"సుమనోగతం
"
ఆకాసమును మబ్బులు చుట్టినట్లు,
ఆలోచనలు,మనసుని కప్పెస్తున్నాయ్.
ఏదో తెలియని ఆవేదన,
అంతులేని నిరాశ
మిగిలిపోతున్నాయ్,
దూరం తప్పదేమోనని.
అస్తమించే సూర్యునికైన ఆశ
వుంది,
ప్రత్యూష కిరణాలతో పలకరించ
వచ్చని,
అప్యాయంగా స్పృశించవచ్చని,
కాని, నా ఆశలు మాత్రం
కల్లలవుతున్నాయ్,
ఊహలతో పాటుగా చిద్రమవుతున్నాయ్.
ప్రతి కదలికను
మెదడు బంధించి దాచుకంటే,
ఇష్టమేమో అనుకున్నాను.
ప్రతి చిరునవ్వుని చూడాలని,
కనులు ఆతృత పడుతుంటే,
అందాన్ని ఆరాధించడమనుకొన్నాను.
రాసిన ప్రతి అక్షరం,
నీ రూపు సంతరించుకొంటుటే,
కవితావేశమేమో అనుకున్నాను.
ప్రతిక్షణం హృదయం,
నీకై ఆరాటపడుతుంటే,
అభిమానమనుకొన్నాను.
కానీ, అన్నీ ఒక్కసారే
చుట్టుముట్టినప్పుడు,
అంతకు మించిన
భావమేదో కదులుతుంది,
మనసుపొరల్లో, అస్పష్టంగా.
ఎప్పుడైన నా ఉనికిని,
గమనిస్తావేమోనని ఆశపడతాను.
ఏనాడైన నీ కనులు, నా కోసం
వెతుకుతాయేమోనని ఆరాటపడతాను.
పొరపాటునైన,
నీ పెదవుల వెంట నా కోసం,
పదాలు జాలువారుతాయేమోనని,
నిరీక్షిస్తుంటాను.
జరగవని తెలుసు,
అయినా,
ఎదురు చూస్తుంటాను ఆతృతగా,
చివరకు కొంచం వ్యాకులపడతాను,
అలవాటైన అసంతృప్తితో.
గోదారి ప్రవాహాలపైన,
కాలంలా జారిపోతున్న,
తెరచాప పడవలను చూస్తూనో,
చిమ్మచీకటిలో,
వానచినుకులు స్పృశించే,
స్పర్శను అనుభవిస్తునో,
నీలాకాశంలో,
చందురునితో దోబుచులాడే,
మేఘాలను వీక్షిస్తునో,
గడపడం నిజమే కావచ్చు, కానీ,
అనుభవాలు, అనుభూతులుగా మిగలాలంటే,
అందమైన జ్ఞాపకాలు కావలంటే,
నీ సాంగత్యం తప్పనిసరేమో.....
నీతో పంచుకోని అనుభూతుల
వెక్కిరింతలు,
భరించలేనివైనపుడు,
ఉహలందు బతకడం,
తప్పనిసరి అనిపించినప్పుడు,
ఒంటరిగానే మిగిలిపోతున్నాను.
ఇష్టాన్ని పెంచుకోవడం,
ఓ నేరమేమో ....
మౌనం అడ్డుగోడల మధ్య.
కొద్ది రోజుల్లో విడదీయడానికి,
కాలం సంకల్పిస్తుందేమో.
స్నేహం చేస్తున్న విరహం,
నన్నావరించుకోని,
నాతోనే, మిగిలిపోతుందేమో....
కాలాన్ని ఆపలేని అశక్తత,
నీలో స్పందన రేకిత్తించలేని
అసమర్ధత,
ఏమీ చేయలేని నిస్సహాయత,
అన్ని కలసి, ఒక్కసారే చుట్టుముట్టి
నాపై నాకు జాలిని
కలిగిస్తున్నాయ్.
ఆకర్షించిన నీతో,
పరిచయాన్ని కాంక్షించాను.
మాటలాడటానికే,
కొన్ని నెలలు నిరీక్షించాను.
ఇక స్నేహానికి సంవత్సరాలు,
ప్రేమించాలంటే యుగాలు
కావాలేమో....
కాలేజి కారిడార్లో,
అశాంతిగా నిలబడి,
మౌనంగా ఆలోచిస్తుంన్నప్పుడు,
నిశ్శబ్ధం నీ రూపు దాల్చుకొని,
వడివడిగా నన్నల్లుకొంటుంది.
ఒక్కోసారి అనుకొంటుంటాను,
ఏమిటదంతా,
ఏమైపోతుంది నాకు, అని.
అంతలోనే,
నీపై ఇష్టం తాలూకు ఛాయలు,
నన్ను అదుపు చేస్తాయి.
మళ్ళీ నేను మిగిలిపోతాను,
నీ ఆలోచనల మధ్య ఒంటరిగా,
నీతో పాటుగా.
వేదన అనుభవిస్తూ,
అసంతృప్తితో,
రాజీపడాల్సిరావడం,
నిజంగా దురదృష్టం, కానీ
వాస్తవాన్ని అంగీకరించాల్సిందే,
తప్పదు కదా, ఎవరికైన.
మనసుని బాధించాలనే,
కొన్ని పనులు ఎన్నుకుంటామేమో!
తెలిసి, తెలిసి
ఊబిలో ఇరుక్కుంటామేమో!!
