ఆగస్ట్ 15,1947
మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటికి, 1950 వరకు దేశంలో బ్రిటిష్ నాణేలే వాడుకలో
వుండేవి. మొదటిసారిగా 1950 ఆగస్ట్ 15 న, అశోకుని స్తూపం లోని గుర్తులతో తో మన తొలి నాణేలు మెట్రిక్ విధానంలో
విడుదల చేయబడ్డాయి.
1950 నుంచి1957 వరకు వున్న ఏడు రకాల నాణేలను
ఫ్రోజోన్ సీరీస్ (The Frozen Series 1950-1957 )గా వ్యవహరిస్తారు. వాటి లోని నాణేలు
1. ఒక రూపాయి నాణెము .
one rupee reverse. |
one rupee obverse. |
ఇది నికెల్ తో తయారైన నాణెము. దీని పైన ఒక వైపు మన జాతీయ చిహ్నం, మరో వైపు ధాన్యపు కంకి గుర్తు వుండేది.
2. అర్థ రూపాయి(8annas) నాణెము.( పై వివరణ దీనికి కూడా)
3. పావు రూపాయి (4 annas )నాణెము( పై వివరణ దీనికి కూడా)
4. రెండు అణాల నాణెము
ఇది క్యూప్రోనికెల్ తో తయారైన నాణెము. దీని పైన ఒక వైపు మన జాతీయ చిహ్నం, మరో వైపు ఎద్దు వుండేది.
ఎద్దు కూడా అశోకుని స్థూపం నుంచి తీసుకున్నదే.
5. ఒక అణా నాణెము. ( పై వివరణ దీనికి కూడా)
6. అర్థ అణా నాణెము. ( పై వివరణ దీనికి కూడా)
7. ఒక పైస్(Pice) నాణెము.
Bronz
గుర్రం కానీలనే వారు వీటిని. ఇది కాంస్యం తో తయారైన నాణెము. దీని పైన ఒక వైపు మన జాతీయ చిహ్నం, మరో వైపు గుర్రం వుండేది.
గుర్రం కూడా అశోకుని స్థూపం నుంచి తీసుకున్నదే.
ఈ అణాల లెక్క చూద్దాము ఒకసారి.
ఒక రూపాయికి పదహారు అణాలు. ( 1 Rupee = 16 Annas)
ఒక అణాకు నాలుగు పైస్(పావు అణాలు)(1 Anna = 4 Pice)వీటిని కానీలు అంటారు.
ఒక పైస్ కు మూడు పైసాలు. (1 Pice = 3 Pies)వీటిని దమ్మిడిలు అంటారు.
మొత్తం మీద రూపాయికి 64 కానీలు లేక 192 దమ్మిడిలు వస్తాయి. దమ్మిడిలు అన్ని నాణేలలో తక్కువ విలువ కలిగినవి." దమ్మిడి కి కొరగాడు" అనే మాట మనం కూడా విన్నదే కదా. వీటిని మనం ముద్రించలేదు.
కొంచం తికమకగానే వుంటుందిప్పుడు, ఈ లెక్క.
ఈ తలనొప్పులు ఎందకనేమో, 1957 నుంచి రూపాయికి వంద పైసల లెక్కకి వచ్చేసాం(దశాంశ పద్దతికి).
చక్కని సమాచారం . నాకు కొంత తెలుసును కాని. బాగా గుర్తు లేదు. ధన్యవాదములు..
ReplyDeletethank you vanamali garu.
Deleteఅణాలు,కానీలు గురించి విన్నాను. చూడలేదు. Conversions కూడా తెలీదు.
ReplyDeleteThanks for the informative post!
thank you vennala garu. naa coins picchi valla kooda kontha manchi unndanatara ...
Deleteభలే నచ్చింది. ఇవన్నీ చూస్తుంటే మా ఇల్లు గుర్తొచ్చింది. నాకు కరెన్సీ కల్లెక్షన్ హాబీ. అలా నా దగ్గర చాలా దేశాలవే ఉన్నాయి. మీరు చెప్పినవన్నీ నా దగ్గర ఇప్పటికీ ఉన్నాయి. ఇంకా చిల్లు కానీలు, అప్పట్లో అయిదు రూపాయల కాసు, పది రూపాయల కాసు చాలా పెద్దవిగా, బరువుగా ఉండేవి. మా మావయ్య బాంకు మానేజరు కావడంతో కొత్త రకాలతో పాటు పాతవి కూడా తెచ్చి ఇచ్చేవాడు. నేను భద్రంగా నా కిడ్డీ బాంక్ (మట్టి పిడత)లో దాచుకునేదానిని. ఇప్పటికీ రూపాయి, రెండు రూపాయల నోట్లు నా వద్ద భద్రంగా ఉన్నాయి.
ReplyDeletemimmalni kaka pattalandi inka, naa daggara leni coins kosamanna, emmanna extra unte nannu gurthu pettukondi rasagna garu.
Deleteinformative post...nice...
ReplyDelete@sri
thank you sree garu, naa kunna pichipanulo coin collection okatandi.
Deleteబాగుంది భాస్కర్ గారు...
ReplyDeleteమంచి విషయం తెల్సుకునేలా చేసారు...!!థాంక్ యు...
thank you sitha garu.
Deletei will try to write some posts on coins.
- given information about our old coins
ReplyDelete- thank you
thank you samba sir.
Delete