Pages

27 March 2012

ఆగి పోయింది ! (కవిత - 4)


ఆగి పోయింది !



చిద్రమైన స్వప్నాల్ని 
చిల్లుల గొడుగులో
అనంతమైన ఆకాంక్షల్ని
చినిగిన  చొక్కాలలో,
అలుపెరుగని  రోగాలను
బక్క చిక్కిన శరీరం లో 
 మోస్తున్నావో! దాస్తున్నవో !

జీవితాల పాఠాలను 
మరణం ముద్రిస్తుంది .
చదివే అలవాటే 
చస్తున్నప్పుడు 
పుస్తకం ప్రశ్నార్ధకం !

నన్ను మాత్రమే   నేను 
అర్థం చేసుకొంటున్నప్పుడు 
ఎవరికి ఎవరు?
ప్రశ్న ఎప్పుడు చేదే!
ఏమి చేయలేనప్పుడు .
ఎవడో ఒకడు శత్రువే 
ఉక్రోషం ఉప్పెనైనప్పుడు. 

వంద ఎకరాల కల 
అర క్షణం లో 
దగ్ధమైనప్పుడు
వేల పేజీల 
కోర్టు కవిత్యం 
కూని రాగాలు తీస్తుందేమో!
ఎన్నో బంధాలను 
చరమ గీతపు 
చీకట్లలో నెట్టి...

క్షణం లో దానమిచ్చిన 
కళ్ళు మాత్రం 
ఎవోరికో వెలుగునిస్తాయ్!
నిన్ను వాళ్ళలో 
బతకనిస్తాయ్!

భూములు చెరువుల్లో
మునిగితే 
శరీరాలు భూమిలో 
కుళ్లుతున్నాయ్. 

జీవిత పోరాటమో!
అర్థం లేని ఆరాటమో! 
 నిరంతర త్యాగమో...
సమస్యల సంఘర్షణలో....

పెదనాయన
సమాధి లోనైన 
సమాధాన పడతావా?


వీడియో - 2 ( కొండ్రెడ్డి ఓబుల్ రెడ్డి)


కొండ్రెడ్డి ఓబుల్ రెడ్డి (పెదనాన్న)  మార్చ్ 25వ తేదిన స్వర్గస్తులు అయినారు.

వారి జ్ఞాపకాలతో ..............




23 March 2012

వీడియోలు - 1(కనిగిరి కొండ )

కనిగిరి కొండ కి పిల్లల తో వెళ్ళినప్పుడు తీసిన వీడియో ఇది .