హైకు
అనేది జపాన్ దేశపు,సాంప్రదాయ కవిత్వంలో ఒక భాగం,.వీటికి ఆధారంగా నిలిచింది, జెన్
(ధ్యాన)బౌద్ధం.
హైకూలలో
మూడు పాదాలు (కిరు,కైరేజి,కిగో)
వుంటాయి,కిగో
అంటే ఋతువునో,కాలాన్నో సూచించడం,.మిగతావి రెండు దృశ్యాలనో,అనుభూతులనో కలిపేవి,
అక్షరాల
(((((((--- పరిమితి 17 (5-7-5)
జెన్
బౌద్దం ప్రకారం మనిషిలో వుండే చిత్తలక్షణాలు 17,అందుకే విస్తీర్ణం అంతవరకే
పరిమితం.
కేవలం
ప్రకృతి వర్ణన మాత్రమే వుండాలి, వర్తమానంలోనే చెప్పాలి,. అలంకారాలు, ఆడంబరమైన
భాషకు చోటులేదు,కవి తన అభిప్రాయాన్ని చొప్పించకూడదు,ఇది కేవలం ఒక దృశ్యాన్ని
పాఠకుడి ముందు వుంచాలి,ఇలా చాలా నియమాలతో వుంటుంది,సాంప్రదాయ హైకు,.
నిజానికిది
చాలా సులభంగా కనిపించే కష్టమైన ప్రక్రియగా చెప్పుకోవచ్చు,.
fu-ru-i-ke ya (5)
ka-wa-zu to-bi-ko-mu (7)
mi-zu no o-to (5)
పాత తటాకం,
ఒక కప్ప దూకింది,
నీటి శబ్ధాలు.
ఇది
హైకూలకు ఆద్యుడుగా భావించబడే బషో (1644-1694) రాసిన హైకూ.
తెలుగులో
మొట్టమొదటి సారి హైకూలను రాసిన కవిగా గాలి నాసర్ రెడ్డి గారిని చెప్పుకోవచ్చు, 17
అక్షరాల నియమం పాటించిన కవి బహుశా ఈయనోక్కరే,వీరు రాసిన హైకూలు చాలా తక్కువ.వారి హైకు ఒకటి,
ఎండుకొమ్మపై,
ఒంటరిగా
ఓ కాకి,
శిశిర
సంధ్య,.
అమెరికాలో హైకూలు 1950నుంచి విస్తృతమైన ప్రచారంలో వున్నాయి,కానీ అక్కడ అక్షరనియమం పాటించబడటం లేదు,.కొంత మంది కవులు ఒక్క పాదంలో, రెండుపాదాలలో కూడా హైకూలు రాస్తున్నారిప్పుడు,.గోపి గారి మాటలలో చెప్పాలంటే,హైకూస్నాప్ షాట్ లాగా, ఫోటోగ్రాఫిక్ గా వుంటుంది,.సగటు శ్రోతకు దీనిలో కదలక కనిపించదని ,పాఠకుడు కవితో పాటు సమభావకుడు అయినప్పుడు మాత్రమే హైకు ప్రకాశవంతమపుతుందని ,ఇవి తాత్వికత, ప్రకృతితో తాదాత్మ్యం లాంటి మౌనవస్తువులకు సరిపోతుంతని ,ఆయన భావించారు,.. అందుకేనేమో
నానీల బాట పట్టారు,..ఇస్మాయిల్ గారి తెలుగు హైకూలను ప్రతిభావంతంగా రాశారు, వారి
హైకూలు కొన్ని,.
**కొలను లోకి రాయి
విసిరారెవరో*
అలలు ఇ౦కా వ్యాపిస్తూనే ఉన్నాయి
రాయేదీ…
అలలు ఇ౦కా వ్యాపిస్తూనే ఉన్నాయి
రాయేదీ…
ఎవరికోస౦ వర్షిస్తాయి మేఘాలు
పిల్లల కోస౦ కాకపోతే
గొడుగులడ్డు పెట్టుకునే వాళ్ళకోసమా?
పిల్లల కోస౦ కాకపోతే
గొడుగులడ్డు పెట్టుకునే వాళ్ళకోసమా?
ము౦దు మనస్సునీ
ఆ వెనక గదినీ
తర్వాత విశ్వాన్నీ ఆవరి౦చి౦ది చీకటి.
ఆ వెనక గదినీ
తర్వాత విశ్వాన్నీ ఆవరి౦చి౦ది చీకటి.
పెన్నా శివరామకృష్ణ గారి హైకూలు కొన్ని,...
సాయంత్రం వానజల్లు
చీకటిని దిగబెట్టి
వెళ్లిపోయింది,.
పక్షి నోటిలో
గడ్డి పరకలు
ఇల్లు మారుతున్నదేమో.,.
సుడిగాలి,
కొమ్మను ఊపుతున్నాని,
పిట్ట గర్విస్తుంది,.
బివివి ప్రసాద్ గారి హైకూలు కొన్ని,.....
చేయి
పట్టుకొంది నిద్రలో
పాప కలలోకి
ఎలా వెళ్ళను
పాప కలలోకి
ఎలా వెళ్ళను
పిట్టలు
కూస్తున్నాయి
గాలి నిండా
రంగుల శబ్దాలు
గాలి నిండా
రంగుల శబ్దాలు
దూరంగా
దీపం
దానిని కాపాడుతూ
అంతులేని చీకటి
దానిని కాపాడుతూ
అంతులేని చీకటి
తెలుగులో ఈ మధ్యకాలందాకా వచ్చిన హైకూ సంకలనాల వివరాలు
కొన్ని,.
రహస్య ద్వారం ( పెన్నా శివరామకృష్ణ,1991)
కప్పల నిశ్శబ్థం (ఇస్మాయిల్,1997)
దృశ్యాదృశ్యం (బివివి ప్రసాద్1995)
హైకూ(బివివి ప్రసాద్1997)
పూలు రాలాయి(బివివి ప్రసాద్1999)
హైకూ చిత్రాలు (సూర్యభాస్కర్,1997)
ఆకాశదీపాలు ( లలితానంద్,1997)
సీతాకోక చిలకలు(శిరీషా,1997)
చినుకుల
చిత్రాలు( పెన్నా శివరామకృష్ణ,2000)
ఇంకా చాలానే వచ్చినట్లున్నాయి,..
Informative. Thank you Bhaskar garu.
ReplyDeleteధన్యవాదాలు వెన్నెల గారు,..
Deleteకొత్త విషయం తెలిసింది....చిన్ని పదాల కూటమిలో ఎన్నెన్ని భావాలు దాచుకున్నాయో ఈ హైక్కులు. అభినందనలండి.
ReplyDeleteపద్మార్పిత గారు ధన్యవాదాలండి,..నిజమేనండి,.నాకూ నచ్చాయ్,...మీరు కూడా ప్రయత్నించండి.....
DeleteHykoola parichayam chaalaa Baavundi. Upayuktam.
ReplyDeletethank you vanamali garu...
DeleteHykoolu bagunnayi
ReplyDeleteధన్యవాదాలు రవికిరణ్ గారు...
DeleteChaala happy ga vundhi chaala rojulu tharuvatha malli puttinattu vundi....hykoollaga
ReplyDelete