Pages

Showing posts with label అనువాదము. Show all posts
Showing posts with label అనువాదము. Show all posts

15 February 2013

ఒక అనువాదం





ఎందుకని విలపిస్తారు,

నేను లేని, నా సమాధి ప్రక్కన నిలబడి,

మరణించని, నన్ను తలచుకొని, మిత్రులారా,..


నేనున్నాను ప్రతి గుండెలో, ప్రతి ఇంటిలో





నేనున్నాను, నా స్వప్న కాశ్మీరంలో,





మీకు వినిపిస్తుందా, నా స్వరం,.





వేల గొంతుకలలో ప్రతిధ్వనిస్తూ,.





..

ఆంగ్ల మూలం : ప్రియదర్శిని . ఢిల్లీ JNU 

Do not stond in my grave and cry



Iam not ther!



I did not die!


Iam in my country-kashmir



iam in every house, in every heart.



!
Hear my voice in their slogans.... 

7 December 2012

సారా టీజ్డేల్ - నేనెలా ఓదార్చగలనిప్పుడు.......



3
ఉప్పొంగే ప్రవాహాలతో,
కడలి అలలను హత్తుకోవాలని,
ప్రేమాతిశయంతో తపిస్తూ,
ఎలా ఉరకలెత్తుతుందో నది,
అలా నేనూ ఓ నదినై,
నీలో లయించాలనుకుంటాను,.
నిర్లజ్జనై, ఎంతగా వ్యక్తీకరించినా,
నీ సంశయాత్మక నిర్లక్ష్యపు లయల మధ్య,
నలిగినలిగి, నా ప్రేమ,.
నేలరాలిపోతూనేవుంది,కదూ...
2
ఒదిగిపోయిన కొమ్మలతో,
ముడుచుకుపోయిన రెమ్మలతో,
నిస్తేజమైన పత్రాల నిశ్శబ్ధంతో,
హోరున వాన కురుస్తున్నప్పుడు,
ఎలా ప్రశాంతమౌతుందో,ఓ తరువు,
అలా మృత్యువు వడిలో
సేద తీరేవేళ ఈ తరుణి,
ఎంతటి నిర్ధయతో నువ్వు,
నా ప్రేమను తృణీకరించావో,
అంతకు మించిన కాఠిన్యతతో,
నిన్ను నిరాదరిస్తుందేమో కదా,
ఒక్క చిరునవ్వుని చిందించక.....
1
సస్యశ్యామలమై అలరారే పుడమిని,
నీటి జాడే మిగలకుండా,
ఎలా మాడ్చేస్తుందో,మండే గ్రీష్మము,.
అలా అనుభూతులు ఆవిరైన,
నిర్జీవమైన నా దేహంపై,
గాయపడిన గుండెలతో,
తలవాల్చి,తల్లడిల్లే నిన్ను,
నేనెలా ఓదార్చగలను,..చెప్పు....
4
వర్షపుచుక్క, నీటిచెమ్మ కాదుకదా,
కనీసం మేఘమైనా కన్నెత్తిచూడని,
నిర్జన ఎడారులలో సాగిపోయే,
నీ ఏకాంత గమనాన్ని,
స్వర్గలోకపు గవాక్షాల నుంచి,
జాలిలేని, జేవురించిన వదనాలతో,
వీక్షిస్తుంటాయ్,ఆ తారకలు,..
మిలమిల మెరిసిపోతూ,
అనుక్షణం నన్ను నీకు గుర్తుచేస్తూ,..
5
దిమ్మరివై, తిరగితిరిగి అలసిపోయి,
పగిలిన హృదయంతో,
ఏ గాఢాంధకారాలలో,
మిగిలినప్పుడో,మరెప్పుడో,
మోకరిల్లక తప్పదు నీకు,
వెంటాడుతున్న నా ప్రేమ ముందు,...
స్పందనే లేక,నిశ్చలమైన ప్రేమ తటాకాన,
అంతులేని దాహార్తితో,
దోసిలి చాచి, నీవు ప్రేమ అర్ధించిననాడు,
అగ్నిలా దహించక మానదు ప్రియా,అది నిన్ను.....
-------------------------------------------------
1915లో ప్రచురించబడి,బెస్ట్ సెల్లర్ గా నిలిచిన రివర్ టు ది సీ అనే కవితా సంకలనం లోని కవిత ఇది,.ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి 18 సంవత్సరాల ముందు రాసిన, ఈ కవిత ఆమె లోని  ఆత్మహత్యా ధోరణిని చూపిస్తుందని విమర్శకులు అంటారు,. 1918లో  ఆమె పులిట్జర్ బహూమతిని అందుకుంది, విఫల ప్రేమలతో,విషాదకరమైన జీవితం ఆమెది,.
sara teasdale ... i shall not care..... 
1.
When I am dead, and over me bright april,
Shakes out her rain - drenched hair,
Tho’ you should lean above me broken hearted,
I shall not care.
2.
I shall have peace, as leafy trees are peaceful,
When rain bends down the bough,
And I shall be more silent and cold-hearted.
Than you are now,.
3.
I love too much; I am a river,
Surging with spring that seeks the sea.
I am too generous a giver,
Love will not stoop to drink at me,.
4.
His feet will turn to desert  places,
Shadowless reft  of rain and dew,
Where stars stare down with sharpened faces,
From heavens  pitilessly blue,.
5.
And there at midnight sick with faring,
He will stoop down in his desire,
To slake the thirst grown past all bearing,
In stagnant water keen as fire,.
 ------------------------------------------------------------------------------------
ఇది నా నాలుగవ అనువాదము,
రచయిత్రి సారా టీజ్డేల్ గారికి, ప్రేరణ ఇచ్చిన మూర్తి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.

