Pages

31 December 2013

పట్టి



ఎంతటి సంక్షోభానైనా
సరళీకరించి, సంస్కరించే
కిటుకునొక్కటి, వెతుక్కోవాలి.

ఎంత పెడసరి పలుకులనైనా
కలకండ పలుకుల్లా చప్పరించే
సహనాన్ని వెలిగించుకోవాలి.

ఎంతటి క్షోభనైనా నవ్వుతూ దిగమింగే
అదృష్టపు శక్తినింక ఆవాహన చేసుకోవాలి.

సత్తాలేని చెత్తపంట మహగొప్పకవిదైనప్పుడు
ఆహో, అమోఘమని ఆస్వాదించి ప్రకటించే,

చీకట్లనిప్పుడింక విత్తుకోవాలి.

https://www.facebook.com/groups/kavisangamam/permalink/679604338758988/

30 December 2013

బేకారీలు -4



దేవుడికేదైనా ఒక దివ్యత్వముంటే,
అది ఆయన దుర్భలత్వమే.

ఇప్పుడిక బద్దలుకొడదామంటావ్,
అవతారాల స్ఫూరధ్రూపాన్ని,
వేల సంవత్సరాల గమనంలో,
విడవడని తోడుగా వెంటవచ్చినదాన్ని.

ప్లేస్ తో పనిలేదు, టైమ్ తో గొడవే లేదు
ఒరే పిచ్చప్పా,. నువ్వెన్నయినా చెప్పుకాని
దేవుడిచ్చే కిక్కే కిక్కప్ప.
ఎక్కినోడికి ఎక్కినంత,.
నమ్మినోడికి నమ్మినంత,
నమ్మనోడికి నమ్మనంత.

నువ్వెందుకు సృష్టించబడ్డావంటే,
సమాధానం చెప్పుకోలేనోడ్ని,
వినడానికి చెవులులెనోడ్ని,
చూడటానికి కళ్లులేనోడిని,
ప్రశ్నంచేంత అవివేకం ఆవహించాక,
మిత్రమా,.అనుమానాలు పెనుభూతాలైపోతాయ్.

కొట్టుకుచావడానికి ఆయుధాలెందుకిక,
కాస్తంత అజ్ఞానం చాలు,

చిందించబడిన రక్తాల సాక్షిగా,
తెగిపడిన తలకాయల సాక్షిగా,
దేవుడొక చారిత్రక అవసరం,
విపర్యయమోక తప్పని సత్యం.


(-----పెండింగ్ పోయమ్ ----)
https://www.facebook.com/groups/kavisangamam/permalink/679053585480730/

8 December 2013

పైత్యాలు


1
నులివెచ్చని వేకువ వెలుతురు
ఇంకా ఆరక హృదయపు తడి
చల్లటి స్పర్శతో,. ఓ కిరణం.
*********
2
విరుచుకుపడ్డ రాత్రిని
వడిలో వేసుకుని, ఓదారుస్తు
లాలిపాటలా,. వెన్నల.
****************
3
చివరి తైలపు ఆవిర్లు
ఉన్మాదంతో రమిస్తూ
కొండెక్కుతున్న దీపం.
******************
4
ఊహచేసి, ఊపిరూది
భాషలోకి అనువదించి,

గసపెడుతూ,.ఓ కవి.

ఎదుగుడు



1
రగిలిపోవడం తెలుసా నీకు
అలాగే, ఎన్నెన్ని సార్లయినా,
గుండెలు ద్రవీభవించి, జారుతున్నట్లు,
మరిగి ఆవిర్లై మెదడుని చేరి,
కాలుస్తున్నట్లు,  ఓ అనుభవం.

2
ఎక్కువైన వాడ్నిచూస్తున్నప్పుడో,
తక్కువైనవాడ్ని మోస్తున్నప్పుడో,
నీకు దక్కని దరిద్రం, స్వర్ణభస్మమై,
మళ్లీమళ్లీ అదే తెలివితెల్లరై,
రెక్కలు కట్టుకొని, టపటప కొట్టుకుంటూ,
మనముందే ఎగురుతున్న దృశ్యం.

3
కళ్లుబైర్లుకమ్మే మేతస్సు,
కూబ్ సుందర్ దృశ్యమై
కళకళలాడుతూ,చిందేస్తుంటే,
మొత్తం మూసుకోవడమే,
మనల్ని మనం మరిచిపోవడమే.

4
అలాంటి ఉక్రోషపు దుఃఖాలు
అసహనపు సమయాలు
జ్ఞాపకాలై తడిమినప్పుడు,.
రాలిపడిపోవు,.నవ్వులు, ఎంత పట్టుకున్న.

ఇంకా గుండె పట్టుకుంటే, నువ్వెదగనట్లే.

https://www.facebook.com/groups/kavisangamam/permalink/657328500986572/

5 December 2013

బేకారీలు -3


1
అడుక్కొనువారు ధన్యులు.
వారికి తెలుసు,. వారికేం కావాలో.
2
ఏం కావాలో తెలియని వారు,
తెలిసిన నోరు పెగలని వారు,
దేన్ని అడగలేడు.

