ఏ బ్రాంతి చేతనైతే నేను జ్ఞానవంతుడనని,
ప్రకృతిలో ప్రత్యేకతలను ఆపాదించుకొని,
ఈ సృష్టి సమస్తాన్ని,
ఖండఖండాలుగా,
విభజించుకొని మురిసిపోతున్నానో......
జాగ్రత్స్వప్న సుషప్తాలతో నిర్మితమై,
షడ్వికార సహితమై శోభిల్లు శరీరాన్నే,
ఈ విశాల విశ్వానికి దిక్సూచిగా,
అభివర్ణించుకొని ఆనందపడుతున్నానో.......
నిరంతరమూ, నదీజలము వలే,
చంచలచిత్తముతో,
పాతాళము వైపునకే పరుగిడుతున్నానో....
బహురూపాలతో, వాయులక్షణాలతో,
అహంకార,అసంపూర్ణాలతో
మదాంధకారాన మగ్గుచున్నానో.......
తొలగింపబడజాలని,
మాయా మేఘాలతో ఆవరించబడిన,
సూక్ష్మాతి,సూక్ష్మమైన ఈ దేహము,
వేయి పడగల సర్పఛ్చాయను వీడి,
బ్రాంతీరహితమై మనగలదా, ప్రభూ.......
---------------------------------
జాగ్రత్త, స్వప్నం, సుషప్త (గాఢ నిద్ర) - మూడు అవస్థలు
జన్మ,వృధ్ధి,పరిణితి,క్షయము,వ్యాధి,నాశనము - షడ్వికారాలు.
---------------------------------
జాగ్రత్త, స్వప్నం, సుషప్త (గాఢ నిద్ర) - మూడు అవస్థలు
జన్మ,వృధ్ధి,పరిణితి,క్షయము,వ్యాధి,నాశనము - షడ్వికారాలు.
అంత తొందరగా భ్రాంతి వీడటం కష్టమే అండి. కవిత బాగుంది .
ReplyDeleteధన్యవాదాలు అనురాధ గారు, నా బ్లాగుకి స్వాగతం, మీరు చెప్పింది, నిజమేనండి.
Deleteచాల బాగుంది .బ్రాంతి వీడుతున్నట్లు ...
ReplyDeleteధన్యవాదాలు చిన్ని గారు.
Deleteక్లిష్టమైన పద ప్రయోగంతో బాగా వ్రాసారు భాస్కర్ గారూ!
ReplyDeleteఅభినందనలు...
@శ్రీ
ధన్యవాదాలు శ్రీ గారు, మీలాంటి మిత్రుల ప్రోత్సాహమే కదండి, ఇలాంటి కవితలకు ప్రాణం.
Deleteఅర్థంచేసుకోలేని, తెలుసుకోలేని విషయాన్ని మీరు చక్కగా తెలుసుకున్నారే, మొదటి అడుగు వేశారన్నమాట.
ReplyDeleteమీ అభినందనలకు ధన్యవాదాలు లక్ష్మీదేవి గారు, తొలి అడుగే కదా ఇది., తెలుసుకోవలసినవి అనంతం కదండి.
Deleteఒక్క మాటలో చెప్పాలంటే అత్యద్భుతంగా ఉంది.
ReplyDeleteయోగశాస్త్రం ప్రకారం మనకి మూలాధార చక్రంలో ఉండే కుండలినీ శక్తి నిదురించే పాములా ఉంటుందని చెప్పబడినది కదా!
ఒక్క మాటలో అంత మాటన్నారంటే, ఎంతో కొంత విషయమున్నట్లేనండి, ధన్యవాదాలు రసజ్ఞ గారు.
Deleteనాకు ఏ విషయంలోను ప్రావీణ్యత లేదు, కొంచెం ప్రవేశం తప్ప. మీరు అడిగిన దానిని చెప్పె స్థాయి లేదండి నాకు.
అమ్మో! ఈ టైటిల్ ఏంటి అనుకున్నా...
ReplyDeleteసాంతం చదివాక అమోఘమంటున్నా..
మీరు అమోఘమన్నా,అద్భుతమన్నా...
Deleteమీ వంటి విజ్ఞుల కామెంట్ల వల్లే,
కవితకు అందమొచ్చిందనుకుంటున్నా, పద్మార్పిత గారు.
very nice!!
ReplyDeleteమీ అభినందనలే కదా, వనమాలిగారు రాయడానికి ప్రేరణనిచ్చేది. దన్యవాదాలండి.
Deleteఅద్భుతంగా వ్రాసారు భాస్కర్ గారు.
ReplyDeleteభారతి గారు, మీకు కవిత నచ్చినందుకు ఆనందంగా వుందండి.
Deleteలేదు ప్రభూ, జ్ఞానం అనే అ"జ్ఞానం" లో ఉన్నంత వరకు ఇది జరగదు, అసంభవం :p.....
ReplyDeleteఏ జ్ఞానానికైనా చివరమెట్టు గా మిగిలేది అజ్ఞానమే కదా సంతు గారు.
Deleteభ్రాంతి రహితమై మనగలదా, ప్రభూ......
ReplyDeleteబాగున్నది చక్కని ప్రార్థన !!
'' మన గలగట '' - అస్తిత్వాన్ని సూచిస్తుంది.
ఈ అశాశ్వతపు, 'తాత్కాలిక అస్తిత్వం లా భాసిస్తున్న' ఈ ఉనికియే, ఆ భ్రాంతి .
మరి ఆ భ్రాంతి రహితమవ్వగా మిగిలేది ఆ ప్రభువే...?!
చాలాచాలా రోజులకు ఎందుకో ఏమో గారు,..ఎలా వున్నారు,..చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి, మీరు చెప్పింది నిజమేనండి.
Deleteat your free time, please watch this clip
ReplyDeletehttp://youtu.be/brbhRQergK4
thanks
?!
ఇది ఓపెన్ కావడం లేదండి,.
Delete