే వేణువు కాలేదని.

17 July 2012

ఒకానొక ఫీలింగ్ – 29



ఆకసాన తారలు ,
లేకున్ననేమి, ఈ లోకాన.
తడిసిన, నీ నడుము వంపున మెరిసే
నీటి చుక్కలు చాలు, సుమా!!

13 July 2012

ఒకానొక ఫీలింగ్ – 28



జలపాతపు హోరై,
హృదీలో దూకినావు.
కొంచెం తెప్పరిల్లి,
కుదురుకొనే లోపే,
నిండైన నదీ ప్రవాహమై,
మదిన సాగినావు,సుమా.

12 July 2012

సాహచర్యా ఫలం




ఆ నాలుగు మెట్లు,
ఈ కొబ్బరి చెట్లు,
ఆ చెక్క తలుపు,
ఈ వీధీ మలుపు,
ఆ మూల మరుగు,
ఈ సిమెంటు అరుగు,
నీ సాహచర్యా ఫలం తో పునీతమై,
జీవితకాల దర్శనీయ స్థలాలై పోయాయి సుమా, 

8 July 2012

ఒకానొక ఫీలింగ్ – 26



పర్వతశిఖరాన
ఓ మంచు మేఘం,
నల్లని రాతిని చేరి,
ముద్దాడు వేళ.,
ఏ తపస్సుకి ప్రతిఫలమో,అదని
నేను నీ కొరకై,
తపమాచరించి,శిలనైపోనా సుమా.

7 July 2012

ఒకానొక ఫీలింగ్ – 25



రాజేయకు మంటలను,
నిర్లక్ష్యం ప్రదర్శించి.
చెలరేగిన జ్వాలలు,
చల్లారాలంటే,
నీ చిరునవ్వుల సాయం,
తప్పదు సుమా! మళ్లీ నాకు.

6 July 2012

ఒకానొక ఫీలింగ్ – 24



నీ జాడ కానరాక,
ఏ బాధ దాగినదో,
ఈ చిన్ని హృదయాన,
నీ అందెల సవ్వడి విని,
మదిని వీడి, వడివడిగా
జారుతుంది, సుమా అది.