1
ఒక్కడుంటాడు,.
వేసిన ప్రతి అడుగును,.
మెత్తని చేతుల్తో,.పువ్వుల్లో ముంచి,.
పైకెత్తి చూపించగలిగే,,. నేర్పుగలిగిన వాడు,.
అస్పష్టతలలోని,..అద్భుతాలను
అర్థవంతంగా విప్పి చెప్పగలిగినవాడు,.
2
కావాలనే కుబుసాన్ని,.. కాలానుగుణంగా
బండలకు,. రుద్దుకుంటూ,. వదిలించుకోకపోతే,..
పట్టని పాతచర్మం తాలూకూ,..బాధ,.
నిన్నెప్పటికి,..నిలువనీయలేదు,.
కొత్తపుంతను.,. ఎలాగూ,.,.ఆపనూలేదు,..
మేఘాల్లా,..రూపాలు మార్చుకుంటూ,..
రసికులకు,,.రమణీయంగా,...
అరసికుల...అజ్ఞానానికి.. అయోమయంగా,..
భిన్నాభిప్రాయాలుండచ్చు,.
వాదోపవాదాలు జరగొచ్చు,..
దుర్గంలాగా చెదిరిపోని,.
నమ్మకాలు వుండివుండచ్చు,..
అయినా సరే,..
ఓ స్పష్టమైన నిజం ,.వుండితీరుతుంది,.
తెలిసిందే అనుకో,.
3
అర్థంకాని అయోమయాన్ని,.
సృష్టించడానికైనా,.. బుర్రనుపయోగించాల్సిందే,.
బరువైన పాత్రనై,.. నోళ్లు తెరుచుకుని
ఆశ్చర్యాన్ని పలికించాల్సిందే,..అభినందించాల్సిందే,..
లోపలెంతగా నవ్వులెగురుతున్నా,..
మీ మూడవ స్టాంజా.. చాలా అద్భుతంగా ఉంది, చక్కని విమర్సనాత్మక భావం. బాగుంది భాస్కర్ గారు.
ReplyDeleteఫాతిమా గారు, ధన్యవాదాలండి,..మీ అభినందన సంతోషాన్నిచ్చింది,
Delete