దారితీద్దాం సాగిపోదాం
దారులు వేస్తు పరుగులు తీద్దాం
కాంక్రీట్ జంగిల్ కౌగిలినుంచి,
పచ్చపచ్చని ప్రకృతిలోకి,
మంటలు రేపే మతాల నుంచి,
మంచిని పెంచే తత్వంలోకి,
దారితీద్దాం సాగిపోదాం.
టీవి తెచ్చే తిప్పలనుంచి,
సౌఖ్యం ఇచ్చే పఠనం వైపుకి,
బట్టి పెట్టే కష్టం నుంచి,
స్వేచ్ఛను పెంచే చదువుల వైపుకి,
దారితీద్దాం సాగిపోదాం.
అజ్ఞానపు చీకటినుంచి,
విజ్ఞానపు వెలుగుల్లోకి,
రాక్షసత్వం కోరలనుంచి,
మానవత్వపు నీడలలోకి,
దారితీద్దాం సాగిపోదాం.
పెప్సికోలా బాటిల్ నుంచి,
కొబ్బరి నీటి జాడలలోకి,
ప్లాస్టిక్ బ్యాగు భూతం నుంచి,
పాతగుడ్డ సంచులలోకి,
దారితీద్దాం సాగిపోదాం.
ప్రాణం తీసే స్పర్ధల నుంచి,
రక్తం పంచే మమతలలోకి,
అణుయుద్ధపు భయం నుంచి,
చిరునవ్వుల లోకంలోకి,
దారితీద్దాం సాగిపోదాం.
దారులు వేస్తు పరుగులు తీద్దాం
చిన్నచిన్న పిట్టలమై,
సీతాకోక చిలకలమై,
ఎగిరిపోదాం, పరవశిద్దాం,
పరవశిస్తూ ఎగిరిపోదాం.
all are good.
ReplyDeleteయోహంత్ గారు ధన్యవాదాలండి,
Deletepadandi mari:-)
ReplyDeleteహ,హ,....పోదాం అనుకుంటున్నా కుదరడంలేదు, పద్మార్పిత గారు,
ReplyDelete