దోరగా వేసిన తలుపు,
నక్కినక్కి,
జాగ్రత్తగా వినాల్సోస్తుంది,
మత్తుగా, మృదువుగా సాగే,
ఆ వెచ్చని ముచ్చట్లు.
ఏ అలికిడికి,
నిశ్శబ్ధం బెదిరి,
శబ్ధాలు ఆగిపోతాయేమోనని,
ఆ ఏకాతం భగ్నమవుతుందేమోనని,
భయంగా, వస్తువునై నేను....,
అక్కడ ఆ ఒంటరి గదిలో,
రాత్రికబుర్లు చెప్పుకుంటూ,
విశ్రాంతిగా పవళించివున్నాయ్,
నలిగిన మల్లెలు, చెదిరిన దుప్పటి.
ముచ్చట్లు నాలుగే అయినా
ReplyDeleteభావం భారమే అయినా
బాగుంది మీరు రాసింది:-)
ధన్యవాదాలు పద్మార్పిత గారు, అంత భారమైన భావం వుందటారా, ఇంతకీ అక్కడ...హ,హ...
ReplyDelete