అందరికి ప్రపంచ హృదయదినోత్సవ శుభాకాంక్షలు
వున్నది ఒక్క గుండే, సాధ్యమైనంత వరకు
జాగ్రత్తగా కాపాడుకోవడం మన పని.
గుండె కొట్టుకుంటేనే మనిషి బతుకుతాడు. మిగిలిన ఏ అవయవం లేకపోయినా బతకొచ్చు.
గుండెలేకుండా మనిషి బతకం కష్టమే. అలాంటి గుండె పదిలంగా ఉండాలంటే పది మాటలు చూడండి.
1. నియమిత వ్యాయమం ఉండాలి.
( అబ్బో ఇది మన వల్ల కాని పని.)
2. ఎత్తుకు తగిన బరువు ఉండేలా
చూసుకోవాలి.
(ఇది మన చేతుల్లో వుందా, ??)
3. మానసిక ఆందోళన తగ్గించుకోండి
(ఇది అస్సలు వీలుకాదండి.)
4. సరియైన నిద్ర ఉండాలి. కనీసం రోజులో 8 గంటలు
నిద్రపోవాలి.
(బ్లాగ్ లో టపాలు, కామెంట్లు ఎవరు రాస్తారు.)
5. ధూమపానం చేయరాదు.
6. మద్యపానం చేయరాదు.
(5,6 మన సిలబస్ లో విషయాలు కాదు.)
7. భోజనంలో కొవ్వు పదార్థాలు తగ్గించండి.
(నెయ్యి లేకుండా ముద్ద దిగుతుందా, కాఫీ తాగకుండా మంచం
దిగుతామా....)
8. 40 ఏళ్లు దాటిన వారు
డాక్టర్‌ను సంప్రదించాలి. ఆయనం సలహా మేరకు ఆహారం తీసుకోవాలి. వారు సూచన మేరకే జీవన
శైలి మార్చుకోవాలి.
(ఒకరు చెప్పినట్లు బతకడం నాకిష్టముండదండి,..)
9. నియమిత సమయంలో రక్త పరీక్ష
చేయించుకోవాలి. శరీరంలో చక్కెరశాతం, కొవ్వు
శాతం పెరిగే అవకాశం ఉంది కనుక ఈ పరీక్షలు అవసరం.
(ఇక డబ్బులన్ని లాబ్ లకే...)
10. 45 ఏళ్ళు దాటిన వారు
ఏడాదికొకమారు గుండెకు సంబంధించిన అన్ని పరీక్షలు చేయించుకోవాలి.
(అంతేనంటారా, సరే కానివ్వండి,
మీకోసం.........)
మీ పోస్ట్ ఐదు రోజుల ముందే మంచి సందేశాన్ని ఇచ్చింది...
ReplyDeleteధన్యవాదాలు భాస్కర్ గారూ !...
అందులో 8...కొంచెం కష్టం ...:-)
10...కి మరి కాస్త టైం ఉంది ...:-)
5 ...6 ...సంవత్సరంలో చాలా మంది ఇవి మానేసేందుకు ప్రోత్సహిస్తూ
మానేసిన రోజు బహుమతులిస్తుంటాను...
మిగిలినవి నేను పాటించేవే...:-))
మీరూ పాటించాలి...అంటా పాటించండి ఆరోగ్యవంతమైన
హృదయం కోసం...
(గమనిక:నాదికాదు ఎపుడోఎవరికో ఇచ్చేశాను కదా అనుకోవద్దు...:-)...:-)...
అన్నట్లు నా ప్రొఫైల్ లో మెయిల్ ఐడి కి ఓ టెస్ట్ మెయిల్ చేయండి భాస్కర్ గారూ!
@శ్రీ
ధన్యవాదాలు శ్రీ గారు, ఇంతకీ హర్ట్స్ డ్ ఎప్పడు. 29 నా......
ReplyDelete