స్పందనల వర్షం కురుస్తుంది,
స్పందించి, స్పందిoచి,
స్పందనలు స్తంభించేదాకా,
ప్రతిదీ సాధారణీకరించబడేదాకా,
అప్పటి వరకు వర్షాకాలమే,
తరువాత శీతాకాలమే,
ఆపై వచ్చేది ఎండాకాలమే,
జీవితం చక్రభ్రమణమే.
వలల్లో ఇరుక్కున్నాక,
సోఫెస్టిఫికేషనే వుండదు.
మూలగాలి, గర్జించాలి,
కన్నీరు కార్చాలి, ఆలోచించాలి,
రహస్య ఒప్పందాలకు తెగబడాలి,
చివరుకు అలా వుండాల్సందే.
ఏ ప్రపంచంలోకి పరుగెత్తలేవు, ఊహలో తప్ప.
వున్నదాన్ని వున్నట్టే వుంచుకుందాం.
ముక్కు మూసుకొని, మన పని కానిస్తూ ఆనందిద్దాం.
ఇదంతా ఇంతే, ఏదైనా ఇంతే.
స్వేచ్ఛా జపం చేస్తూ,
ఇక్కడ భయాన్ని రేకెత్తించాల్సిందే.
దైవం పాటో,
దెయ్యం మాటో,
ఆయుధం పోటో,
ఏదో ఒకటి,
సమాజ రక్షకులుగా
బలమైనదాన్ని
బూచిగా చూపాల్సందే.
లేకుంటే ఇలా బలవ్వాల్సిందే.
సంఘటనల్లేని జీవితం,
స్పందనల్ని చంపేస్తుందటూ,
కళ్లల్లో వత్తులేసుకొని,
స్పందించే వారి కాలాలు నడుస్తున్నాయ్.
దుఃఖమూ కాదు, సంతోషమూ కాదు,
శాడిజం అంతకంటే కాదు.
ఏదో ఒక స్థితి,
నాకు మాత్రమే తెలుస్తున్న,
అర్థం కాని పరిస్థితి.
రోటిన్ ప్రశ్నలతో,
తలతిక్క వాదాలతో,
సుసంపన్నమైన అజ్ఞానాన్ని,
వేదికలపై ప్రదర్శించుకొంటు,
కాలం గడిపేస్తుంటాం.
అటు చూడక, ఇటు చూడక
అది వినక, ఇది వినక
కదులు, కదులు, కదులు.
కళ్లు మూసుకొని,
నోరు కుట్టుకొని,
కదులు, కదులు, కదులు.
చెవులు కప్పుకొని,
రాత మానుకొని,
కదులు, కదులు, కదులు.
మెదడు నలగ్గొట్టుకొని,
నలుగురితో పాటుగా,
గొర్రలాగా, బర్రెలాగా, గానుగెద్దు లాగా,
కదులు, కదులు, కదులు.
కదులు, కదులు, కదులు.
:))
ReplyDeleteవెన్నల గారు, మీ :)) లకు ధన్యవాదాలు.ha, ha, no vaadams.
ReplyDeleteThis is different:-)
ReplyDeleteపద్మార్పిత గారు, మీ different అభినందనలకు ధన్యవాదాలు.
Deleteమనం ఉన్న వేదిక అలాటిదే! మనం వేరు ఎందుకు అవుతాం?
ReplyDeleteమెప్పించే వ్రాతలు,విస్పోటనం చెందే ఆఅలోచనలు,రగిలే వేదనలు.. నిత్య కృత్యం.
రాతి బండలా..కరకు గుండెలా..
సాగుతూ ..సాగుతూ.. మనం అందులోని వారమే!!
మనం వేరు కాలేం..ఏదో అద్భుతం జరిగి మారితే తప్ప :))
(దురదృష్టం ఏమంటే మారాలని ప్రయత్నించం ) :(:(
వనమాలి గారు ధన్యవాదాలు,
Deleteమార్పు సహజమైనదే, మన ఇష్టాలు,అభిప్రాయాలు అందులో భాగమవుతాయా లేదా అనేది చాలావరకు మన చేతుల్లో వుండదేమో, కానీ అందరమూ భాగముందనే ఫీల్ అవుతుంటాము, ఆ క్రెడిట్ అంతా మార్పుదే, నా దృష్టిలో.
ట్రీ భాస్కర్ గారూ...
ReplyDeleteముందు ఆ డిస్‌క్లెయ్‌మర్ తీసేయండి ప్లీజ్... చాలా ఇబ్బందిగా ఉంది.
మీరు వ్యక్తీకరించిన ఆ అభావ స్థితి ఏ కొద్దిగానో ఆలోచించగలిగిన వారందరూ మౌనంగా అనుభవిస్తున్నదే. వారి వారి తార్కికత, నైతికత, సైద్ధాంతికతలను బట్టి వారి అభివ్యక్తీ, దృక్కోణమూ, విషయ విశ్లేషణా, పరిష్కారం కనుగొనే ప్రయత్నమూ... జరుగుతాయి. దానిపై భిన్నాభిప్రాయాలుండవచ్చు. కానీ... ఆయా దశలు దాటుతున్న తరుణంలో ఏదో ఒక దశలో మీరు చెప్పిన ఆ అభావం అందరినీ కాటేసి తీరుతుంది.
వాళ్ళు, వీళ్ళు అని కాకుండా అందరినీ ఉతికి ఆరేశారుగా :).
ధన్యవాదాలు.
ఫణి గారు, ఈ కవిత బాగుందో, లేదో నాకు తెలియదు కాని, మీ టపా కి కామెంటు రాద్దామనే మొదలు పెట్టానండి, అందుకనే ఆ కింది మాట. మీరు చక్కగా విశ్లేషించారు, అంతలోతు గా నేను ఆలోచించలేను, రాసుకుంటూ పోవడమే, సాగినంతవరకు,తరువాత తప్పోప్పులు నాకు తెలిసినంత వరకు సరిచేసుకోవడమే, నాది కవిత్వమనే నమ్మకం నాకింకా కలగలేదండి,అదోక నా ఫీలింగ్ అంతే.
ReplyDeleteమీకు నిజంగా ఇబ్బందిగా వుంటే తీసేస్తానండి.మీకు నా ధన్యవాదాలు.
your way of thinking is good.
ReplyDeleteతనోజ్ గారు మీ అభిమానానికి ధన్యవాదాలు,
ReplyDeletesir, meedi kavitwam kaadu ane anumaanam vaddu meeru chaalaa baagaa rastaaru nirmohamaatamgaa chaalaa koddi mandike ee dairyam untundi.
ReplyDeleteఫాతిమా గారు, కృతజ్ఞతలు, మీ అభిమానానికి, ప్రోత్సాహానికి ధన్యవాదాలు,
ReplyDelete