Pages

16 July 2012

బ్లాగు ప్రతిజ్ఞ (తెలుగు బ్లాగర్ల కోసం )


బ్లాగు ప్రతిజ్ఞ
బ్లాగులే నా కలల ప్రపంచం, బ్లాగర్లందరు నా స్నేహితులు.
నేను నా  బ్లాగును ప్రేమించుచున్నాను.
సుసంపన్నమైన నా ఊహాశక్తి,
బహువిధమైన నా రచనాశక్తి నాకు గర్వకారణం.
విభిన్నంగా, విలక్షణంగా, కీర్తివంతంగా
నా బ్లాగ్ ను తీర్చిదిద్దడానికి సర్వదా నేను కృషి చేస్తాను.
గూగుల్, వర్డ ప్రెస్, అగ్రిగేటర్లు, సీనియర్ బ్లాగర్లందరిని నేను గౌరవిస్తాను. ప్రతి బ్లాగర్ తోను మర్యాదగా నడుచుకొంటాను.
తోటి బ్లాగుల పట్ల అభిమానంతో ఉంటానని,
చదివిన ప్రతి టపాకు వీలైనంతవరకు సహృదయ వాఖ్యలు చేస్తానని, ఎన్ని కష్టాలెదురైనా, ఎన్ని నష్టాలొచ్చినా టపాలు రాస్తూనే వుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.
తెలుగు బ్లాగుల శ్రేయోభివృద్దులే నా ఆనందానికి మూలము.
సూచనలు
1. ప్రతిరోజూ బ్లాగు తెరిచేముందు బ్లాగు ప్రతిజ్ఞ చేయాలి.
2.  ఈ లింక్ ను ప్రమోట్ చేయాలి, లేదా దీన్ని కాఫీ చేసి, మీ బ్లాగు నుంచి పోస్ట్ చేయాలి. బ్లాగు ప్రతిజ్ఞ  కి తగిన ప్రాచుర్యం కల్పించాలి.
3. పూర్తిగా చేయలేని పక్షంలో, చివరి వాఖ్యం చాలు.

35 comments:

  1. బావుంది మీ బ్లాగు ప్రతిజ్ఞా....

    ReplyDelete
    Replies
    1. మంజుగారు, మీ అభినందనలకు ధన్యవాదాలు.

      Delete
  2. Replies
    1. శ్రీ , మీ అభినందనలకు ధన్యవాదాలు.
      ఇంతకి ప్రతిజ్ఞ చేశారా

      Delete
  3. Replies
    1. వనమాలి గారు, మీ చిరునవ్వుకి ధన్యవాదాలు.

      Delete
  4. haha...super :)
    entayinaa meeku meere sati bhaskar garu :)

    ReplyDelete
    Replies
    1. సీత గారు , మీ అభినందనలకు ధన్యవాదాలు.
      ఇంతకి ప్రతిజ్ఞ చేశారా,

      Delete
  5. భాస్కర్ గారూ,
    మీ బ్లాగు ప్రతిజ్ఞ బాగుంది.
    అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. మూర్తి గారు , మీ అభినందనలకు ధన్యవాదాలు.

      Delete
  6. Replies
    1. నారాయణ స్వామి గారు , నా బ్లాగ్ కి సుస్వాగతం,మీ అభినందనలకు ధన్యవాదాలు.

      Delete
  7. భాస్కర్ గారూ,
    యెవరూ పుట్టించకపోతే ప్రతిజ్ఞలు యెలా పుడతాయి?
    వేసుకోండి రెందు వీరతాళ్ళు.
    జయహో.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం గారు, అయితే నేను పరీచ్చ లో నెగ్గినట్టే,
      మీ వీరతాళ్లకు అభినందనలు.

      Delete
  8. బాగున్నది ! బాగున్నది !!
    బాగున్నది !!! 'బ్లాగ్ ప్రతిఙ్ఞ' భాస్కర్ గారూ !
    బ్లాగర్ల పాఠశాలలు
    రాగలవేమో ప్రతిఙ్ఞ ప్రారంభింపన్ .
    ----- సుజన-సృజన

    ReplyDelete
    Replies
    1. మాస్టర్ గారు , నా బ్లాగ్ కి సుస్వాగతం,మీ అభినందనలకు ధన్యవాదాలు.

      Delete
  9. Replies
    1. సుజాత గారు , నా బ్లాగ్ కి సుస్వాగతం,మీ అభినందనలకు ధన్యవాదాలు.

      Delete
  10. Replies
    1. రసజ్ఞ గారు రెండు చిరునవ్వులు వదిలినందుకు ధన్యవాదాలు.
      నా కవితలకు కనీసం ఒక్కటన్నా వదలరు ఎందుకు.

      Delete
  11. భాస్కర్ గారు... కుశలమేనా? ఏమయ్యిందండి? ఇలా హట్టాత్తుగా ఈ ప్రతిజ్ఞలు???

    ReplyDelete
    Replies
    1. వెన్నల గారు,ఇంతకి ప్రతిజ్ఞ చేశారా,గీతం కూడా సిద్దమయ్యుంది.హ,హ ఏమీ కాలేదండి, బళ్లో పిల్లల్నిచూసి,
      అలా రాసాను.

      Delete
  12. ok chivari vaakhyamto mugistunnaanu. deeniki saakshi bhaaskar gaare

    ReplyDelete
    Replies
    1. ఫాతిమా గారు,వినిపించిందండి, రోజూ చేసేయండి.

      Delete
  13. చాలా చాలా బాగుంది అండీ.. తప్పక చెయ్యడానికి ప్రయత్నిస్తాను....

    ReplyDelete
  14. ఫణి గారు, మీ చిరునవ్వుకి ధన్యవాదాలు.
    మీరు కామెంట్లతో బిజీగా వున్నట్లున్నారు.
    enjoy, ha, ha,....

    ReplyDelete
  15. శిశిర గారు , నా బ్లాగ్ కి సుస్వాగతం,మీ అభినందనలకు ధన్యవాదాలు.

    ReplyDelete
  16. విజయ మోహన్ గారు, మీ చిరునవ్వుకి ధన్యవాదాలు.

    ReplyDelete
  17. కృతజ్ఞతలు సాయి గారు, ఏదో సరదాగా అలా

    ReplyDelete
  18. బావుంది మీ బ్లాగు ప్రతిజ్ఞ..

    ReplyDelete
  19. జ్యోతిర్మయి గారు , నా బ్లాగ్ కి సుస్వాగతం, మీ అభినందనలకు ధన్యవాదాలు.

    ReplyDelete
  20. నించొని ల్యాప్టాప్ మీద చెయ్యి పెట్టి చెయ్యాలాండీ? ;) ;)హహహ

    ReplyDelete
    Replies
    1. రాజ్ కుమార్ గారు నా బ్లాగ్ కు స్వాగతం, గుండెల పై చేయి పెట్టుకోని చేసినా ఫరవాలేదండి. హ,హ.......

      Delete
  21. ధన్యవాదాలు కావ్యాంజలి గారు.....

    ReplyDelete