Pages

30 September 2012

ఓ జీవితానికి సరిపడా కవిత్వం............కిరణ్ గాలి

ఒక్కోసారి 


సమూహాలకి సాధ్యమైనంత దూరంగా
ఒంటరితనం నడిమధ్యలోకి నడవాలి
నిన్ను నువ్వుగా కలవాలి, పలకరించాలి, పరామర్శించాలి.,

ఏమో అలా చేస్తె
సమూహాలలొ లేని స్నేహం, సాంత్వన , కోలాహలం
నీకు నీలోనే దొరుకుతుందేమొ........
 ఒక్కోసారి 
శబ్ధాలను బహిష్కరించి నిశ్శభ్దాన్ని ఆహ్వానించాలి
కాలం అడుగుల చప్పుడు వినపడని ఖామోషి తేవాలి
ఏమో అలా చేస్తే 
నిశ్శబ్ధం మౌనం వీడి నీతో మట్లాడవచ్చు,
నువ్వు ఇదివరకెరుగని నిజాలను చెప్పవచ్చు
నువ్వు నిజమనుకున్న అబద్దాలను చెరపావచ్చు
ఒక్కోసారి 
ఆలోచనలన్నింటిని ఆర్పేసి,

 శూన్యాన్ని వెలిగించి ధ్యానించాలి
స్తబ్ధతలోని చైతన్యాన్ని,

 చైతన్యంలోని నిశ్చలతను అన్వేషించాలి
ఏమో అలా చేస్తె 

ఆ ధ్యానంలోనే సర్వసత్యాలు సాక్షాత్కరించవచ్చు,
సమస్త సంశయాలు ధ్వంసం కావచ్చు
ఒక్కోసారి 
స్నేహితులని కాకుండా ,

శత్రువనుకున్న వాడినీ సంప్రదించాలి
అహాలు అపోహలు అడ్డురాకుండా అడగవలసినవి అడగాలి

ఏమో అలా చేస్తే
స్నేహితుడిలా సలహాలతో సరిపెట్టకుండా

సహాయం కూడా చేస్తాడేమో
ఒక్కోసారి 
మనిషితో కాకుండా మనసుతో పరిచయించాలి

తనువుతో కాకుండా ఆత్మతో సహచరించాలి
ఏమో అలా చేస్తే,
పరిణయంగానె మిగిలిన ప్రహసనం
రసవత్తర ప్రణయంగా తర్జుమా కానూవచ్చు.....
ఒక్కోసారి 
కూడ బెడుతున్న సంపాదన కాకుండా
దాచి పెడుతున్న కాలాన్ని కూడా

ఆత్మీయులకు ఖర్చు పెట్టాలి
ఏమో అలా చేస్తే

కొని తెచ్చిన వస్తువులు ముడివెయ్యలేని అనుబంధాన్ని
కలిసి గడిపిన క్షణాలు, కడవరకు తోడు తేనూవచ్చు......
 ఒక్కోసారి 
పొందవలసిన సుఖాల జాబితా పక్కన పెట్టి
పోగొట్టుకున్న సంతోషాల చిట్టా విప్పి చూసుకోవాలి
ఏమో అలా చేస్తే
లేని వాటిలో వున్న సౌఖ్యం కన్న
వున్నవాటిలో లేని ఆనందంమేముందని తెలియావచ్చు...
 ఒక్కోసారి 
పరిగెత్తటం మానేసి
ఆయాస పడుతున్న కాలాన్ని.

 కుదురుగ కూర్చొని చూడాలి
రాలి పడిన క్షణాలని, నిమిషాలని, రోజులని,

 దులుపుకొని జేబులో దాచుకొవాలి
ఏమో అలా చేస్తే 

గమ్యంలో వుందనుకున్న గెలుపు గమనంలో దొరకావచ్చు
ఒక్కోసారి 
ప్రశ్నలడగడం, జవాబులు వెతకటం మానెయ్యాలి
పరీక్ష అనుకొని జీవితాన్ని చదవడం ఆపెయ్యాలి
ఏమో అలా చేస్తే 
ఫలితం గురించిన బెంగ లేకుండ
స్వేచ్చగా జీవించవచ్చు,
సంతృప్తిగా మరణిచనూవచ్చు........




