దేనికో ఒకందుకు,
నిరంతరం నన్ను నేను,
నిందించుకోంటూ వుండాల్సిందే.
అర్ధం లేని ప్రశ్నలతో,
జీవిత పరమార్ధం కోసం,
అనుక్షణం, నన్ను నేను,
వేధించుకొంటూ వుండాల్సందే.
సర్దిచెప్పుకుంటూ,సమర్దించుకొంటూ,
నన్ను నేను, దహించుకొంటు,
మౌనంగా కన్నీటి రాత్రులలో
నలిగిపోవలసిందే.
ఎవడికో ఒకడికి,
నన్ను నేను అప్పచెప్పుకోవలసిందే.
అలవికాని భారాలను పైకెత్తుకొని,
ఏ శోధనలనో భరిస్తూ,
ఎడతెగని రాపిడికి,
నాలో నేను, కుమలాల్సిందే,
స్వప్నాలతో సంభోగిస్తూ,
స్వప్నాలతో సంభోగిస్తూ,
నాలో నేను, కలవాల్సిందే,
క్షుభితనై, భ్రష్టనై
నా లోకి, నేనే.
"అలవికాని భారాలను పైకెత్తుకొని,
ReplyDeleteఏ శోధనలనో భరిస్తూ",
సర్దిచెప్పుకుంటూ,సమర్దించుకొంటూ,
నన్ను నేను, దహించుకొంటు,
మౌనంగా కన్నీటి రాత్రులలో
నలిగిపోవలసిందే.
చాలా చాలా బాగా రాసారు భాస్కర్ గారూ....
sitha garu, thank you very much.
ReplyDeleteబాగుంది కాని భారం గా ఉంది. "ఇదో బ్రతుకు" అనేకంటే..ఇదా బ్రతుకు? అంటే ఎలా ఉంటుందండి?
ReplyDeletenijaniki raasukunndi asamardhuni jeevayathra ani,
Deletelast two lines thisiveyandi, danni kuda post chesthanu chadavandi.
ida brathuku ante kinchaparichinatlu untundemo aa vedanani.
thank you vennela garu, naa blog friend inanduku.
భాస్కర్ గారూ , జీవితం గూర్చి రాసారు అంటే దానిని అన్ని కోణాలనుండి పరిశీలించారు అని అర్ధం, భారంగా ఉన్నా భావపరంగా అర్ధవంతంగా ఉంది , సార్ తక్కువ అక్షరాలలో ఎక్కువ చెప్పగలగటం మీకే వస్తుంది. మీ పోస్ట్స్ బాగుంటాయి
ReplyDeletethank you very much madem,
Deletegood man keep going
ReplyDeletethank you thanooj garu.
Delete