బిగసుకుపోయి, నీలగడం తప్ప.

నల్ల కవిత్వం


కవితాబద్దమైన హెచ్చరిక  - ఈ కవితను చదవకండి

1
ముందు ముక్కు మూస్కో,
దూరం గా ఓ దృశ్యం ఫిక్స్ చేస్కో,.
ఈగలు ముసిరి,
లుకలుకలాడే పురుగులతో,
కుళ్లి కంపు కొడుతున్న, మృత కళేబరం,.
బహుశా, కవిత్వమా ,ఏందది,..
2
న్యూరాన్లేలేని నెట్ బయాస్,
ప్లీస్టోనిక్ పీరియడ్ నుంచి,
ప్లాస్మాలేని మనుషుల్దాకా,
ఎవడైతే నీకేంటి,
తొక్కిపారెయ్, నలిగిచస్తారు,.
నీచే సే ఉపర్ తక్
దక్ – దక్ – దక్ ,ఆదిరిపోవాలి,
కన్ఫ్యూ షన్ తో కళ్లు బైర్లు కమ్మాలి,
పిచ్చి నా ***లకి,.
3
బ్లాక్ హోల్ లో ముడ్డి కడుక్కుని,
ఆండ్రోమెడాలో అల్పాహారం,.
ఉచ్చ, దొడ్డి, కక్కసు,...
ఛ,. ఏం భాషరా అది,.స్థాయి పెంచు,...
మల మూత్రపు జిగట కషాయం,
కక్కుకు చావల్రా, చదివిన జనం,.
టిక్....టిక్......టిక్
లాంగ్ షాట్లో ఏడుపులో,,,పెడబొబ్బలో,.
కవిత్వపు కొత్త పోకడ,
న్యూ విజన్ ఆఫ్ నెక్ట్స్ జనరేషన్,.
4
హోల్ బాడి ఎక్స్ పోజ్ డ్, యిన్ రెమ్ అంటిల్ డెత్,.
స్పెసిఫిక్ టాక్సోనమీ టోటల్లీ కొలాప్సడ్,.
ఏందిరా అన్నా,..ఇదంతా,..
క్రాంక్రీంక్లూ,.బేంబ్లాంబ్రే,..
C4 H4 N2 O2 యూరెసెల్ లో లింక్ తెగిందో,.
స్క్రీజోఫోనిక్ నికృమేనియా,..
మెదడులో ఓ మూల కణితి మొలిచిందో,.
కొత్త పేరెట్టుకో,కవితా ఉగ్రవాదమని,.బలయ్యేది, కవిత్వమే,...
రాక్ ద డే,..డుడే,..
5
ఓరీ,.అబ్బిగా,సుబ్బిగా.,
ఇల్యూషన్ లో కాస్తంత ఆబ్సెషన్,.
ఆర్గానిజం అర్థం కాలేదంట్రా,....
చదువుకో, వేయి సార్లో, ఇంకో లక్ష సార్లో,.
పిచ్చెక్కి అర్థమయ్యే దాకా.

విప్పి చూపిస్తే కాని,
స్కలనం కాని కుంకల్లారా,.పిల్లలారా,..
ఏం కావాల్రా మీకు,..
భావప్రాప్తా,..పరలోక తృప్తా,..కవితా దాస్య విముక్తా,..
తేల్చుకో,.పెద్దగా సమయం లేదు,..
వచ్చేస్తుంది యుగాంతం,..
6
నేట్రియం,.పొటాషియం,మిథైల్ ఆరంజో,.కొంచెం బెంజీనో,..
లాబ్ లో వుంటాయ్ కదెన్నో,
కలిపి కుమ్మి పారేయ్,కవిత్వమైపోదూ,..
సామన్యమనుకున్నావా,.సైన్సమ్మ,.సైన్సు,...
రాయడం రానప్పుడు,ఇదేనమ్మ నవీన మార్గం,..
సృజనాత్మక లుప్త విషాదం,.
చిన్నోడా,..రాసుకో నాన్న,.రాసుకో
ప్రోస్టేట్ గ్లాండ్ బానే వుందిగా,..రాసుకో కన్నా,,..
నీ కిష్టమెచ్చినట్లు రాసుకో,..
ఒకడు లైక్ పెడతాడు,.
ఇంకోడు నెత్తిన పెట్టుకుంటాడు,.
జ్ఞానుల గుండెల్లో గుక్కతిప్పుకోనన్ని,
పూలు విచ్చుకుంటాయ్,..
జిగిబిగెందుకు,గజిబిజే నేటి కవిత్వం,.
ఇంకేం పర్లేదు,.రాసుకో ,..
థూ,....దీ** కవిత్వం,.
7
ఇంత మాటన్నక, పాపం, ఏం చేస్తుంది,..
బ్రేకింగ్ న్యూస్,..కవిత్వం ఆత్మహత్యని,..

ఆల్ అబ్జక్షన్స్ ఆర్ ఓవరుల్డ్,.

బికాజ్,..పొయెట్రీ హాస్ నో కాన్స్టిట్యూషన్,..