Pages

7 December 2012

సారా టీజ్డేల్ - నేనెలా ఓదార్చగలనిప్పుడు.......3
ఉప్పొంగే ప్రవాహాలతో,
కడలి అలలను హత్తుకోవాలని,
ప్రేమాతిశయంతో తపిస్తూ,
ఎలా ఉరకలెత్తుతుందో నది,
అలా నేనూ ఓ నదినై,
నీలో లయించాలనుకుంటాను,.
నిర్లజ్జనై, ఎంతగా వ్యక్తీకరించినా,
నీ సంశయాత్మక నిర్లక్ష్యపు లయల మధ్య,
నలిగినలిగి, నా ప్రేమ,.
నేలరాలిపోతూనేవుంది,కదూ...
2
ఒదిగిపోయిన కొమ్మలతో,
ముడుచుకుపోయిన రెమ్మలతో,
నిస్తేజమైన పత్రాల నిశ్శబ్ధంతో,
హోరున వాన కురుస్తున్నప్పుడు,
ఎలా ప్రశాంతమౌతుందో,ఓ తరువు,
అలా మృత్యువు వడిలో
సేద తీరేవేళ ఈ తరుణి,
ఎంతటి నిర్ధయతో నువ్వు,
నా ప్రేమను తృణీకరించావో,
అంతకు మించిన కాఠిన్యతతో,
నిన్ను నిరాదరిస్తుందేమో కదా,
ఒక్క చిరునవ్వుని చిందించక.....
1
సస్యశ్యామలమై అలరారే పుడమిని,
నీటి జాడే మిగలకుండా,
ఎలా మాడ్చేస్తుందో,మండే గ్రీష్మము,.
అలా అనుభూతులు ఆవిరైన,
నిర్జీవమైన నా దేహంపై,
గాయపడిన గుండెలతో,
తలవాల్చి,తల్లడిల్లే నిన్ను,
నేనెలా ఓదార్చగలను,..చెప్పు....
4
వర్షపుచుక్క, నీటిచెమ్మ కాదుకదా,
కనీసం మేఘమైనా కన్నెత్తిచూడని,
నిర్జన ఎడారులలో సాగిపోయే,
నీ ఏకాంత గమనాన్ని,
స్వర్గలోకపు గవాక్షాల నుంచి,
జాలిలేని, జేవురించిన వదనాలతో,
వీక్షిస్తుంటాయ్,ఆ తారకలు,..
మిలమిల మెరిసిపోతూ,
అనుక్షణం నన్ను నీకు గుర్తుచేస్తూ,..
5
దిమ్మరివై, తిరగితిరిగి అలసిపోయి,
పగిలిన హృదయంతో,
ఏ గాఢాంధకారాలలో,
మిగిలినప్పుడో,మరెప్పుడో,
మోకరిల్లక తప్పదు నీకు,
వెంటాడుతున్న నా ప్రేమ ముందు,...
స్పందనే లేక,నిశ్చలమైన ప్రేమ తటాకాన,
అంతులేని దాహార్తితో,
దోసిలి చాచి, నీవు ప్రేమ అర్ధించిననాడు,
అగ్నిలా దహించక మానదు ప్రియా,అది నిన్ను.....
-------------------------------------------------
1915లో ప్రచురించబడి,బెస్ట్ సెల్లర్ గా నిలిచిన రివర్ టు ది సీ అనే కవితా సంకలనం లోని కవిత ఇది,.ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి 18 సంవత్సరాల ముందు రాసిన, ఈ కవిత ఆమె లోని  ఆత్మహత్యా ధోరణిని చూపిస్తుందని విమర్శకులు అంటారు,. 1918లో  ఆమె పులిట్జర్ బహూమతిని అందుకుంది, విఫల ప్రేమలతో,విషాదకరమైన జీవితం ఆమెది,.
sara teasdale ... i shall not care..... 
1.
When I am dead, and over me bright april,
Shakes out her rain - drenched hair,
Tho’ you should lean above me broken hearted,
I shall not care.
2.
I shall have peace, as leafy trees are peaceful,
When rain bends down the bough,
And I shall be more silent and cold-hearted.
Than you are now,.
3.
I love too much; I am a river,
Surging with spring that seeks the sea.
I am too generous a giver,
Love will not stoop to drink at me,.
4.
His feet will turn to desert  places,
Shadowless reft  of rain and dew,
Where stars stare down with sharpened faces,
From heavens  pitilessly blue,.
5.
And there at midnight sick with faring,
He will stoop down in his desire,
To slake the thirst grown past all bearing,
In stagnant water keen as fire,.
 ------------------------------------------------------------------------------------
ఇది నా నాలుగవ అనువాదము,
రచయిత్రి సారా టీజ్డేల్ గారికి, ప్రేరణ ఇచ్చిన మూర్తి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.

6 comments:

 1. అనువాదం చక్కగా ఉందండి!

  ReplyDelete
  Replies
  1. వెన్నల గారు ధన్యవాదాలండి,..

   Delete
 2. Replies
  1. ధన్యవాదాలు తనోజ్,..ఏమన్నా తప్పులుంటే చెప్పవచ్చు అండి,..నేను ఇంగ్లీష్ లో చాలా వీక్,....

   Delete
 3. మంచి అనువాదం భాస్కర్ గారూ!...
  అభినందనలు...
  ఈ ఆర్ట్ మీనుంచి నేర్చుకోవాలి...(మనస్ప్పూర్తిగా అంటున్న మాట...)@శ్రీ

  ReplyDelete
  Replies
  1. హ,హ,..నాకు ఇంగ్లీష్ అంత బాగా అర్థంకాదండి, కేవలం సారా టీజ్డేల్ మీది అభిమానంతో కొంచం నాకు తోచింది కలిపిరాస్తున్నానేమో అనే ఫీలింగ్ కూడా వుంది,.ఒక ప్రయత్నమేనండి,ఇది,.మీరు కూడా ప్రయత్నించండి,..నాకు వున్న పదసంపద చాలా తక్కువ,..మీరు ఇంకా బాగా రాయగలరు,..మీ కవితలలో మంచి మంచి పదాలు నాకు చాలా నచ్చుతాయ్,.ధన్యవాదాలు శ్రీ గారు...

   Delete