Pages

Showing posts with label బ్లాగు ప్రతిజ్ఞ. Show all posts
Showing posts with label బ్లాగు ప్రతిజ్ఞ. Show all posts

16 July 2012

బ్లాగు ప్రతిజ్ఞ (తెలుగు బ్లాగర్ల కోసం )


బ్లాగు ప్రతిజ్ఞ
బ్లాగులే నా కలల ప్రపంచం, బ్లాగర్లందరు నా స్నేహితులు.
నేను నా  బ్లాగును ప్రేమించుచున్నాను.
సుసంపన్నమైన నా ఊహాశక్తి,
బహువిధమైన నా రచనాశక్తి నాకు గర్వకారణం.
విభిన్నంగా, విలక్షణంగా, కీర్తివంతంగా
నా బ్లాగ్ ను తీర్చిదిద్దడానికి సర్వదా నేను కృషి చేస్తాను.
గూగుల్, వర్డ ప్రెస్, అగ్రిగేటర్లు, సీనియర్ బ్లాగర్లందరిని నేను గౌరవిస్తాను. ప్రతి బ్లాగర్ తోను మర్యాదగా నడుచుకొంటాను.
తోటి బ్లాగుల పట్ల అభిమానంతో ఉంటానని,
చదివిన ప్రతి టపాకు వీలైనంతవరకు సహృదయ వాఖ్యలు చేస్తానని, ఎన్ని కష్టాలెదురైనా, ఎన్ని నష్టాలొచ్చినా టపాలు రాస్తూనే వుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.
తెలుగు బ్లాగుల శ్రేయోభివృద్దులే నా ఆనందానికి మూలము.
సూచనలు
1. ప్రతిరోజూ బ్లాగు తెరిచేముందు బ్లాగు ప్రతిజ్ఞ చేయాలి.
2.  ఈ లింక్ ను ప్రమోట్ చేయాలి, లేదా దీన్ని కాఫీ చేసి, మీ బ్లాగు నుంచి పోస్ట్ చేయాలి. బ్లాగు ప్రతిజ్ఞ  కి తగిన ప్రాచుర్యం కల్పించాలి.
3. పూర్తిగా చేయలేని పక్షంలో, చివరి వాఖ్యం చాలు.