Pages

14 June 2012

ఒక హంబుల్ బిగెనింగ్


మెల్లమెల్లగా, మొత్తంగా
మొద్దు బారుతున్నట్టున్నా.....
ఏవేవో బంధాలు, సంబంధాలు,
నావి కాని అనుబంధాలు.......
స్పందనా రహిత తీరాల వైపుకి
బరబర ఈడ్చుకెల్తున్నట్లున్నాయ్.

అగోచరమైన సరిహద్దులేవో,
గోడలై అడ్డుపడుతున్నాయ్.
లోపల్లోపలే,
పొరలు పొరలుగా,
పేరుకుపోయిన స్వార్ధాల్ని,
ఘనీభవించిన స్తబ్ధతల్ని,
బద్దలుకొట్టుకుంటూ,
కోడిపిల్లలా,
ప్రకృతిలోకి పరుగెత్తలనిపిస్తుంది.

ఓ కొత్త ఐడెంటిటి కోసం.
సరికొత్త మన కోసం.
మనదైన జీవితం కోసం.
ఒక హంబుల్ బిగినింగ్ తో.
========================
next post :  భగ్నప్రేమ లేఖ (సుమనోగతం)

7 comments:

  1. this poem for SIVARAM garu, STEP, vijayavada.
    first time i heared that word "humble begining"
    from him, a JK follower.

    ReplyDelete
  2. బాగుంది భాస్కర్ గారూ!
    మీరు వ్రాసినట్లు వ్రాయడం కష్టమేనండీ!
    @శ్రీ

    ReplyDelete
  3. thank you sree garu,
    meeru chakkaga raastharandi,
    keep writing.

    ReplyDelete
  4. భాస్కర్ గారు, అంతా మిధ్య, భ్రమ...
    బంధాలు, సంబంధాలు, మీవి కాకపోయినా అనుభందాలు అన్నీ తెంచుకోగలమా?
    "ఓ కొత్త ఐడెంటిటి కోసం.సరికొత్త మన కోసం.మనదైన జీవితం కోసం.ఒక హంబుల్ బిగినింగ్ తో!"
    చాలా బాగుంది..!

    ReplyDelete
    Replies
    1. thank you vennala garu, anavasaramaina bhadhale ekkuvai pothunnai annipisthundandi appudappudu.

      Delete
  5. భాస్కర్ గారు.. చాలా బాగుంది అండి

    ReplyDelete