Pages

22 June 2012

నేను అలానే : సారా టీజ్డేల్



కల్లోల కడలి లో,
వదలి వెళ్ళారు, నా వాళ్ళు.
నాకో నామాన్ని, ఈ రూపాన్ని,
హృదయనాదాన్ని,
వణికిపోతున్న ఓ ఆత్మదీపాన్ని,
నాకు అప్పగించి.

ఏ నిశీధీ తీరాల్లోకో,
చేరాల్సిన ఆ జ్యోతి,
ఇంత ఉజ్వలంగా,
దేదీప్యమానంగా ప్రకాశిస్తుందంటే నేడిలా,
నన్ను హృదయానికి,
ప్రేమగా హత్తుకున్న వారిదే కాని ఆ ఖ్యాతి,
సమాధుల్లో నిద్రిస్తున్న,
రక్తబంధాలది కాదు అని,
చెప్పగలను నేను, నిశ్చయంగా.

అస్థిత్వమే లేక రగులుతున్న,
ఓ మామూలు కొయ్య ముక్క,
కొట్టుకొనిపోతూ కూడా,
సముద్రపు నీలి అలల మధ్య,
రాత్రింబగల్లు,
ప్రకృతి అద్దిన సౌందర్యంతో,
కొత్త కాంతులు ఎలా వెదజల్లుతుందో,
అద్భుత దృశ్యాలకు ప్రతీకగా,
ఎలా నిలుస్తుందో,
నేనూ అలానే........
------------------------------------

(ఇది  నా తొలి అనువాదము, ప్రేరణ ఇచ్చింది N. S. మూర్తి గారి అనువాదలహరి బ్లాగ్. 

స్వేచ్చానువాదమో, అను సృజనో, ఏమంటారో నాకు తెలియదు కాని, నా పైత్యం కొంత కలసిపోయింది దీనిలో. సారా టీజ్డేల్ గారికి, N. S. మూర్తి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.)

Driftwood… Sara Teasdale




My forefathers gave me

My spirit’ shaken flame,
The shape of hands, the beat of heart,
The letters of my name.


But it was my lovers,
And not my sleeping sires,
Who gave the flame its changeful,
And iridescent fires.

As  the driftwood burning,
Learned its jeweled blaze
From the sea’s blue splendor
Of colored nights and days.

13 comments:

  1. మంచి ప్రయత్నం. మూలం చదవకపోతే బ్రెవిటీ రాలేదన్న భావన కలిగేది కాదేమో. అక్షర దోషాలు పంటి కింద రాళ్ళు. వాటిని పరిహరించండి.

    ReplyDelete
  2. thank you phani garu, naa anuvadham kante mulame mukyam kada,
    oka prayatnam chesaanandi, naaku nachina oka kavithanu parichayam cheyadaniki.

    ReplyDelete
  3. Bhaskar garu.
    You started with the translation of a lovely poetess. That is a great beginning. I wish you continue some good selections and continue your good work. Wish you all the best and great feeling of fulfilment through your work.
    with best regards

    ReplyDelete
  4. thank you sir, mimmalni naa blog lo kalavadam chaalaa happy ga undi sir,
    with your blessings, i will try for some more translations, sir.

    ReplyDelete
  5. భాస్కర్ గారు మీ ప్రయత్నం చాలా బాగుంది...
    మరిన్ని వాటికోసం ఎదురుచూస్తున్నాం...

    ReplyDelete
    Replies
    1. thank you sai garu, mee lanti vaari protsahame kothavi vedikenduku help chesthundi.

      Delete
  6. భాస్కర్ గారూ!
    బాగుంది మీ అనువాదం....
    కవితకి దగ్గరగా...
    మాకు మరింత దగ్గరగా...
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. thank you sree garu, mee abhimaname naa kavithalaki aanandham.

      Delete
  7. మొదటి అనువాద కవితకు పూర్తి న్యాయం చేసారు.
    మరిన్ని మాకందిస్తారని ఆశిస్తూ!

    ReplyDelete
    Replies
    1. naku ee kavitha bhaga nachindandi, mee comment kosam konth wait chesanu kooda, first translation kada andukemo, thank you vennela garu.

      Delete
  8. భాస్కర్ గారు,
    మీ మంచి ప్రయత్నానికి హృదయపూర్వక అభినందనలు.
    కవిత చాల బాగుంది.మరిన్ని ఆశిస్తూ...:)
    సీత

    ReplyDelete
    Replies
    1. thank you sitha garu, prayatnam cheyalandi inkoti raasi mee meppu malli pondhadaniki,

      Delete