Pages

2 June 2012

ఆది యందు మనిషికి తోక వుండెను..........


మాటిమాటికి
తోక చూసుకొని,
మురిసిపోతాడు, వాడు.
తడుముకుంటాడు,
దువ్వుకొంటాడు,
అదే ఖడ్గమనుకొని,
కళ్లకద్దుకుంటాడు, వాడు.

తోకలకు రంగులేసేవాడొకడు,
పూలు పెట్టే వాడొకడు,
కిరీటాలు పెట్టే,
తోకల పిచ్చోడకడు.

అలాంటి తోకల్ని,
తోకలున్న మూకల్ని,
కూడదీసేవాడో,
తోకల్ని మెలదిప్పి,
తోటివాళ్లను కుమ్మించి,
కులికే వాడో, ఒకడు.

పొరపాటున,
ఎవడైన తోక తొక్కాడా,
తాచు పామై లేస్తాడు, వాడు.
తోకను నిటారుగా నిలిపి,
ఆవేశంతో ఆంబోతులా
బుస కొడతాడు,వాడు.

వున్న తోకల్ని,
తెగ కొట్టలేక,
తల పట్టుకు కూర్చుంటే, కొందరు
తోకల్ని తగిలించుకోవడానికి,
తహతహ లాడేవారు, ఇంకొందరు.

ఈ తోక మానవుడు,
నియాండర్తల్ మానవుడా!
కాదు, కాదు, ఇంకా,
రమాపిథకస్,
కాదు ఇంకా, ముందు
చారిత్రక పూర్వ కోతేమో.

ఆది యందు మనిషికి తోక వుండెను.
ఆ తోకే నేడు కులమై వర్ధిల్లుచుండెను.

8 comments:

  1. Very well said! simply superb!
    చాలా చాలా బాగుంది. మీరు రాసిన విధానం బాగుంది.ఈ రోజు సమాజాన్ని పట్టి పీడుస్తున్న ఒక భయంకరమైన వ్యాధి ఇది.. చదువుక్కున వారిలోనే ఈ కుల గజ్జి భయంకరం గా పాతుకుని ఉండడం చూస్తే చాలా బాధగా ఉంటుంది .

    ReplyDelete
  2. ఓ...కులవ్యవస్థ పై అస్త్రమా? బాగుందండి

    ReplyDelete
  3. asthram emi kaadandi, edo raayi dame,
    thank you, welcom to my blog.

    ReplyDelete
  4. chakkagaaa chepparu enaati vyavastha gurinchi

    ReplyDelete
  5. భాస్కర్ గారూ , కవిత బాగుంది మీరు ఓ విషయం మర్చిపోయారు తోకను మరచిపోదామంటే మన ప్రభుత్వం ఓ కాలమ్ పెట్టి అక్కడ తోక చూపెట్టమంటుంది కదా ..

    ReplyDelete
  6. thanks andi, thokalu poye roju kosam chooddam.

    ReplyDelete