బెర్త్
దొరికిందని, సంబర
పడ్డాడు.
పై
లోకాలకని, తెలుసుకోలేక.
---------------------
నవ్వుతూ చెప్పారు, తుది వీడ్కోలు,
అనంత లోకాల, ఆఖరు పయనానికి.
---------------------------
అగ్ని ప్రళయం మసైంది , బోగి.
ఒకే దూకు, చావు నుంచి బతుకుకి.
--------------------------
యుగాంతం వ్యక్తిగతం.
అర్ధమైంది, అగ్ని కబళిస్తున్నప్పుడు.
----------------------------------
చావుకి,
బతుకుకి,సన్నని గీత.
రైలు
బోగిలో, ఆ మెలుకువ.
--------------------------------
సెలవు దొరక్క, ప్రయాణం ఆగింది.
ప్రాణదాత, ఆ ఆఫీసర్.
---------------------
మెరిసే భవిష్యత్తుకి, పయనమైనారు.
టిక్కెట్టు ఖరీదు,ఓ జీవితం.
---------------------
గాఢనిద్రలో, పీడ కలలేమో,
కాలిన శరీరాల,హాహాకారాలు.
------------------------
భార్యాబిడ్డ, బయటపడ్డారు.
భర్త శవం ఆనందిస్తుందేమో.
--------------------
గుర్తు పట్టలేని, దేహం రోదిస్తుంది.
విలపిస్తున్న,రక్తబంధాన్ని చూసి.
---------------------------
కళాత్మకంగా ఏరాడు, కవి.
శవాల పైన కవితాక్షరాలు.
(రాయకుడదు అనుకున్నా, రాసినందుకు సిగ్గుపడుతున్న)