నా ఆకలి గర్భాన్ని
నీ రెక్కల కష్టంతోను,
నా చీకటి అగాధలను
నీ జ్ఞానపు వెలుగులతోను
నింపావన్నది, ఎంతో కొంత సత్యమైనా,
నా జీవిత శిల్పాన్ని,
రాత్రింబగల్లు కష్టపడి చెక్కేవని,
నా వ్యక్తిత్వం మొత్తాన్ని,
ఆకాశమంతా ఎత్తున నిర్మించిన
మహోన్నత వ్యక్తి నీవని,
కొంత ఎక్కువ చేసైనా,
ఎంత ఉదాత్తంగా చెబుతామన్నా,
కడుపు కర్మాగారంలో
నాకో రూపాన్ని దిద్దిందనో,
ఈ పాపపు ప్రపంచం నుంచి
తొమ్మిది నెలలు భద్రంగా
కాపాడిందనో,
నొప్పుల వేదన మరిచి,
నన్ను నవ్వుతూ హత్తుకుందనో,,
ఎందుకో నాన్న,
అమ్మ ముందు నిలబెడితే,
నీకెప్పుడు రెండో ర్యాంకే.
(శ్రీ
గారి ఫాదర్స్ డే కవిత స్ఫూర్తితో)
(ఈ
బ్లాగుల సేకరణని చూడండి. http://100telugublogs.blogspot.in/)
anthE kadaa!
ReplyDeleteఅవునండి, అంతేనేమో, వనమాలి గారు.
ReplyDeleteనిజమే భాస్కర్ గారు రెండో ర్యాంకే ?
ReplyDeleteసాయిగారు, మీరు అంతేనంటారా,,,,,
Deleteమీ కవిత చాలా బాగుంది...
ReplyDeleteఅమ్మ అగ్రస్థానం లోనే ఉంటుంది...:-)
కానీ నేను కూడా మా నాన్నగారిలాగే
చాలా మంచి నాన్నని భాస్కర్ గారూ!...:-))
అందుకే ఈ ..ర్యాంకులూ....అవీ...ఇక్కడ...ఇంతమంది ...
మధ్య.....అవసరమా చెప్పండి???....:-)))
@శ్రీ
శ్రీ గారు, పోటి ఏమి లేదండి, ఇది ఫాదర్స్ డే రోజే రాసేసాను, మీ కవిత చదివాక, ఇద్దరు సమానమే నండి, ఆ 9 నెలలు + ఇంకో 9 నెలలు తీసేస్తే,హ,హ,....
Deleteఓ మంచి నాన్నకి నా అభినందనలు.
చాలా బాగావ్రాశారు. మంచి బ్లాగుని ఇన్నాళ్ళపాటు మిస్ అయ్యాను.
ReplyDelete'నాన్న ' అని బ్లాగు పేరు పెట్టుకుని 'భాస్కర్" అనే పేరుతో ఒకడు బ్లాగుల్లో వాగుతుంటాడు.. వాడూ మీరు ఒకరే కాదుగదా?
అజ్ఞాత గారు, నా బ్లాగు కి సుస్వాగతం అండి,మంచి బ్లాగ్ అని మెచ్చుకుంనందుకు ధన్యవాదాలు, ఆ బ్లాగ్ నాది కాదండి.
Deleteచాలా బాగుంది భాస్కర్ గారూ..!!
ReplyDeleteతల్లీ,'తండ్రీ' ,దైవం అన్నారు కదా అండీ..!!
best of yours :-)
సీతగారు, మీ అభినందనలకు ధన్వవాదాలు. అమ్మ తరువాతే కదండి, నాన్నా, దైవము.
Deleteచాలా బాగుందండీ..
ReplyDeleteమీరు చెప్పింది నిజమే నాన్నకెప్పుడూ రెండో ర్యాంకే ..
రాజీ గారు, ఇందాకా మీ పేరు పక్కన గారు మరిచాను, ఏమనుకోకండి, మీ అభినందనలకు ధన్వవాదాలు.
ReplyDeleteఅంతే అంతే రెండొ రాంకే నాన్నలందరికి.చాలా నచ్చింది నాకు మీకు ఇలా కవిత రాయలన్న అలోచన.
ReplyDeleteఅంతేనండి,అమ్మ తరువాతే కదా ఎవరైనా, మిమ్మల్ని పొగిడితే భలే ఆనంద పడతారండి, మీరు. ధన్యవాదాలు వెన్నల గారు.
ReplyDeleteCheekati Akhaatham aa?Agaadham aa?
ReplyDeleteఅజ్ఞాత గారు, నా బ్లాగు కి సుస్వాగతం అండి,మంచి సూచనకి ధన్యవాదాలు, మీరే రైట్ అండి, అఖాతము సరైన పదం కాదు, అగాధమే కరెక్ట్.
ReplyDeleteavunu kadaa..!! naanna ki eppudu rendo ranke..!! bhale baavundi
ReplyDeleteమంజు గారు, నాలుగు కవితలు చదివి అభినందిచినందుకు, మీ ప్రోత్సాహాన్ని అందించినందుకు,ధన్యవాదాలు,
Delete