Pages

Showing posts with label సుబ్బులు కోసం. Show all posts
Showing posts with label సుబ్బులు కోసం. Show all posts

11 July 2013

నిరీక్షణ

మబ్బులు లేని ఆకాశం కింద,
ఓ వర్షపు చినుకు కోసం,.
చూస్తున్నప్పుడే,.
వెళ్లిపోయిన బస్సు కోసం,
నీ నవ్వుల్లో నాకోసం,,
మెరిసే ఓ మెరుపు కోసం,..
సుబ్బులూ,. ఇలా,..

ఎదురుచూడటం కష్టమైన పనే,...

27 April 2013

సుబ్బులు కోసం -1,2,3,4 (ఫన్నీలు)


1
కురిసేటి వానవి
మండు వేసవిలోన,
మంచగంధపు చెక్క
పరిమళము నీవు,.
సుబ్బులు పులకింతవై,  నన్ను హత్తుకోవా,..

ఎండిపోయిన ఏరు,
ఏటి ఒడ్డున రాళ్లు,,
అక్కడక్కడ చెమ్మ,.
నీ ఆనవాలు,.
సుబ్బులు, ఊహవై మిగలబోకు,..

3
రెయిలింగ్ పైనెక్కి,
ముందు వెనుకకు ఊగి,.
రాత్రి కురిసిన వాన,.
చిత్తడిలో నేను,..
సుబ్బులు,.హండిచ్చి తప్పుకోకు,..

3
రేగిపోయిన జుట్టు,
ఎర్రబడిన కళ్లు,.
చండ్ర నిప్పుల జాణ,
దుమ్ములేపెను లోన,.
సుబ్బులు,..నా గుండె నమలబాకు,..

 4
ఎండమావులు లేవు
పిల్ల మేఘము రాదు,
నీటిచుక్కల జాడ కానరాదు,.
నల్లని బుగ్గలలో మెరసేటి లోయలలో
సుబ్బులు, నన్ను దూకనివ్వు,..

( నిజంగా ఇవన్ని అర్థంలేనివి,.పై నాలుగు లైన్లలో ఎదో ఒకటి రాసి,.చివరిలో అలా ముగించండం,..)