కిరణ్ గాలి, అందించిన ఈ కవిత్వం నాకు చాలా నచ్చింది.
 కవి సంగమం నుంచి  మీ అందరికోసం అడిగితెచ్చిన ఈ కవిత్వం మీకు నచ్చుతుందని ఆశిస్తూ.......

29 September 2012

చిక్కుల్లో చిన్నారి




లెక్కలో, చిక్కులో
కూడికో, తీసివేతో
కుస్తీ పట్టడమే కన్నా,
ఈ చిన్న జీవితం.

చేతి వ్రేల్లే కాదు,
కాలి వ్రేల్లూ చాలవు  చిన్నా,
మనిషే ఇప్పుడు,
లెక్కై పోయాడు.

28 September 2012

అటో....ఇటో......ఎటో మన పయనం.

దారితీద్దాం  సాగిపోదాం
దారులు వేస్తు పరుగులు తీద్దాం
కాంక్రీట్ జంగిల్ కౌగిలినుంచి,
పచ్చపచ్చని ప్రకృతిలోకి,
మంటలు రేపే మతాల నుంచి,
మంచిని పెంచే తత్వంలోకి,
దారితీద్దాం సాగిపోదాం.

టీవి తెచ్చే తిప్పలనుంచి,
సౌఖ్యం ఇచ్చే పఠనం వైపుకి,
బట్టి పెట్టే కష్టం నుంచి,
స్వేచ్ఛను పెంచే చదువుల వైపుకి,
దారితీద్దాం సాగిపోదాం.

అజ్ఞానపు చీకటినుంచి,
విజ్ఞానపు వెలుగుల్లోకి,
రాక్షసత్వం కోరలనుంచి,
మానవత్వపు నీడలలోకి,
దారితీద్దాం సాగిపోదాం.

పెప్సికోలా బాటిల్ నుంచి,
కొబ్బరి నీటి జాడలలోకి,
ప్లాస్టిక్ బ్యాగు భూతం నుంచి,
పాతగుడ్డ సంచులలోకి,
దారితీద్దాం సాగిపోదాం.

ప్రాణం తీసే స్పర్ధల నుంచి,
రక్తం పంచే మమతలలోకి,
అణుయుద్ధపు భయం నుంచి,
చిరునవ్వుల లోకంలోకి,
దారితీద్దాం సాగిపోదాం.
దారులు వేస్తు పరుగులు తీద్దాం
చిన్నచిన్న పిట్టలమై,
సీతాకోక చిలకలమై,
ఎగిరిపోదాం, పరవశిద్దాం,
పరవశిస్తూ ఎగిరిపోదాం.

ప్రపంచ రాబీస్ దినోత్సవం, మనం తెలుసుకోవలసినవి.......





EDUCATE EVERY ANIMAL LOVER
WITH FULL THRUST
ANTIRABIES VACCINE IS A MUST

పెంపుడు జంతువులకు వాక్సినేషన్ చేయించండి.
కుక్క కాటుకి గురి కాకుండా చూసుకోండి.
రాబీస్ అనేది ఒక వైరస్ ద్వారా వచ్చే వ్యాధి.
సకాలంలో జాగ్రత్త పడడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి పది నిమిషాలకు ఒక వ్యక్తి రాబీస్ కారణంగా మరణిస్తున్నాడు.
రాబీస్ వైరస్ మెదడు, వెన్నుపాముల పై పనిచేస్తుంది.
సంవత్సరానికి  రాబీస్ తో మరణించేవారు 55,000 
రాబీస్ నివారించదగిన వ్యాధి.
కుక్కలతో ఎలా ప్రవర్తించాలో పిల్లలకు చెప్పండి.
మీ ఇంట్లో పెంపుడు జంతువు వుంటే ఈ రోజే రాబీస్ వాక్సీన్ చేయించండి.


