Pages

23 July 2012

పెళ్లైన ఆడపిల్లవు కదా,ఎంతైనా,



అబ్బా, వచ్చి ఎంత కాలమయ్యిందో,
నాలుగు రోజులు వుండి పోదువు గానీ,
ఒక్కసారి, రారాదు....
ఫోన్ల మీద ఫోన్లు,
నిన్ను చూడాలని వుంది,
ఓ పది రోజులు నీ సమక్షంలో,
ఆనందంగా వుండాలని వుంది.
నువ్వులేని జీవితం,
నిలువున ఎండిపోతుందని.

పుట్టినింటిని పచ్చగా చూడాలని,
పరుగెత్తుకుంటు వస్తావు, నీవు.
సంతోషపు పూలు పూయిస్తావు, నీవు.
అప్పుడప్పుడు,
రావడం, రావడమే విరుచుకుపడతావ్,
ఉదృతంగా, ఊపిరితిప్పుకోనికుండా,
జీవితం చెల్లాచెదురు చేసికాని, వెళ్లవ్.

అలిగివస్తావో, ఆమోదంతో వస్తావో..
అప్యాయంగా గుండెలకు,
హత్తుకోవడమే మా పని,
ఎలా వచ్చినా నీవు.
లోపల్లోపలే, వెళ్లేలోపు
ఏ ఉపద్రవాని సృష్టిస్తావేమోననే,
అనుమానం పీకుతూనే వున్నా.

ఒక వారం, మహా అయితే ఓ నెల,
భరించచ్చు నిన్ను,
నిరంతరం ఇక్కడుంటానంటే మాత్రం,
గుండెలు పగులుతాయ్,
ఎంతైనా, పెళ్లైన ఆడపిల్లవు కదా.

కష్టాల కడలిలో వున్నప్పుడు,
అమృతాన్ని కురిపిస్తావ్,
అకాలంలో వచ్చి,
అష్టకష్టాల పాల్జేస్తావ్.
ఎలా వచ్చినా, స్వాగతించడమే,
నువ్వొస్తానంటే వద్దనేంత కరుకుగా,
ఈ గుండెలు మారలేదమ్మ, ఇంకా.

ఆకాశ వరునికి, నీటి వధువుని,
కన్యాదానమిచ్చిన,
భూమాత స్వగతం ఇలానే వుంటుందేమో.


28 comments:

  1. ఎంతయినా ఆడపిల్లేకదా! ఈడపిల్ల కాదు.

    ReplyDelete
    Replies
    1. కష్టేఫలి గారు , నా బ్లాగ్ కి సుస్వాగతం,
      మీరు చెప్పాక కాదనేదేముంది,సర్,

      Delete
  2. Replies
    1. శ్రీ లక్ష్మీదేవి గారు మీ అభినందనలకు ధన్యవాదాలు.

      Delete
  3. Replies
    1. జాన్ హైడ్ కనుమూరి గారు , నా బ్లాగ్ కి సుస్వాగతం,
      మీ అభినందనకు ధన్యవాదాలు.

      Delete
  4. Great applies to both rain and woman

    ReplyDelete
    Replies
    1. శిరీషా గారు , నా బ్లాగ్ కి సుస్వాగతం,
      మీ అభినందనకు ధన్యవాదాలు.
      రాసిన తరువాత నాకూ అనిపించిందండి,
      అన్ని పోలికాలున్నాయా అని.

      Delete
  5. మరదే రాకపోతే రాలేదని వచ్చి ప్రేమకురిపిస్తే ఇలా అంటారు:-)

    ReplyDelete
    Replies
    1. పద్మార్పిత గారు, మీ రాక మాకెప్పుడు సంతోషమేనండి. హి,హి

      Delete
  6. సర్, అత్తవారింటికి వెళ్ళిన ఆడపిల్ల పుట్టింటికి అస్తే ఇలాంటి భావనే కలుగుతుంది. ఎంత బాగా చెప్పారో, ఆమె రావాలి కానీ ఎలాంటి సమస్యలు తీసుకురాకుంటే బాగుండు ఇలాగే ఉంటుంది ఓ పుట్టింటి హ్రిదయం.

