అప్పుడప్పుడే రగులుకుంటున్న,.
ఒక చిరుగాలి లాంటి ఆలోచనతో,..
అన్వేషణ ప్రారంభమౌతుంది,.
దొర్లుకొచ్చిన రోజుల్ని,.మళ్లీ వెనక్కి మళ్లించుకుంటూ,.
ఏ మసి అంటని , ఆ పసి
ముఖాన్ని,.
ఒక్కసారైనా,.. కనులముందు
లీలగానైనా,.నిలుపుకోవాలని,.
తలపులతో ఒక్కసారైనా,.
తనివితీరా,. తడమాలని,..
తీవ్రమౌతున్న కోరిక కోసం,..
శ్రమిస్తుంటా,. ఒక్కోక్క శిథిలాన్ని పక్కకు నెట్టుకుంటూ,.
పయనిస్తూ,పయనిస్తూ,.
ఉదయిస్తున్న విసుగులను,..అస్తమింపచేస్తూ,.
వెనక్కు తిప్పుకుంటు,తిప్పుకుంటూ కాలాన్ని,.
ప్రయత్నం ప్రగాడమౌతుంది,.
తొంగిచూస్తూన్న నవ్వులను దాటి,
బంధ సముద్రాలు దాటి,.ఇక ఆతరువాత,.
రెండేరెండు సూక్ష్మకణాలలో,
విభజితమైన ఆ రూపాన్ని,...కనుగొనలేక,.
అదృశ్యాలవైపు,.నిరాశగా చూస్తూ,..
శ్రమను తుడుచుకుంటూ,..
కాస్తంత జ్ఞానంతో అనుకుంటానిలా.,.
అర్థరహితమైన ఓ ప్రాథమిక ముఖం కోసం,..
అంతుతెలియని మాయాన్వేషణ కోసం,.
ఇంత శోధన అసంబంద్ధమని,.
ఇక,.ప్రస్తుత వాస్తవ ముఖాన్నే ప్రేమించుకోవాలని,.
No comments:
Post a Comment