Pages

27 November 2013

తోకచుక్కల చరిత్ర


ఈ విధంగా తోకచుక్కలు మొత్తం మీద మన సూర్యకుటుంబం యొక్క పరిధిని దాదాపు ఒక కాంతి సంవత్సరానికి విస్తరించాయి. ఐసాన్ తోకచుక్క పూర్వపరాలు తెలుసుకునేముందు, తోకచుక్కల చరిత్రను కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.
అంతరిక్షాన్ని మనుషులు కొన్ని వేల సంవత్సరాలుగా పరిశీలిస్తూ, వాటి ఖచ్చితమైన గతులలో నియమబద్ద గమనాన్ని వీక్షిస్తూ, నక్షత్రాలకు,గ్రహాలకు,చంద్రునికి సంబంధించిన అనేక విషయాలను,ఆకాశ మార్పులను తెలుసుకోగలిగారు. కాని ఎటువంటి కట్టుబాట్లు లేకుండా,. హఠాత్తుగా వచ్చే తోకచుక్కలు మనిషిని అనాదిగా భయపెడుతూనే వుండేవి.వీటిని గురించి మొదటిసారి శాస్త్రబద్దంగా ఊహచేసింది, క్రీ.పూ 350 మధ్యకాలంలో జీవించిన ప్రఖ్యాత తత్వవేత్త అరిస్టాటిల్. ఇవి అంతరిక్షానికి సంబంధించినవి కావని, భూ వాతావరణంలోని గాలిలో జరిగే కొన్ని చర్యల కారణంగా మండే విస్ఫూలింగాలని ప్రతిపాదించాడు. అంత పెద్ద తత్వవేత్త చెప్పడం చేత,. దాదాపు 1800 సంవత్సరాలు అదే వేదంలా చలామణి అయ్యింది.

ఆ తరువాత దీన్ని గురించి కొంచెం శాస్త్రీయ పరిశోదన మళ్లీ మొదలుపెట్టింది, 1473 లో గ్రీకు ఖగోళశాస్త్రవేత్త రెజియో మాంటనస్. ఈయన చేసిన పని అప్పుడు వచ్చిన ఒక తోకచుక్క సమాచారాన్ని,అది ఏరోజు ఏరాశిలో వుందో గమనించి, దాన్ని రికార్డు చేయడం
.
గిరోలామో ఫ్రాకాస్టోరో                                 పీటర్ ఏపియన్                     


ఇటలీకి చెందిన గిరోలామో ఫ్రాకాస్టోరో, ఆస్ట్రియాకు చెందిన పీటర్ ఏపియన్ లు 

 1532లో  వచ్చిన ఒక తోకచుక్కను పరిశీలించి, తోకచుక్క తోక ఎప్పుడు సూర్యుడికి వ్యతిరేఖదిశలో వుండటాన్ని కనుగొన్నరు. తోకచుక్కలకు సంబంధించి గొప్పఆవిష్కరణ ఇది. దీనివల్ల సూర్యుడికి,తోకచుక్కకి మధ్య ఏదో సంబంధం వుండితీరాలి అని నిర్ణయించగలిగారు.

 టైకో

1577లో ప్రఖ్యాత డేనిష్ ఖగోళశాస్త్రవేత్త టైకోబ్రాహీ పురాతన మైన దృష్టివిక్షేపాన ద్వారా తోకచుక్క భూమికి ఎంత దూరంలో వుందో లెక్కించడానికి ప్రయత్నించాడు,. అవి చందమామకంటే దాదావు నాలుగైదురెట్ల దూరంలో వున్నాయని నిర్ణయించాడు. ఇది వాస్తవానికి చాలా దూరంలో వున్నప్పటికి, అరిస్టాటిల్ ఆలోచనలను సమూలంగా తుడిచిపెట్టగలిగింది.
తోకచుక్క భూమికి సంబంధించినది కాదు, అంతరిక్షవస్తువని తేల్చగలిగింది.
 కెఫ్లర్


తోకచుక్కల కక్ష్యలను తొలిసారి అంచనావేసే ప్రయత్నం చేసింది,.టైకో శిష్యుడు జర్మన్ శాస్త్రవేత్త జోహనెస్ కెఫ్లర్. తోకచుక్కలు సూర్యకుటుంబం మీదుగా సరళరేఖా మార్గాలలో పయనిస్తూ సౌరకుటుంబాన్ని దాటివెళ్లిపోయే  అంతరిక్షవస్తువు అని , అవి సౌరకుటుంబానికి చెందినవి కావని భావించాడు.


1664లో వచ్చిన తోకచుక్కని పరిశీలించిన ఇటలీ శాస్త్రవేత్త గియోవాన్ని బొరేలి తోకచుక్క సూర్యుడుచుట్టు తిరిగి, వేరే దిశలో వెళ్లడాన్ని గమనించాడు. తోకచుక్క కక్ష్య సరళరేఖగా లేదని, అనంతగా విస్తరించే ధీర్ఘవృత్తాకారం (పెరాబోలా) లో వుంటుందన్నాడు. ఒకసారి వచ్చివెళ్లిన తోకచుక్క మరలా వచ్చే అవకాశం లేదని భావించాడు.

 ఎడ్మండ్ హేలి

1680లో న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం ప్రతిపాదించాక, న్యూటన్ స్నేహితుడైన ఎడ్మడ్ హేలీ  1682లో కనిపించిన ఒక తోకచుక్క ని క్షుణంగా పరిశీలించి, పాత తోకచుక్కల చరిత్రని అధ్యయనం చేసి,1456,1607లో కనిపించిన తోకచుక్కల మార్గం, దీని మార్గం ఒకేలా వుండటాన్ని గమనించి, తోకచుక్కలు సూర్యుని చుట్టు తిరగడం నిజమైతే ఈ తోకచుక్క మళ్లీ 1758లో కనిపిస్తుందని అంచనావేసాడు. దాని కక్ష్యను పరిశీలించి ఇది సుధీర్ఘమైన ధీర్ఘవృత్తాకార కక్ష్యలో పోతుందని, దాని వ్యాసం సూర్యునికి, అప్పటికి తెలసిన చివరి గ్రహం శని కంటే మూడురెట్లు ఎక్కువవుండాలని లెక్కించాడు. హేలీ 1742 లో మరణించాడు. ఆ తరువాత 1725 డిసెంబర్ 25 వతేది అదే కక్ష్యలో అదేతోకచుక్క మళ్లీ దర్శనమియ్యడంతో, తోకచుక్కలు సూర్యకుంటుంబానికే చెందిన సుదూరబంధువులు అనేది నిరూపితమైపోయింది. ప్రతి 76 సంవత్సరాలకు కుపియర్ బెల్ట్ నుంచి ఒకసారి వచ్చేఆ తోకచుక్క హేలి తోకచుక్కగా ప్రసిద్దమైపోయింది.

1986 హేలి తోక చుక్క


హేలితోకచుక్క కక్ష్యా మార్గం

No comments:

Post a Comment