ఎంతటి సంక్షోభానైనా
సరళీకరించి,
సంస్కరించే
కిటుకునొక్కటి,
వెతుక్కోవాలి.
ఎంత పెడసరి
పలుకులనైనా
కలకండ పలుకుల్లా
చప్పరించే
సహనాన్ని
వెలిగించుకోవాలి.
ఎంతటి క్షోభనైనా
నవ్వుతూ దిగమింగే
అదృష్టపు శక్తినింక
ఆవాహన చేసుకోవాలి.
సత్తాలేని చెత్తపంట
మహగొప్పకవిదైనప్పుడు
ఆహో, అమోఘమని
ఆస్వాదించి ప్రకటించే,
చీకట్లనిప్పుడింక
విత్తుకోవాలి.
https://www.facebook.com/groups/kavisangamam/permalink/679604338758988/
https://www.facebook.com/groups/kavisangamam/permalink/679604338758988/
No comments:
Post a Comment