Pages

31 August 2013

రోబో కింగ్


1
అయ్యా,.నిన్నెవరన్నారు కాపరివని,.
ఒకవేళ అదే అయ్యుంటే నువ్వు,.
నీ ముందు తలకాయలొంచుకొని,.
ఆ పచ్చిక రాజ్యంలో, ప్రజలందరం,.
గొర్రెలమై,. ప్రశాంతంగా బతికేటోళ్లం,..

2
జోకుల్లో సర్దార్జీలను చూసి,.
పడిపడి నవ్వుకుంటున్నప్పడు,.
ఎక్కడో కొంచెం బాధుండేది,.

వాటినీ, తేలికగా తీసుకునే ,.
వాళ్లందరు ఇప్పుడు,.బహుశా,.
నిన్ను చూసి,.సిగ్గుపడుతుంటారేమో,..

3
నిర్భయం గా చెప్పుకోవచ్చు,.
నువ్వెప్పటికి కాపరివి కాలేవని,..
ఎక్కడి లోసుగులక్కడ,.
ఎక్కడి స్కాములక్కడ,.
ఎక్కడ గొడవలక్కడ,..
నీవెప్పటికి ,.కాపరివి కాలేవు,.
ఈ రిలయన్స్ రాజ్యంలో,.. ఏ ప్రజలకు,..

4
వెలుగు మార్గాల దారులు చూపి వుంటే,..
మార్గదర్శకుడనుకును వాళ్లం,..

సమున్నతంగా ఈ రాజ్యాన్ని,.
సర్వసత్తాక స్వతంత్రంగా పాలించివుంటే,.
ప్రభువువనుకునే వాళ్లం.,.

చిన్నచిన్న సమస్యలకైన,.
సరైనరీతిలో స్పందించివుంటే,.
మానవత్వం వున్న మనిషివనుకునే వాళ్లం,.

ఏమనుకోగలం ఇప్పుడు నిన్ను,.. తప్పైనా,..ఇలా తప్ప,.

5
నువ్వు,  అవునన్న,..కాదన్నా,.
గుడ్డలిప్పుకుతిరిగే,.పిల్లోడికైనా తెలుసు,.
నువ్వెవరన్నది,.ఈడ,..

 ఆధునిక భారత దేశ,.
అత్యున్నత ఆవిష్కరణవని,..

మానవరోబోవని,. 

30 August 2013

గుగాగీలు - 5


# ఒరేయ్,.శిష్యా ఎందుకలా,.
పాతకవిత్వంతో కుస్తీ పడుతూ,.
తల బొప్పికట్టించుకుంటావ్,..
ప్రశాంతంగా రాసుకోరాదూ,..
ఆధునికాంతర కొత్త కవిత్వం,.

@ యే పాతా,.కొత్త క్యా హై గుగా,..

# పిచ్చ (passion) తో  రాసేది పాతకవిత్వం ,...

చదివినోడికి పిచ్చెక్కించేది,..కొత్త కవిత్వం శిష్యా,..

ప్రాథమిక ముఖం


అప్పుడప్పుడే రగులుకుంటున్న,.
ఒక చిరుగాలి లాంటి ఆలోచనతో,..
అన్వేషణ ప్రారంభమౌతుంది,.

దొర్లుకొచ్చిన రోజుల్ని,.మళ్లీ వెనక్కి మళ్లించుకుంటూ,.
ఏ మసి అంటని ,  ఆ పసి ముఖాన్ని,.
ఒక్కసారైనా,..  కనులముందు
లీలగానైనా,.నిలుపుకోవాలని,.
తలపులతో ఒక్కసారైనా,.
తనివితీరా,. తడమాలని,..
తీవ్రమౌతున్న కోరిక కోసం,..
శ్రమిస్తుంటా,. ఒక్కోక్క శిథిలాన్ని పక్కకు నెట్టుకుంటూ,.

పయనిస్తూ,పయనిస్తూ,.
ఉదయిస్తున్న విసుగులను,..అస్తమింపచేస్తూ,.
వెనక్కు తిప్పుకుంటు,తిప్పుకుంటూ కాలాన్ని,.
ప్రయత్నం ప్రగాడమౌతుంది,.

తొంగిచూస్తూన్న నవ్వులను దాటి,
బంధ సముద్రాలు దాటి,.ఇక ఆతరువాత,.
రెండేరెండు సూక్ష్మకణాలలో,
విభజితమైన ఆ రూపాన్ని,...కనుగొనలేక,.
అదృశ్యాలవైపు,.నిరాశగా చూస్తూ,..
శ్రమను తుడుచుకుంటూ,..
కాస్తంత జ్ఞానంతో అనుకుంటానిలా.,.

అర్థరహితమైన ఓ ప్రాథమిక ముఖం కోసం,..
అంతుతెలియని మాయాన్వేషణ కోసం,.
ఇంత శోధన అసంబంద్ధమని,.
ఇక,.ప్రస్తుత వాస్తవ ముఖాన్నే ప్రేమించుకోవాలని,.


