మధురస్మృతి ...........సారా టీజ్డేల్
కనులలో మెరుపు,
చెక్కిల్ల ఎరుపు,
నను చేరిన సిగ్గుతో,
తలవాల్చిన వలపు
ఏమీ లేవక్కడ.
హత్తుకున్న అవ్యక్తానుభూతులు,
గిలిగింతల జ్ఞాపకాలు,
హృదయ నిశ్శబ్ధ గుసగుసలు,
వదలలేని మేని పులకింతలు
కొనసాగుతున్నాయ్ అక్కడ.
ఒక్కమాట లో చెప్పబడలేని
ఒకానొక అలౌకిక స్థితి,
కొన్ని మాటలు మాత్రమే,
చెప్పగల మధురస్మృతి.
గాఢనిద్రా కాదు,
మెలుకువా రాదు.
రెండు లోకాల సరిహద్దు రేఖ,
కలవరింతల ఆ కలతనిద్ర.
It is not a word – sara teasdale.
It is not a word spoken,
Few words are said.
Nor even a look of the eyes,
Nor a bend of the head,
But only a hush of the heart.
That has too much to keep.
Only memories waking.
That sleep, so light a sleep.
నా రాజ్యం చెదరనివ్వకండి. (re-post)
మాటలకందని మధుర గీతాన్ని,
పలవరిస్తున్నాయ్, నా పెదాలు.
మది జారవిడిచిన,
కొన్ని అస్పష్టామృత పదాలు.
కనుచూపు కదలికలు చురుకుగా కదలి,
ఏ దృశ్యాలను, వేటాడక్కర్లేదక్కడ.
ఏ కాలాలకో, ఏ బంధాలకో లోబడి,
బానిసనై,
విధేయతను చూపనక్కర్లేదక్కడ.
అది నా సంస్థానం,
కాలాకాలలు అక్కడ నా ఆధీనం.
జీవిత సంతోషాలన్నీ,
వెలుగులై ప్రసరిస్తూ,
నిశ్శబ్ధ హృదయ అఖాతాల
జ్ఞాపకాల వెల్లువకు,
మేలుకొలుపు గీతం, ఆ సమయం.
నా కలల నిద్రా సమయం.
ష్.... సవ్వడి చేయకండి.
నా రాజ్యం చెదరనివ్వకండి.
(రచయిత్రి సారా టీజ్డేల్ గారికి, ప్రేరణ ఇచ్చిన మూర్తి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.)
ఈ రెండు అనువాదాలలో మూలానికి దగ్గిరగా వున్నది
ఏదో మీరు చెప్పాల్సిందే.
నాకు మీ మొదటి అనువాదం మూలానికి దగ్గరగా తోచింది.
ReplyDeleteఇంత క్లిష్టం గా సమస్య ఇస్తే ఎలా భాస్కర్?
ఏదో సరదాగా ఆత్మీయ చమత్కారం
రెండు అనువాదాలు బాగున్నయి
thank you phalguni garu, you are most welcom andi, comments saradaga untene bhaaguntai kadandi.
ReplyDeleteఅనువాదం బాగా చేసారండి!
ReplyDeleteబాగుంది భాస్కర్ గారు
thank you vennela garu, most welcom.
Deletegood work..
ReplyDeletegood translation...
congrats bhaskar...
@sri
thank you sree,
Deletethank you again not putting "garu" at end.
ha, ha, ha,
భాస్కర్ గారూ,
ReplyDeleteనిజానికి రెండూ స్వేచ్ఛానువాదాలే. కానీ రెండూ వాటి కాళ్ళమీద నిలబడగల సమర్థత ఉన్నవే. మీ కృషి మెచ్చుకోదగ్గది. ఇతర కవులని కూడా ప్రయత్నించండి. విడిచిపెట్టకండి.
అభినందనలు.
ధన్యవాదాలు సర్, సారాటీజ్డల్ కవితలు కొన్ని చేసిన తరువాత వేరే కవులవి ప్రయత్నిస్తానండి.
ReplyDeleteచాలా బాగున్నాయండీ రెండు అనువాదాలు...రచయిత్రిలోని భావాలని చక్కగా అనువదించగలిగారు...అభినందనలు..మీనుండి మరిన్ని ఆశిస్తూ...
ReplyDeleteకృతజ్ఞతలు వర్మగారు, మీ అభినందనల ఉత్సాహంతో మరన్నిరాయడానికి ప్రయత్నిస్తానండి.
ReplyDeleteనాకు మొదటిదే బాగా నచ్చిందండీ.. :-)
ReplyDeleteనిషిగంధ గారు, అనువాదాన్ని మెచ్చినందుకు ధన్యవాదాలు.
ReplyDeletesarahhhh ahhhhhhhhhhhhhhhhhhhhhhh
ReplyDeletethanooj garu, keep silence, thank you,,,shhhhhh....
ReplyDelete