లూయి పాశ్చర్, కుక్క కాటుకి మందు కనుగొన్న శాస్త్ర్రవేత్త, 
ఈయన మరణించిన రోజు సెప్టంబర్ 28, 1895


 జోసఫ్ మస్టర్, 9 సంవత్సరాల వయస్సులో కుక్క కాటుకి గురై, లూయి పాశ్చర్ కనుక్కున్న వాక్ళీన్ మొదటిసారిగా జూలై 6, 1885లో ప్రయోగించబడి, రాబీస్ నుంచి కోలుకున్న మొదటి వ్యక్తి.


జోసఫ్ మస్టర్ జ్ఞాపకార్థం ఫారిస్ లోని పాశ్ఛర్ ఇన్సిట్యూట్ లో నెలకొల్పిన విగ్రహం.

కొంచెం ఓపిక చేసుకోని ప్రపంచ ఆరోగ్య సంస్థవారు రాబీస్ గురించిన అన్నీ విషయాలతో  రూపొందించిని క్రింది వీడియోని చూడండి.



మీకు మరింత సమాచారం కావాలంటే క్రింది లింక్ లో చూడండి.

27 September 2012

భగత్ సింగ్ కు జన్మదిన శుభాకాంక్షలు




భగత్ సింగ్ కు జన్మదిన శుభాకాంక్షలు




 భగత్ సింగ్ జ్ఞాపకార్థం విడుదల చేసిన 100 రూపాయల నాణెం మరియు పోస్టల్ స్టాంప్




కుడి నుంచి నిలబడిన వారిలో నాలుగవ వ్యక్తి





ఇది నిజమేనా..................

26 September 2012

విజ్ఞానంతోనే వికసించు జగత్తు




రచన- గంటేడి గౌరునాయుడు   గానం – దివిజా కార్తీక్
సంగీతం – సాయి కార్తీక్      చిత్రీకరణ - నేను




విజ్ఞానంతోనే వికసించు జగత్తు
పసిపిల్లల చదువే దానికి విత్తు


లేగదూడ గంతులు పసిడి పూల కాంతులూ
గాలితరగ పిలుపులు సెలయేటి అలల మెరుపులు

ప్రకృతిలో అణువణువు పసిపిల్లల అమ్మవడి
ఆ ప్రేమను పంచాలి పిల్లలకు చదువుల బడి 
పిల్లలకు చదువుల బడి    విజ్ఞానంతోనే .......


చిన్నచిన్న చేతులతో మోయలేని బరువులతో
పసిపిల్లల మనసులో గాయాలై రగిలితే

ప్రమాదాల కోరలలో బాల్యం బలియైపోతే
బావిభారతి ఆశల బాల్యం ఇకెక్కడిది. 
బాల్యం ఇకెక్కడిది.     విజ్ఞానంతోనే ....... 


వ్యాపరం వలలో చదువు చేప కాకూడదు
కాసుల గాలానికి విజ్ఞానం బలికాకూడదు

తొలిపొద్దు పొడుపులా తొలకరి తొలిచినుకులా
పసిడిపంట పండాలి మన పాపల చదువు  
మన పాపల చదువు    విజ్ఞానంతోనే .......


దేశం ఏదైన కాలం ఏదైనా
చెప్పే చదువేదైనా బాల్యం ఒకటే

పూవు వంటి పసి ప్రాయం వసివాడి పోకుండా
కాపాడే బాధ్యత మన అందరిది,
 మన అందరిది   విజ్ఞానంతోనే .......  