    ReplyDelete
  7. ఫాతిమా గారు, మీ అభినందనలకు ధన్యవాదాలు,
    చక్కగా విశ్లేషిస్తారండి, మీరు.

    ReplyDelete
  8. nice...
    alaagE untundemo :-)

    ReplyDelete
    Replies
    1. సీత గారు మీ అభినందనలకు ధన్యవాదాలు.

      Delete
  9. భాస్కర్ గారూ!
    చాలా చక్కని కవితా భావం...
    వర్ష ఋతువులో ఎక్కువ సార్లు రమ్మని చెప్పాలి..:-)..
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. అవును శ్రీ గారు వర్షాకాలమే వారి రాకకు మనం ఎదురుచూసేది. మీ అభినందనలకు ధన్యవాదాలు.

      Delete
  10. దీనిని కవిత కాదన్నవానిని
    కబాబ్ చేసుకొని తినేస్తా!!!!

    నువ్వసలు కవివే కాదన్నవానిని
    ఖైమా చేసేసి నీకు కూడ పెడతా!!!

    అంతాకలిగా ఉందా అని అంటావా....
    కాదన్నాయ్!!ఇదంతా హలీం హవా!!!

    ##### నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిందోచ్!!!

    ReplyDelete
    Replies
    1. నువ్వోచ్చేసావా, మళ్లీ, ఎంజాయ్ చేస్తూ అప్పుడప్పుడు కామెంట్లు చేస్తుండు, ఇంత కర్కశం గా రాయాల్సందేనా, ఆ ఫీలింగ్, నరమాంసభక్షకులమనుకుంటారు జనం, హి, హి,.....

      Delete
    2. Yes Bro'.... anukovadam enti??? that's what you are doing with your lines.. I am just joining you...he..he...

      Delete
    3. కవిత్వంతో బుర్రలు తినడమనేది మనతో మొదలైది కాదు చెల్లి,
      త్రేతాయుగం నాటికే ఈ కార్యక్రమం మూడుపువ్వులు , ఆరు కాయలుగా వర్ధిల్లుతుండేదట, చెవుల నుంచి రక్తం కారడం, నెత్తి నేలకేసి బాదుకోవడం, ఊరు వదిలి పారిపోవడం వంటివి సర్వసాధారణమట, కాబట్టి, నువ్వు కార్యరంగంలోకి దూకి, నీ కవిత్వ ప్రతాపాన్ని చూపించు తల్లి, హి,హి.

      Delete
  11. భాస్కర్ గారూ ఏం చెప్తున్నారో అనుకున్నా అండీ మొదట్లో.. ఆకాశానికి, వర్షానికీ, భూమికీ భలే వరసలు కలిపారు :)

    ReplyDelete
    Replies
    1. శుభ గారు , నా బ్లాగ్ కి సుస్వాగతం,
      మీ అభినందనకు ధన్యవాదాలు.నిజమేనండి, వరసలు భలే కలిసాయ్.

      Delete
  12. తిట్టండి ఇలాగే ... నన్ను ఇంకా నాలా పెళ్ళి అయిన వాళ్ళందరిని....
    బాగుంది..మీ కవిత్వం.

    ReplyDelete
  13. అబ్జెక్షన్ వెన్నెల గారు., మోడు వారిన జీవితాలకు చినుకుల జీవాన్ని విత్తేది, మీరని ఆకాశానికి ఎత్తినా, ఆడిపోసుకుంటున్నారు, , అందుకనే నండి మిమ్మల్ని ఆడవారు అనేది. హి, హి,....

    ReplyDelete
  14. రాజ్ కుమార్ గారు మీ అభినందనలకు ధన్యవాదాలు

    ReplyDelete