Pages

20 August 2012

గ్లోబల్ వామింగ్ – భారతదేశం పై ప్రభావం ( 1st part )




గత కొన్ని సంపత్సరాలుగా  పర్యావరణ స్పృహ కలిగిన వారందరిలోను రగులుతూ, ఆందోళన రేపుతున్న రేపటి మహాసమస్య, అత్యంత వేగంగా విస్తరిస్తూ భయపెడుతున్న పెను ప్రమాదం గ్లోబల్ వామింగ్.

మన భూమిని ఆవరించివున్న,  వాతావరణంలోని వాయువుల సమతుల్యత, ఈ భూగోళాన్ని  కోటానుకోట్ల జీవరాశులకు ఆవాసయోగ్యంగా  మార్చగలిగింది. ఈ విశాల విశ్వంలో జీవగ్రహంగా భూమికి,  ప్రత్యేకతను ఆపాదించగలిగింది. ఈ భూమిని అత్యంత వేడిగాను లేదా అతి శీతలంగాను కాకుండా ప్రాణులకు తగినంత ఉష్ణోగ్రతను అందించుటలో ఈ వాతావరణం పాత్ర చాలా ముఖ్యమైనది.

భూవాతావరణంలో  నైట్రోజన్, ఆక్సిజన్ వాయువులు
99 శాతం వరకు ఉన్నప్పటికి, చాలా చాలా తక్కువ మోతాదులలో వుండే కార్భన్ డై ఆక్సైడ్, మీథేన్, నీటి ఆవిరి, నైట్రస్ ఆక్సైడ్ వంటి కొన్ని వాయువులు, భూమిని వెచ్చగా వుంచడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. భూమి నుంచి పరావర్తనమై, తిరిగి అంతరిక్షంలోనికి వెళ్లిపోయే  సూర్యుని  ఉష్ణశక్తిని, భూవాతావరణంలోనే నిల్వవుండే విధంగా చేయడం ఈ వాయువులు చేసే ముఖ్యమైన పనులలో ఒకటి. దాని వలన భూమి జీవావరణానికి అనుకూలమైన పరిస్థితులను కలిగి వుండి, తగినంత వెచ్చగా వుండగలిగింది. ఈ వాయువుల సహకారం లేకపోతే భూమి ఇంకా, మంచు యుగంలోనే వుండి వుండేది. అందువలననే ఈ వాయువులను, హరితవాయువులు అని అంటారు.
ఈ వాయువులు కలుగచేయు ప్రభావాన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. 

ఇంత ఉపయోగకరమైన ఈ హరితవాయువులు, మనకిప్పుడు ఎందుకు ప్రాణాంతకంగా పరిణమించబోతున్నాయో, తెలుసుకోవలసిన సమయమిది. అత్యంత సహజమైన ఈ గ్లోబల్ వామింగ్ ప్రక్రియ, ప్రకృతిలో మానవుని మీతిమీరిన జోక్యంతో పెరుగుతూ, సకల జీవులకు ఎలా అనర్ధదాయకంగా మారబోతుందో 
అర్ధంచేసుకువాల్సిన తరుణమిది.

4 comments:

  1. మంచి సందేశాత్మక వ్యాసం.
    మొక్కలను నాటి వాతావరణం లోని
    కార్బన్ మోనాక్సైడ్,కార్బన్ డైయాక్సైడ్ ల
    దుష్ప్రభావాన్ని తగ్గించేలా చేద్దాం...
    తాను పచ్చగా ఉంటూ మనని పచ్చగా ఉంచే చెట్లను
    పరిరక్షిద్దాం...
    the tree భాస్కర్ గారి ప్రేరణతో....
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. శ్రీ గారు ధన్యవాదాలు, తాను పచ్చగా ఉంటూ మనని పచ్చగా ఉంచే చెట్లను
      పరిరక్షిద్దాం... మీరు రాసిన వాక్యాలు చక్కగా వున్నాయి, మనం చేయగల అతి గొప్పపని చెట్లను పెంచడమే.

      Delete
  2. భాస్కర్ గారూ, బ్లాగ్ నే "ట్రీ" గా మార్చిన మీతో సహకరిస్తాం.
    "చెట్టు నా ఆదర్శం "(ఇస్మాయిల్ ) "చిప్ కో మూవ్ మెంట్ "(భహుగుణ)
    ఆదర్శంగా తీసుకుందాం. మంచి పోస్ట్.

    ReplyDelete
  3. అవును ఫాతిమా గారు, చెట్ల కోసం పోరాడిన వారిని స్పూర్తిగా తీసుకోవలసిన అవసరం చాలా వుంది, మనం ముందు తరాలవారికి ఇవ్వవలసిన సంపద మంచి ప్రకృతేనని ప్రతి ఒక్కరు గ్రహించాలి

    ReplyDelete