పాఠమే పాటగా చదువే ఒక ఆటగా
గురువే విద్యార్థికి చక్కని నేస్తంగా

మనసుని మురిపిస్తే బాధను మరిపిస్తే
తరగతి గదులే రేపటి తరగని నిధులు 
తరగని నిధులు

విజ్ఞానంతోనే వికసించు జగత్తు
పసిపిల్లల చదువే దానికి విత్తు




25 September 2012

నేను సైతం ..... ఆహుతయ్యాను......



తట్ట బుట్ట , పలుగు పార,
నాకేం తెలుసు పలక,బలపం?

సైకిల్ ట్యూబూ, పాలిష్ డబ్బా,
నాకేం తెలుసు  ఎ,బి, సి,డి?

కుమ్మరి మట్టి, ఇటుకల బట్టి,
నాకేం తెలుసు బడి గుడి?

అమ్మది కష్టం, నాన్నది కష్టం
కొద్ది సేపు పని మానితే........
                                         ఎంత కష్టం , ఎంత నష్టం.

24 September 2012

చెలి అధరాల తడి ముద్రలు


స్పందన రేకెత్తించడానికి,
చెలి అధరాల తడి ముద్రలే కావాలా....
భువిని ముద్దాడే,
వానచినుకుల చప్పుడులు సరిపోవా !!!!

గుండె వున్న వాళ్ల కోసం, ఒక మాట.....



అందరికి ప్రపంచ హృదయదినోత్సవ శుభాకాంక్షలు
వున్నది ఒక్క గుండే, సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా కాపాడుకోవడం మన పని.
గుండె కొట్టుకుంటేనే మనిషి  బతుకుతాడు. మిగిలిన ఏ అవయవం లేకపోయినా బతకొచ్చు. గుండెలేకుండా మనిషి బతకం కష్టమే. అలాంటి గుండె పదిలంగా ఉండాలంటే పది మాటలు చూడండి. 

1. నియమిత వ్యాయమం ఉండాలి. 
( అబ్బో ఇది మన వల్ల కాని పని.)

2. ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలి.
(ఇది మన చేతుల్లో వుందా, ??)

3. మానసిక ఆందోళన తగ్గించుకోండి
(ఇది అస్సలు వీలుకాదండి.)

4. సరియైన నిద్ర ఉండాలి. కనీసం రోజులో 8 గంటలు నిద్రపోవాలి. 
(బ్లాగ్ లో టపాలు, కామెంట్లు ఎవరు రాస్తారు.)


5. ధూమపానం చేయరాదు.
6. మద్యపానం చేయరాదు. 

(5,6 మన సిలబస్ లో విషయాలు కాదు.)

7. భోజనంలో కొవ్వు పదార్థాలు తగ్గించండి. 
(నెయ్యి లేకుండా ముద్ద దిగుతుందా, కాఫీ తాగకుండా మంచం దిగుతామా....)

8. 40 ఏళ్లు దాటిన వారు డాక్టర్‌ను సంప్రదించాలి. ఆయనం సలహా మేరకు ఆహారం తీసుకోవాలి. వారు సూచన మేరకే జీవన శైలి మార్చుకోవాలి. 
(ఒకరు చెప్పినట్లు బతకడం నాకిష్టముండదండి,..)

9. నియమిత సమయంలో రక్త పరీక్ష చేయించుకోవాలి. శరీరంలో చక్కెరశాతం, కొవ్వు శాతం పెరిగే అవకాశం ఉంది కనుక ఈ పరీక్షలు అవసరం. 
(ఇక డబ్బులన్ని లాబ్ లకే...)

10. 45 ఏళ్ళు దాటిన వారు ఏడాదికొకమారు గుండెకు సంబంధించిన అన్ని పరీక్షలు చేయించుకోవాలి.
(అంతేనంటారా, సరే కానివ్వండి, మీకోసం.........)

23 September 2012

చికాగో జూ , చూసొద్దాం ......



చికాగో జంతుప్రదర్శనశాలలో తీసిన వీడియో ఇది, 
అనేక రకాల జంతువులను చూడచ్చు, చూసొద్దామా.....