15 July 2012

సారా టీజ్డేల్:: ఒక కవిత – రెండు అనువాదాలు


మధురస్మృతి ...........సారా టీజ్డేల్
కనులలో మెరుపు,
చెక్కిల్ల ఎరుపు,
నను చేరిన సిగ్గుతో,
తలవాల్చిన వలపు
ఏమీ లేవక్కడ.

హత్తుకున్న అవ్యక్తానుభూతులు,
గిలిగింతల జ్ఞాపకాలు,
హృదయ నిశ్శబ్ధ గుసగుసలు,
వదలలేని మేని పులకింతలు
కొనసాగుతున్నాయ్ అక్కడ.

ఒక్కమాట లో చెప్పబడలేని
ఒకానొక అలౌకిక స్థితి,
కొన్ని మాటలు మాత్రమే,
చెప్పగల మధురస్మృతి.

గాఢనిద్రా కాదు,
మెలుకువా రాదు.
రెండు లోకాల సరిహద్దు రేఖ,
కలవరింతల ఆ కలతనిద్ర.
It is not a word – sara teasdale.
It is not a word spoken,
Few words are said.
Nor even a look of the eyes,
Nor a bend of the head,
But only a hush of the heart.
That has too much to keep.
Only memories waking.
That sleep, so light a sleep.

నా రాజ్యం చెదరనివ్వకండి.   (re-post)


మాటలకందని మధుర గీతాన్ని,
పలవరిస్తున్నాయ్, నా పెదాలు.
మది జారవిడిచిన,
కొన్ని అస్పష్టామృత పదాలు.

కనుచూపు కదలికలు చురుకుగా కదలి,
ఏ దృశ్యాలను, వేటాడక్కర్లేదక్కడ.
ఏ కాలాలకో, ఏ బంధాలకో లోబడి,
బానిసనై,
విధేయతను చూపనక్కర్లేదక్కడ.
అది నా సంస్థానం,
కాలాకాలలు అక్కడ నా ఆధీనం.

జీవిత సంతోషాలన్నీ,
వెలుగులై ప్రసరిస్తూ,
నిశ్శబ్ధ హృదయ అఖాతాల
జ్ఞాపకాల వెల్లువకు,
మేలుకొలుపు గీతం, ఆ సమయం.
నా కలల నిద్రా సమయం.

ష్.... సవ్వడి చేయకండి.
నా రాజ్యం చెదరనివ్వకండి.

(రచయిత్రి సారా టీజ్డేల్ గారికి, ప్రేరణ ఇచ్చిన మూర్తి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.)
ఈ రెండు అనువాదాలలో మూలానికి దగ్గిరగా వున్నది ఏదో మీరు చెప్పాల్సిందే.


10 July 2012

నా రాజ్యం చెదిరిపోనీకండి .



మాటలకందని దివ్య గీతాన్ని,
కలవరిస్తున్నాయ్, నా పెదాలు.
మది జారవిడిచిన,
కొన్ని అస్పష్టామృత పదాలు.

కనుచూపు కదలికలు చురుకుగా కదలి,
ఏ దృశ్యాలను, వేటాడక్కర్లేదక్కడ.
ఏ కాలాలకో, ఏ బంధాలకో లోబడి,
బానిసనై,
విధేయతను చూపనక్కర్లేదక్కడ.
అది నా సంస్థానం,
కాలాకాలలు అక్కడ నా అధీనం.

