Pages

3 August 2012

శవాల పైన కవితాక్షరాలు,ద్విపదలు




బెర్త్ దొరికిందని, సంబర పడ్డాడు.

పై లోకాలకని, తెలుసుకోలేక.

---------------------

నవ్వుతూ చెప్పారు, తుది వీడ్కోలు,

అనంత లోకాల, ఆఖరు పయనానికి.

---------------------------

అగ్ని ప్రళయం మసైంది , బోగి.

ఒకే దూకు, చావు నుంచి బతుకుకి.

--------------------------

యుగాంతం వ్యక్తిగతం.

అర్ధమైంది, అగ్ని కబళిస్తున్నప్పుడు.

----------------------------------

చావుకి, బతుకుకి,సన్నని గీత.

రైలు బోగిలో, ఆ మెలుకువ.

--------------------------------

సెలవు దొరక్క, ప్రయాణం ఆగింది.

ప్రాణదాత, ఆ ఆఫీసర్.

---------------------

మెరిసే భవిష్యత్తుకి, పయనమైనారు.

టిక్కెట్టు ఖరీదు,ఓ జీవితం.

---------------------
గాఢనిద్రలో, పీడ కలలేమో,

కాలిన శరీరాల,హాహాకారాలు.

------------------------

భార్యాబిడ్డ, బయటపడ్డారు.

భర్త శవం ఆనందిస్తుందేమో.

--------------------

గుర్తు పట్టలేని, దేహం రోదిస్తుంది.

విలపిస్తున్న,రక్తబంధాన్ని చూసి.

---------------------------

కళాత్మకంగా ఏరాడు, కవి.

శవాల పైన కవితాక్షరాలు.

(రాయకుడదు అనుకున్నా, రాసినందుకు సిగ్గుపడుతున్న)

8 comments:

  1. కళాత్మకంగా కాదులెండి....
    కళ్ళెదురుగా కాలుతున్నట్లే
    కంటనీరు పెట్టించారు కవై....

    ReplyDelete
  2. రోజూ ఈ వార్తలు చదువుతుంటే చాలా బాధగా అనిపిస్తుంది..
    అక్కడి పరిస్థితుల్ని,ఆ పరిస్థితిలో వున్న వాళ్ళ భావాలని చాలా చక్కగా చెప్పారు.

    ReplyDelete
  3. భాస్కర్ గారూ, కంటి నీరు పెట్టించారు. మానవత్వం ఉన్న ఎవరైనా చలించేలా ఉంది మీ కవిత ..కాదు వాస్తవికత.

    ReplyDelete
  4. కదిలించేసారండీ..మరో సారి ఆ ఘోరం కదలాడింది ...

    ReplyDelete
  5. స్పందించేవాడు,స్పందింప జేసేవాడు కవి.
    మరోమారు విషాద ఘటనకి.. విచారం ఒలికిస్తూ..:(:(

    ReplyDelete
  6. శవాలపై కవితాక్షరాలు కాదు కన్నీటిధారలు:(

    ReplyDelete
  7. పద్మార్పితగారు,రాజిగారు,సీతగారు, వనమాలిగారు,ప్రేరణగారు, తనోజ్ గారు,ఫాతిమాగారు అందరికి స్పందిచినందుకు ధన్యవాదాలు.
    రాసి, పోస్ట్ చేసినందువలన కొంచెం ఇబ్బందికరమైన ఫీలింగ్ వెంటాడుతూనే వుందండి, ప్రమాదంలో మరణించినవారి ఆత్మలకు శాంతిచేకూరాలని ప్రార్థిస్తూ...

    ReplyDelete