29 August 2013

తెలుగు భాషా దినోత్సవం మరియు జాతీయ క్రీడా దినోత్సవం

వాడుక భాషా గొడుగు,.గిడుగు వెంకటరామమూర్తి ,. మరియు హాకీ మాంత్రికుడు ద్యాన్ చంద్ , ఇద్దరు మహానుభావులకు,.. జన్మదినోత్సవ శుభాకాంక్షలు.



తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు, గిడుగు వెంకట రామమూర్తి. గ్రాంధికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది. శిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్దితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు. గిడుగు ఉద్యమంవల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ వీలైంది.గిడుగురామ్మూర్తి జయంతి ఆగష్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం” గా జరుపుకుంటున్నాము. (సేకరణ,. వికీపిడియా)

గిడుగు గారి గురించి,..చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్తిగారు,.
"ఏమైనా అభిమానమంటూ మిగిలిన ఏ పండితుడైనా, కవియైనా తన బిరుదాలూ పతకాలూ అన్నీ రామ్మూర్తి పంతులు గారికి దోసిలొగ్గి సమర్పించుకొని మళ్ళీ ఆయన అనుగ్రహించి ఇస్తే పుచ్చుకోవలసిందే"



హాకీ మాంత్రికుడు ద్యాన్ చంద్ 

పిల్లల్లో తగ్గిపోతున్న భాషాసక్తి,, క్రీడాసక్తిని పెంపొందింపచేసేందుకు,. 

తెలుగు మాట్లాడదాం,..,చదువుదాం,..,రాద్దాం,. 
ఆటస్థలానికెళ్ళి కొద్దిసేపైన ఆటలాడదాం,.పిల్లలతో,..

24 August 2013

ప్రమభరితం


1
అలా చూడు,. కొంచెం కళ్లు తెరుచుకుని,.
ఒక్కో ముఖాన్ని కాంతితో కడుగుతూ,..
అవకాశవాదాలతో,.
నిండు కుండల్లా,.
నాటకాల నేర్పరులు,.
భిన్నరూపాల్లో,.ఎలా కనిపిస్తారో నీకు,..

2
నాకు అడగాలనుంటుంది,.
నీతో పాటు ప్రతొక్కరిని,.

రాళ్లలాంటి,.పువ్వుల్లాంటి
పూలు,రాళ్లను చీల్చే ముళ్లలాంటి,.
మీ మనసుల్లో కాస్తా చొటిస్తారా,..
నన్నూ కొంచె ప్రేమిస్తారా అని,.

సమాధానం తెలుసుకోవాలన్న ఆసక్తే తప్ప,.
ప్రాధేయపడే ధైర్యం ఇంకా రాలేదేమో,...

3
ఈ మధ్యెందుకో,
ఆకాశం అందంగా,.,.
వాన చినుకు గీతంగా,.,.
చిగురుటాకుల సవ్వడి,
స్పష్టమైన సంగీతంలా,,.
సెలయేటి నడక,
ఓ సజీవపు పసి హొయలా,.,.
ఎందుకనో మరి ,..ఈ మధ్య,.

తలమడుల్లో,.నాట్లేసిన విత్తనాలేవో,
మొలకెత్తుత్తున్నాయనిపిస్తుంది.,

గుండెపొరల్లో,.కాస్తంత తడి
ఊరుతున్నట్లనిపిస్తుంది,.

ఈ మధ్యెందుకో,.
బతుకు భ్రమ కాదు,.ప్రమే అనిపిస్తుంది,.

4
జీవితానికి,.నువ్వు ఎలా మిగులుతావ్,.
అనేది మిధ్యా వాదం తప్ప,.
ఎప్పటికి సమస్యకాదు,.
నువ్వెలా బతుకుతున్నావన్నది,..తప్ప,.


18 August 2013

ఎ ప్రే ఫర్ ప్రేమ


1
నిదానంగా బాధ తొలిగిపోతు,..
ఆ స్ధాన్నాన్ని జాలి ఆక్రమిస్తుంది,..
నన్ను ప్రేమించిన నీ మీద,
నిన్ను ప్రేమించిన నా పైన,.

2
మిగిలిన గుర్తులను ,
చిక్కుముడుల్లాంటి ముద్రలను,
జాగ్రత్తగా తుడిచేసుకుంటూ,.విప్పుకుంటూ,
చెలరేగిన తేనటీగల్లా చుట్టుముట్టి,
కసిగా కన్నీటిని పీల్చేస్తున్న,
నీ జ్ఞాపకాల్ని విదిలించుకుంటూ,.
ఇన్ని గాయాల మధ్య,
ఎంత మామూలుగా వుందామన్నా,.
హృదయాన్ని శిలను చేస్తూ,.
క్షణక్షణానికి సాంద్రమైపోతూ,.
ఘనీభవిస్తున్న ఆలోచనల్లో,
బంధీనైపోతూనే వున్నానిక్కడ.

3
వలపు విలాసం,.విలాపమైన
నా విషయంలోనూ అదే సత్యమైనా,
ఇంత బాధలోనూ,.
అంత జాలి జడివానలా కురుస్తున్ననప్పుడు,
నాకెందుకో,
ఇంకా తడుస్తున్నట్లేవుంది,.నీ ప్రేమలో.


