Pages

2 August 2012

చిన్నచిన్న పిల్లలం






కొన్ని మంచిగీతాలను జనవిజ్ఞానవేదిక సి.ఎ. ప్రసాద్ గారు ఒక క్యాసెట్ గా తీసుకొచ్చారు. దానిలోని ఒక పాట ఇది. మా పిల్లలకి ఇష్టమైన పాట. వారి పైన తీసిన వీడియోనే పైది.
గీత రచయిత వి.ఆర్.శర్మ గారు, పాట పాడిన గాయని దివిజా కార్తీక్, సంగీతం అందించినది కార్తీక్. వ్యాఖ్యాత సి.ఎ. ప్రసాద్. 

చిన్నచిన్న పిల్లలం 
చిన్నచిన్న పిల్లలం - మల్లెపూల మొగ్గలం
చిన్నచిన్న పిల్లలం - మల్లెపూల మొగ్గలం
మల్లెపూల మొగ్గలం - రంగురంగుల ముగ్గులం
మల్లెపూల మొగ్గలం - రంగురంగుల ముగ్గులం
ప్రకృతి అందాలు చూద్దమా భలేభలే
పరవశించి గంతులెద్దుమా హుర్రేహుర్రే
చిన్నచిన్న పిల్లలం - మల్లెపూల మొగ్గలం
చిన్నచిన్న పిల్లలం - మల్లెపూల మొగ్గలం



స్వాతివాన చినుకుల్లో మనము ఒక చినుకవుదాం
సీతాకోకచిలుకల్లో మనము ఒక చిలకవుదాం
మనము ఒక చిలకవుదాం
సిరివెన్నల చంద్రమౌదమా భలేభలే
వెన్నల్లో సంద్రమవుదమా హుర్రేహుర్రే
చిన్నచిన్న పిల్లలం - మల్లెపూల మొగ్గలం
చిన్నచిన్న పిల్లలం - మల్లెపూల మొగ్గలం

జామచెట్ల తోటలోన రామచిలక మనమౌదాం
జాజిపూల చెట్టు కింద బావి గిలక మనమౌదాం
బావి గిలక మనమవుదాం
నిమ్మ పూల వాసనౌదమా భలేభలే
నింగిలోన మేఘమౌదమా హుర్రేహుర్రే
చిన్నచిన్న పిల్లలం - మల్లెపూల మొగ్గలం
చిన్నచిన్న పిల్లలం - మల్లెపూల మొగ్గలం


కృష్ణనది చుట్టుముట్టు దట్టమైన అడవవౌదాం
గోదావరి నది వడిలో పాడుతున్న పడవవౌదాం
పాడుతున్న పడవవౌదాం
మన ఊరి చెరువవుదామా  భలేభలే
చెరువులోన చేపవుదామా  హుర్రేహుర్రే
చిన్నచిన్న పిల్లలం - మల్లెపూల మొగ్గలం
చిన్నచిన్న పిల్లలం - మల్లెపూల మొగ్గలం
మల్లెపూల మొగ్గలం - రంగురంగుల ముగ్గులం
మల్లెపూల మొగ్గలం - రంగురంగుల ముగ్గులం
ప్రకృతి అందాలు చూద్దమా భలేభలే
పరవశించి గంతులెద్దమా హుర్రేహుర్రే
చిన్నచిన్న పిల్లలం - మల్లెపూల మొగ్గలం
చిన్నచిన్న పిల్లలం - మల్లెపూల మొగ్గలం
(lines are as in the song)

11 comments:

  1. చిన్నపిల్లలు నిజంగా అదృష్టవంతులు..
    ఎల్లలెరుగని ఊహాలోకం వాళ్ళ సొంతం..
    మీ పిల్లల ఆటలు, మీ వీడియో, పాట చాలా బాగున్నాయి.

    ReplyDelete
    Replies
    1. రాజిగారు, పిల్లల పాట, వీడియో మీకు నచ్చినందుకు, మీ అభినందనలకు ధన్యవాదాలు,

      Delete
  2. pillala aatalu manasuku aanandaaanni istaayi sir chaalaabaagundi

    ReplyDelete
    Replies
    1. ఫాతిమా గారు, మీ అభినందనలకు ధన్యవాదాలు.

      Delete
  3. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  4. Replies
    1. మంజు గారు, మీ అభినందనలకు ధన్యవాదాలు.

      Delete
  5. అంటే ఇది మా పాటనమాట :):):)

    ReplyDelete
    Replies
    1. ఈ పాట మీ లాంటి పిల్లల కోసమే రసజ్ఞ గారు.హ,హ,
      పాట నచ్చినందుకు ధన్యవాదాలు.

      Delete
  6. భాస్కర్ గారూ...
    చాలా బాగుంది :-)
    పిల్లలమే ఇప్పటికీ,ఎప్పటికీ ఇది చదువుకుంటే ;)

    ReplyDelete
    Replies
    1. సీత గారు ధన్యవాదాలు, పిల్లల వీడియో ఇంకొంచం బాగా తీసివుండాల్సింది, అనిపించిందండి.

      Delete