భారతదేశాన్ని
కాదనలేను,
రష్యా
దేశాన్ని కొలవలేను
నిజం ఎక్కడో
అక్కడ నా ప్రాణం వుంది,.
హృదయం
ఎక్కడో అక్కడ నా ఉదయం వుంది,.
పులి చంపిన లేడి
నెత్తురు పులుముకోలేను
ఖడ్గ
మృగోదగ్రవిరావం ఆలకించలేను
జగద్ధాత్రి
నీ కుమారులమైన మేము
తత్త్వాల
పేర విప్లవాల పేర ఒకరినొకరం హతమార్చుకోలేము.
శాంతి కోసం
యుద్దాన్ని ప్రజ్వలింప చేస్తారు
సుఖం కోసం ఆ
రక్త విప్లవాన్ని తరింప చేస్తారు
శ్మశాన
భూమిని వికసిస్తుంది వీరు నాటిన పూల చెట్టు
కానీ ఎవరు
తుడుస్తారు తల్లీ నీ కన్నీటి బొట్టు.
ప్రభువులనే
కిరాతకులకు అమ్మనన్నాడు బమ్మెర పోతన
పార్టీలకు
అమ్ముడు పోయిన నేటి కవులకు లేదు వేదన
మాటల
మేజిక్కు నమ్మి, పాటల మ్యూజిక్కు నీలో క్రమ్మి
మరిచిపోకు
అసలు వాణ్ణి నీ సోదరుడైన మానవుణ్ణి.
వంచలేను నా
శిరస్సు ఏ అధికారం ముందు,
ఒప్పలేను
మానసిక దాస్యాన్ని ఏ ప్రభుతయందు
నాకు వద్దు మీ రంగురంగుల కాగితపు బురఖాలు
పాత
వుచ్చులు తీసి తగిలించకు విన్నూత్న శృంఖలాలు
ఒక సత్యం
కోసం మరో సత్యాన్ని ఖూనీ చెయ్యకు
పరదేశ
స్తుతిలో స్వకీయ సంస్కృతి విస్మరించకు
ఇంకా కరిగి
నీరై పోలేదు హిమాచల శిఖరాలు
ఇంకా మరిచి
పోలేదు తథాగతుని మహాత్ముని ప్రవచనాలు
వివేకం లేని
ఆవేశం విపత్కరమౌతుంది
సంయమం లేని
సౌఖ్యం విషాద కారణమౌతుంది,
సమ్యక్
సమ్మేళనము లేని తౌర్యత్రికం కఠోరమవుతుంది,
కరుణలేని
కవివాక్కు సంకుచితమౌతుంది.
---------------------------------------------------------
వివరణ: 1954లో రష్యా వెళ్లి వచ్చిన శ్రీశ్రీ, భారతీయులను కించపరుస్తు, రష్యావారిని కీర్తిస్తు ఒక మాట అన్నారట. దానికి ప్రతిక్రియగా తిలక్ ఈ కవిత వ్రాశారు, దీనిని 1955 జనవరి 23 నాటి ఆదివారం ఆంధ్రపత్రిక దినపత్రిక లో ప్రచురితమైంది.1966లో తిలక్ మరణించిన తరువాత విశాలంధ్రవారు ప్రచురించిన అమృతం కురిసిన రాత్రిలో ఈ కవితను ఇవ్వలేదు,. 1984లో వచ్చిన 4 వ ఎడిషన్లో 2,3 చరణాలు మాత్రమే ఇచ్చి మిగతావి ఇవ్వలేదు,..ఇప్పడేమైనా ఇచ్చారేమో నాకు తెలియదు.
చాలా చక్కటి విషయాన్ని సేకరించి తెలియజేసినందులకు ధన్యవాదాలండి.
ReplyDeleteభారతి గారు, ధన్యవాదాలండి,.
Deletethilak naa bhimana kavulalo okaru.amrutham kurisina raathri adbhutham . ee kavitha anthaku mundu chadivano ledo gurthu ledu .its good
ReplyDeleteతనోజ్ ధన్యవాదాలు, తిలక్ గారికి నేను అభిమానినేనండి,..కొత్త ఎడిషన్లలో ఏమన్నావుందేమో,ఈ కవిత.
Deleteabhimaana*
ReplyDeleteఅక్టోబర్ 2013
ReplyDelete16 లో ముద్రణ లో ఇచ్చారండీ