13 August 2013

పురాసత్యం



1
ఒక్కడుంటాడు,.
వేసిన ప్రతి అడుగును,.
మెత్తని చేతుల్తో,.పువ్వుల్లో ముంచి,.
పైకెత్తి చూపించగలిగే,,. నేర్పుగలిగిన వాడు,.
అస్పష్టతలలోని,..అద్భుతాలను
అర్థవంతంగా విప్పి చెప్పగలిగినవాడు,.

2
కావాలనే కుబుసాన్ని,.. కాలానుగుణంగా
బండలకు,. రుద్దుకుంటూ,. వదిలించుకోకపోతే,..
పట్టని పాతచర్మం తాలూకూ,..బాధ,.
నిన్నెప్పటికి,..నిలువనీయలేదు,.
కొత్తపుంతను.,. ఎలాగూ,.,.ఆపనూలేదు,..
మేఘాల్లా,..రూపాలు మార్చుకుంటూ,..
రసికులకు,,.రమణీయంగా,...
అరసికుల...అజ్ఞానానికి.. అయోమయంగా,..
భిన్నాభిప్రాయాలుండచ్చు,.
వాదోపవాదాలు జరగొచ్చు,..
దుర్గంలాగా చెదిరిపోని,.
నమ్మకాలు వుండివుండచ్చు,..
అయినా సరే,..
ఓ స్పష్టమైన నిజం ,.వుండితీరుతుంది,.
తెలిసిందే అనుకో,.


3
అర్థంకాని అయోమయాన్ని,.
సృష్టించడానికైనా,.. బుర్రనుపయోగించాల్సిందే,.

బరువైన పాత్రనై,.. నోళ్లు తెరుచుకుని
 ఆశ్చర్యాన్ని పలికించాల్సిందే,..అభినందించాల్సిందే,..

లోపలెంతగా నవ్వులెగురుతున్నా,..

8 August 2013

ఆబ్ స్ట్రాక్ట్


ఊహల క్రిందుగా
ప్రయత్నం ఎగురుతుంది,.
అగ్గిపూలవాన అడ్డుకుంటుంది,.

హిమపు చుక్కల ఆవిరి ప్రవాహం,.
పుప్పొడి రేణువులై రాలిపోతుంది,.

చురుక్కుమంటున్న,.
నరం చివరి అంచుకిది,.
అంతుచిక్కని కాళరాత్రి,..

కూయాల్సిన కోయలిప్పుడు,.
గూటిలోకి జారుకుంటుంది,.

ఘనీభవించిన కోరిక,.
అపసవ్యతలను,.
ఆసక్తిగా పరిశీలిస్తుంది,,.


శంఖం


1
వళ్లు విరుచుకుంటూ,..అంటానిలా,..
ఎవరూ పట్టించుకోనప్పుడు,.ప్రశాంతంగా  వుంటుంది,.అని,..

2
నీ వంకెవరూ చూడనప్పుడు,.
నువ్వెంత అశాంతిగా వుంటావో,.
నాకు తెలియనిదా,.

3
అయినా,. ప్రశాంతత,..అశాంతి  అనేవి,.
మనసుకు మనం అద్దుకునే రంజనాలు లాంటివి,..
పక్కనోళ్ల ప్రమేయం పెద్దగా వుండదేమో,..

4
బొక్కల బుగ్గలు సాగదీస్తూ,.
ప్రేమనింపుకున్న స్వరంతో,.
చెంపలు నియత్రించేంతటి చిరునవ్వుతో,.
సహనం నింపుకున్న ముఖంతో
ఇంకా,.ఇలా అంటుంది,..
ఎప్పుడూ చెప్పేదే అనుకో,.
ఇంకో మాట చెప్తాను,.వినుకో,..
నిన్ను అర్థం చేసుకోవడమే నీకు చేతకాదు,.,,..
ప్రపంచం నీకెల అర్థమవుతుంది,..
ప్రవచనాల పైత్యం కాస్తా తగ్గించుకోరాదూ,..
5
రోజూ చెప్పే పాఠాన్ని మళ్లీ చెప్తుంది,.,. మా ఆవిడ,.




6 August 2013

లకలకలక


తూట్లుతూట్లు పడినాఁక కూడ
లేచి నిలబడే వాడ్ని,.
ఏ తుపాకీ నిలువరిస్తుంది,..

ఒక్కో అడుగు కూడ దీసుకుంటూ,.
కడలై కదిలే, జనసంద్రాన్ని
ఎదుర్కోవడం,.ఎవడబ్బతరం అవుతుంది,..

శూలాలాంటి కలం మొనల,.
కరుకు మురికి గీతలతో,.
ఖర్చైపోతూ,.ఖరాబైపోతూ,.
కాళ్లవేళ్లాపడి,.బతిమిలాడి,.
కవిహృదయాన్ని కరిగించి,.
స్వచ్ఛంగా మిగలడం,..

ఏ తెల్లకాగితం వల్లవుతుంది,.