ఇష్టం ఎందుకు పెరిగిందన్నది,
ఓ జవాబు లేని ప్రశ్నగా,
అర్ధంకాని సమస్యగా,
మారుతుంది సుమా, ఇప్పుడు.
అలాగని,
ఇష్టపడిందెందుకని,
ఆలోచించలేదెప్పుడు.
స్పటికంలా ప్రేమ,
స్వచ్చంగా మెరుస్తున్నా,
ఎందుకనో, మసిపూసి
హృదయపు అట్టడుగు పొరల్లో
దాచేశాను.
లావాలా ఎగచిమ్మి
కాల్చేస్తున్నప్పుడు,
నిశ్శబ్ధంగా భరించాను,
నిన్నో, నీ నవ్వునో తలుచుకొంటూ...
మనసున దాచుకోని
మౌనంగా ఆరాధించడం,
కొంతకాలం,
ఓ అద్భుతమైన అనుభూతి కావచ్చు.
కాని, అది తప్పని సరి అయినప్పుడు,
అంతకు మించిన శిక్ష,
మరొకటి ఉండదేమో.
అయినా,
ఇష్టపడ్డవారందరూ,
మనల్ని ఇష్టపడాలనుకోవడం,
మూర్ఖత్వమవుతుందేమో???
కలసి వున్నకొలది కాలం,
నీకై వేచి చూడడానికో,
నీ ఊహల్లో మునగడానికో,
నీపై ఇష్టాన్ని పెంచుకోవడానికో,
సరిపోయింది, నాకు.
నీ నవ్వులు చాలనుకున్నాను,
నన్ను నేను మోసం చేసుకొన్నాను.
నా మాటలో, నా చేష్టలో
నినెక్కడ వేదనకు,
గురిచేస్తాయేమోననుకొని,
దూరంగా మిగిలిపోవాలనుకుంటూ,
నన్ను నేను వంచించుకున్నాను.
అవకాశాలు వచ్చే మార్గం లేక,
సృష్టించే శక్తి లేక,
ఈ ప్రేమను పంచుకోలేక,
నాలో నేను కుమిలిపోయాను.
కలవడం సాధ్యంకాని,
మరువని జ్ఞాపంకంగా,
మిగిలిపోతావేమో సుమా , నీవు.
పెంచుకున్న బంధాలను,
తెంచుకొనే మార్గాలను,
అన్వేషిస్తూ,నేనిలా .
అమ్మో ఈ భగ్నప్రేమ ఇంత భగ్గుమందాండి:)
ReplyDeleteJust kidding. Its very nice.
ha,ha, ha, entha opikandi meeku ,motham chadivi kooda comment pettarante, hatsoff,
ReplyDeletethank you srujana garu, welcom.
చివరివరకు ఆసక్తిగా చదివేలా రాసారు.
ReplyDeleteబాగుందండి.
thank you padmarpitha garu, welcom.
ReplyDeleteఎంత పెద్ద కవిత రాశారండీ! ప్రేమ పై ఎంత రాసినా చిన్నదే అవుతుంది కదూ...
ReplyDeleteమొదలెడితే చివరికంటా చదివేలా చేసింది.
అభినందనలు...
thank you chinni asha garu, welcom.
ReplyDeletevery good man . good .try to use abstract words which will make the poem beautiful.any way its good.
ReplyDeletenijame, manchi padaalu leni lotu kanipisthundi,
ReplyDeletenaaku thelisina padaalu chaalaa thakkuva kavadame kaaranamemo,
i will try to use some good words, thank you thanooj
bhaaskar gaaroo, prema entha peddado leka anthagaa vivarinchindi, baagundi manchi baavamtho
ReplyDeletethank you fathima garu, mee abinandanalaku, welcom
ReplyDeleteభాస్కర్ గారు, ఇంతకు ముందు చదివానా ఈ కవిత నేను?
ReplyDeleteఅయినా మొత్తం మళ్ళీ చదివాను.. ఎంత చక్కగా ఉందో!!
మీకు తప్పట్లు!
వెన్నల గారు, మళ్ళి తప్పట్లతో అభినందించినందుకు, మళ్లీ కృతజ్ఞతలు.
Deleteచాలా బావుంది మీ భగ్న ప్రేమలేఖ...మీ ప్రేమ భగ్నం కాకుండా సఫలం కావాలని కోరుకుంటూ...
ReplyDeleteచాలా బావుంటాయి మీ కవితలు
ఎప్పుడో భగ్నమయిందండి మంజు గారు, ఆ ఉత్తరమే మిగిలింది, మీ అభినందనలకు కృతజ్ఞతలండి.
Deletetouching!
ReplyDeleteవి. చిన్ని గారు నా బ్లాగ్ కి స్వాగతం, మీ అభినందనలకు ధన్యవాదాలు. మీ రాక మాకెంతో ఆనందమండి.
DeleteO nestama kadanaku kanna kalalu kanniti kalavala palu cheyaku na hrudayam kunjaram vale krisichipotunnadi. Ambarani chumbiche anandam oka nimishamlo avaripotunndi. Me kavitha vigatajivudi smasanamlo niduristunna premikudini tatti nidra leputunnadi Subbu (AYOMAYAM ANTA GANDARAGOLAM)
ReplyDeleteha,ha, nidra levandi mari.
ReplyDeletesmasanamlo nidristunna mammalini tatti nidra lepalanukoku tattukoleru. Memu kavitvam modalupedatam
Deletetry your best,hi....
Delete