Pages

18 July 2012

ఆడతనం-మగతనం-స్వేచ్ఛాపతనం.-1 ( on guwahati)




అక్కడా,ఇక్కడా ఎక్కడంటూ
ప్రశ్నలనవసరం.
నిన్ననో, మొన్ననో
రేపో, ఎల్లుండో
ఇప్పుడిప్పుడేనో,
నవ నవలాడుతూ, తాజాగానే
ఎదురవుతూనే వుంటాయ్,ఎప్పుడూ...
ఎక్కడెక్కడున్నాడో మనిషి,
అక్కడక్కడల్లా ఓ సంఘటన.
సమస్యను గుర్తు చేస్తుందో,
సమాధానాన్ని వెతికిస్తుందో,
మూలాలను అన్వేషిస్తుందో,
సమర్ధకులవో, వ్యతిరేకులవో,
అహాలను,
రెచ్చగొడుతుందో, తృప్తి పరుస్తుందో.
కొత్త భయాలనో, గోడలనో
సృష్టిస్తుందో అది.

అన్నీతెలుసు, మనకన్నీ తెలుసు,
విడమర్చి చెప్పాల్సింది, ఏమీ లేదు.
సెల్ లో సొల్లులు,
నెట్ లో బూతులు,
అర్ధరాత్రి పబ్ లు,
విసిరేస్తున్న విలువలు,
పారేస్తున్న జీవితాలు,
సగం విరిగిన ఆకాశాలు,
అంతులేని అవకాశాలు,
విప్పేసిన విచ్చలవిడి కళ్లేలు,
అన్నీతెలుసు, మనకన్నీ తెలుసు.
అసలైన దాన్ని,
ఎప్పటికి ఎత్తిచూపం,
మారడమూ తెలుసు,
మార్చుకోమూ, మన రూపం.
మారుతున్నట్లు భ్రమిస్తాం,
మార్చుకున్నట్లు నటిస్తాం.
ఒక మార్పు నుంచి ఇంకో మార్పులోకి,
ఒక భ్రమ నుంచి ఇంకో భ్రమలోకి,
విచారాన్ని వ్యక్తపరుస్తూనే వుంటాం,
ఏది, ఎప్పటికి, మనల్ని
సంతోషంగా మిగలనివ్వదు.

ఇదోక స్వేచ్చాపతనం,
ఆడతనం - మగతనం,
కాదూ, కాదూ, కాదు,
ఎంత మాత్రం కాదు,
స్వేచ్చ యొక్క పతనం,
నిజమైన స్వేచ్చాపతనం,
క్షుద్ర ఆనందాల్నే జీవితమనుకొనేతనం,
ఇది,సిగ్గు పడాల్సిన తరుణం,
ఇది, మన లోపలి మూడోతనం.

                                                                                                     ( ఇంకా వుంది, మిగిలినది రేపు).



11 comments:

  1. భాస్కర్ గారూ..
    బాగుందండీ..!

    ReplyDelete
    Replies
    1. సీత గారు, మీ అభినందనలకు ధన్యవాదాలు.

      Delete
  2. మీ మనస్సు నేను గ్రహించాను.నేను మీ భావాలతో ఏకీభవించకపోవచ్చు. అందుకని, గౌరవం గా చదివి..ఊరుకుంటాను ఈ సారికి...:))

    ReplyDelete
    Replies
    1. వెన్నల గారు, నాదంతా అభావమే, ప్లీజ్ రేపు కూడా వూరుకోండి,మనకెందుకండి వాదాలు,అందుకే మీకు ధన్యవాదాలు.-..)

      Delete
  3. భాస్కర్ గారు చాలా బాగుంది అండీ...

    ReplyDelete
    Replies
    1. సాయి గారు, మీ అభినందనలకు ధన్యవాదాలు.

      Delete
  4. Manchi ni panchali..Cheduni dachi samharichali.. Papam antha Media dhey..First page lo values gurinchi cheputharu.. PAGE3 lo veluvalu leni vari gurunchi rastharu..

    ReplyDelete
    Replies
    1. రాజేష్ గారు , నా బ్లాగ్ కి సుస్వాగతం,
      మీ అభినందనకు ధన్యవాదాలు.అవును మంచిని పెంచాలి,
      అందరి సహకారం అవసరమే దానికి.

      Delete
  5. ethics? tough one man . good to be bad.

    ReplyDelete
  6. అవును తనోజ్ గారు, మంచిగా వుండటం కష్టమైన పనే,
    ప్రస్తుత సమాజంలో.

    ReplyDelete