Pages

26 September 2012

విజ్ఞానంతోనే వికసించు జగత్తు




రచన- గంటేడి గౌరునాయుడు   గానం – దివిజా కార్తీక్
సంగీతం – సాయి కార్తీక్      చిత్రీకరణ - నేను




విజ్ఞానంతోనే వికసించు జగత్తు
పసిపిల్లల చదువే దానికి విత్తు


లేగదూడ గంతులు పసిడి పూల కాంతులూ
గాలితరగ పిలుపులు సెలయేటి అలల మెరుపులు

ప్రకృతిలో అణువణువు పసిపిల్లల అమ్మవడి
ఆ ప్రేమను పంచాలి పిల్లలకు చదువుల బడి 
పిల్లలకు చదువుల బడి    విజ్ఞానంతోనే .......


చిన్నచిన్న చేతులతో మోయలేని బరువులతో
పసిపిల్లల మనసులో గాయాలై రగిలితే

ప్రమాదాల కోరలలో బాల్యం బలియైపోతే
బావిభారతి ఆశల బాల్యం ఇకెక్కడిది. 
బాల్యం ఇకెక్కడిది.     విజ్ఞానంతోనే ....... 


వ్యాపరం వలలో చదువు చేప కాకూడదు
కాసుల గాలానికి విజ్ఞానం బలికాకూడదు

తొలిపొద్దు పొడుపులా తొలకరి తొలిచినుకులా
పసిడిపంట పండాలి మన పాపల చదువు  
మన పాపల చదువు    విజ్ఞానంతోనే .......


దేశం ఏదైన కాలం ఏదైనా
చెప్పే చదువేదైనా బాల్యం ఒకటే

పూవు వంటి పసి ప్రాయం వసివాడి పోకుండా
కాపాడే బాధ్యత మన అందరిది,
 మన అందరిది   విజ్ఞానంతోనే .......  


పాఠమే పాటగా చదువే ఒక ఆటగా
గురువే విద్యార్థికి చక్కని నేస్తంగా

మనసుని మురిపిస్తే బాధను మరిపిస్తే
తరగతి గదులే రేపటి తరగని నిధులు 
తరగని నిధులు

విజ్ఞానంతోనే వికసించు జగత్తు
పసిపిల్లల చదువే దానికి విత్తు




8 comments:

  1. Replies
    1. ధన్యవాదాలు అనికేత్ గారు, వీడియో చూసి, మా బడి పిల్లల కృషిని మెచ్చినందుకు.

      Delete
  2. Replies
    1. అమ్మయ్య, మీరు చూసి అభినందించినందుకు చాలా ఆనందం వెన్నల గారు, ఇంకోంచెం మెచ్చుకోవచ్చు గదా....హ,హ....

      Delete
  3. గీతం,సంగీతం, చిత్రీకరణ అన్నీ బాగున్నాయి
    భాస్కర్ గారూ! అభినందనలు మీకందరికీ...
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. మీ అభినందనలకు బోలెడు ధన్యవాదాలు శ్రీ గారు, మా కష్టాన్ని గుర్తించి వీడియోని మెచ్చినందుకు.

      Delete
  4. పాట బాగుంది. సంగీతం,మరీ ముఖ్యంగా పాడిన అమ్మాయి గొంతు మదురంగా ఉంది. మంచి నడియో. కాని పిల్లలకు విడియో తీస్తున్నట్టుగా తెలియకుండా తీస్తే ఇంకా సహజంగా వచ్చేది.

    ReplyDelete
  5. ధన్యవాదాలు, గోపాల కృష్ణారావు గారు, దివిజా చాల మంచి గాయని, ఆమెకు మంచి అవకాశాలు రావలని కోరుకుందాం,
    వీడియో తీయడం ఇప్పుడిప్పుడే నేర్చకుంటున్నానండి, మంరింత బాగా తీయడానికి ప్రయత్నిస్తాను.

    ReplyDelete