జీవిత సంతోషాలన్నీ,
వెలుగుపువ్వులై  విరుస్తూ ,
నిశ్శబ్ధ హృదయ అఖాతాల
జ్ఞాపకాల వెల్లువకు,
మేలుకొలుపు గీతం, ఆ సమయం.
నా కలల నిద్రా సమయం.

ష్.... సవ్వడి చేయకండి.
నా రాజ్యం చెదరనివ్వకండి.

1 July 2012

.. పరిహారం ;; సారా టీజ్డేల్




వంటరితనపు వేదనను,
ఆనందపు జల్లుగానే,
అనుభూతి చెందుతాను, నేను.
విరిగిన ఈ రెక్కలతోటే,
వేల మైళ్ళ ప్రయాణానికైన,
సంతోషంగా,సిద్ధపడతాను నేను.
 దేహపు దుఃఖాన్ని,
జీవన సమరపు
గాయపు నొప్పుల్ని,
అలసిన ఈ హృదయంతోనే,
నవ్వుతూ భరిస్తాను, నేను.

తేజోవంతమైన దివ్యరూపం తో,
ఓ శీతాకాలపు రాత్రి
నిశ్శబ్ధంగా రాలిపోయే,
ఆకాశపు చుక్కలా, చిన్నదైనా సరే,
ఓ చక్కని ప్రేమామృత ప్రకాశ గీతాన్ని,
తృప్తిగా నేను, రూపొందించినట్లైతే.


===========
చిరస్ధాయిగా నిలిచే,
దృవతారలాంటి గేయాన్ని ఒక్కటివ్వు ప్రభూ,
సంతృప్తి గా అర్పిస్తా,
నా జీవితాన్నే,
నీకు పరిహారంగా.
(Teasdale committed suicide in 1933 )



Compensation
I should be glad of loneliness
And hours that go on broken wings,
A thirsty body, a tired heart
And the unchanging ache of things,
If  I could make a single song
As lovely and as full of light,
As hushed and brief as a falling star
On a winter night.
(ఇది నా రెండవ అనువాదము,
రచయిత్రి సారా టీజ్డేల్ గారికి, ప్రేరణ ఇచ్చిన N.S.మూర్తి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.)

22 June 2012

నేను అలానే : సారా టీజ్డేల్



కల్లోల కడలి లో,
వదలి వెళ్ళారు, నా వాళ్ళు.
నాకో నామాన్ని, ఈ రూపాన్ని,
హృదయనాదాన్ని,
వణికిపోతున్న ఓ ఆత్మదీపాన్ని,
నాకు అప్పగించి.

ఏ నిశీధీ తీరాల్లోకో,
చేరాల్సిన ఆ జ్యోతి,
ఇంత ఉజ్వలంగా,
దేదీప్యమానంగా ప్రకాశిస్తుందంటే నేడిలా,
నన్ను హృదయానికి,
ప్రేమగా హత్తుకున్న వారిదే కాని ఆ ఖ్యాతి,
సమాధుల్లో నిద్రిస్తున్న,
రక్తబంధాలది కాదు అని,
చెప్పగలను నేను, నిశ్చయంగా.

అస్థిత్వమే లేక రగులుతున్న,
ఓ మామూలు కొయ్య ముక్క,
కొట్టుకొనిపోతూ కూడా,
సముద్రపు నీలి అలల మధ్య,
రాత్రింబగల్లు,
ప్రకృతి అద్దిన సౌందర్యంతో,
కొత్త కాంతులు ఎలా వెదజల్లుతుందో,
అద్భుత దృశ్యాలకు ప్రతీకగా,
ఎలా నిలుస్తుందో,
నేనూ అలానే........
------------------------------------

(ఇది  నా తొలి అనువాదము, ప్రేరణ ఇచ్చింది N. S. మూర్తి గారి అనువాదలహరి బ్లాగ్. 

స్వేచ్చానువాదమో, అను సృజనో, ఏమంటారో నాకు తెలియదు కాని, నా పైత్యం కొంత కలసిపోయింది దీనిలో. సారా టీజ్డేల్ గారికి, N. S. మూర్తి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.)

Driftwood… Sara Teasdale




My forefathers gave me

My spirit’ shaken flame,
The shape of hands, the beat of heart,
The letters of my name.


But it was my lovers,
And not my sleeping sires,
Who gave the flame its changeful,
And iridescent fires.

As  the driftwood burning,
Learned its jeweled blaze
From the sea’s blue splendor
Of colored nights and days.