Pages

31 May 2012

ఒకానొక ఫీలింగ్ – 11


చిరునవ్వుల చిగురాకులు,
తోరణాలు నా మదిలో.
జాలువారు నీ వేణి,
కృష్ణవేణి నా ఎదలో.
మెదలుతున్న నీ తలపులే,
కెరటాలు, నా హృదిలో.

ఒకానొక ఫీలింగ్ – 10


చంద్రబింబమై, నీ మోము
నా మదిలో నిండినపుడు,
పున్నమి వెన్నల రేడైన,
శూన్యబింబమే సుమా,  నాకు.

28 May 2012

ఒకానొక ఫీలింగ్ – 9


వెతికి,వెతికి వేసారే
చూపులకు తెలుసు,
తిరిగి,తిరిగి అలిసే
కాళ్లకు తెలుసు,
వేచి,వేచి ఏదురుచూసే,
మనసుకూ తెలుసు,
చెలి చెంతకు చేరలేని,
మూగ స్పందనల బాధేమిటో......

ఒకానొక ఫీలింగ్ -8


గులాభీలకై
ఎంత వగచినా,
ఆ ముళ్లగీతల బాధలే,
 మిగిల్చావా, సుమా నాకు !!

26 May 2012

కవి అను నేను.........


దరిద్రాన్ని,  దైవత్వాన్ని
సంపదల్ని, సైతానుల్ని
విషాదాన్ని, విస్మయాన్ని
కమ్మని కలల్ని, కల్లోలాన్ని
కాలకూట విషాన్ని, కేరింతల్ని
ఒకే చోట కలిపి,
కుట్టేస్తాడు, వాడు.

శిధిల శరీరాన్ని, సౌందర్యాన్ని
కాల బిలాల్ని, కరిగే జీవాన్ని
విద్వేషాన్ని, విజ్ఞానాన్ని
సృష్టి రహస్యాన్ని, వినాశనాన్ని
విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని,శతృత్వాన్ని
ఒకే వరసలో కలిపి,
నాటేస్తాడు వాడు.

నీ దేహపు గగనపు పొంగుల్ని,
లోయల్ని, నీటి చెలమల్ని,
వన్నెచిన్నెల్ని,
సముద్రపు లోతుల్ని.
తొలకరి చినుకుల్ని,
ఒకే పాత్రలో కలిపి,
వండేస్తాడు, వాడు.

కన్నీటిని, కవిత్వాన్ని,
రక్తమోడుతున్న దేహాన్ని,
ఒకే కొయ్యకు వేలాడదీస్తాడు, వాడు.

ఒకానొక ఫీలింగ్ - 7


నీ వైపు కి చూద్దామంటే,
కొన్నాళ్ల వియోగాన్ని,
భరించలేని చూపుల్లో,
విషాదం తొంగి చూసి,
నిన్ను బాధిస్తుందేమోనని,
తలవంచుకొని,
రోధిస్తున్నాను, సుమా
నేనిక్కడే, నిలబడి.

ఒకానొక ఫీలింగ్ -6


చిరునగవులు చిందిస్తు,
మెడచుట్టూ, చీర చుట్టి
ఏల సాగినావు, సుమా....
నన్ను విడిచి, దూరంగా.

25 May 2012

ఒకానొక ఫీలింగ్ - 5


గుండెలోన,బాధ ఒకటి
గొంతులోన కదిలాడితే,
అరచేతిని అడ్డమెట్టి.
దాచగలవా ఆ బాధ ను,
నా హృదిని చేరకుండా.........

ఒకానొక ఫీలింగ్ - 4


నీ నవ్వుల సవ్వడులు
దూరానే మిగిలినప్పుడు,
నీ చూపుల వెతుకులాట
నా కోసం కానప్పుడు,
మదిని ముంచెత్తినది,
వేదనే కదా, సుమా.

22 May 2012

రెండు వేల వీక్షణల దినోత్సవ శుభాకాంక్షలు.


happy 2000 visits day
ఫిబ్రవరి నెల 2వ తేదిన మొదలైన ఈ బ్లాగ్ నిదానంగా మీ అందరి ఆదరణతో ఈ రోజుకి 2000 వీక్షణలను దిగ్విజయంగా పూర్తిచేసుకొన్న శుభసందర్భంగా ఈ బ్లాగ్ ను సందర్శించిన అందరు మిత్రులకి, వీక్షకులకు, పాఠకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. దీన్ని మొదలుపెట్టడానికి కారణం, నేనా రోజు ఆంధ్రభూమి దినపత్రిక చూడటమే, దాన్లో బ్లాగింగ్ చాల సులభం అనే ఆర్టికల్ చదివి పొరపాటున, దీనికి ఇలా బలైపోయాను.
ఇదొక పిచ్చి,కవితల పైత్యం దానికి తోడయింది.
ఈ గోలెందుకులేండి,మళ్లెప్పుడైన చూద్దాం.

మన దేశం (1364), అమెరికా(472), రష్యా (105 ) , 
సింగపూర్(14), జర్మని(11), ఇంగ్లాండ్(11), ఆస్ట్రేలియా(11), మలేషియా(3),థాయిలాండ్(3), దుబాయ్(2),
మెక్సికొ(2),చైనా(2) దేశాల నుంచి 
వీక్షించి,చదివినవారికి నా ధన్యవాదాలు.

ప్రత్యేకంగా ప్రస్తావించవలసినవారు నా రాతలపై కామెంట్లు రాసినవారు.                దగ్గర దగ్గిర, ప్రతీ దానిని చదివి 
నా కవితలపై నాకు కూడా కొంచం నమ్మకం కలిగేటట్లు,
 ప్రోత్సహిస్తున్నజలతారు వెన్నల గారికి   
చాల చాల థాంక్యూలు చెప్పాలి.
నా నానీలపై ఆమె రాసిన ఒక నానీ ,
బ్లాగులలోకంలో,
భాస్కర్ గారి నానీలు.
చదవాలి తప్పకుండా
స్నేహితులందరు! .
మొదటి కామెంట్ రాసిన రవిశేఖర్ గారికి కు,
 విజయ్ మోహన్ గారికి , కెక్యూబ్ వర్మ గారికి, 
పద్మార్పిత గారికి, సందీప్ గారికి, 
జిలేభి గారికి,రసజ్ఞ గారికి,  కల్యాణ్ గారికి,
శ్రీ గారికి, శృతి రుద్రాక్ష్ గారికి, ఆదిత్య గారికి  నా కృతజ్ఞతలు.
 చెల్లి జ్యోతి రాసిన ఒక నాని కూడా చెప్పాలి.
This is Bhaskar's chelli's first "Neena" on Bhaskar.. check it out.. 

Nuvvu...
Enni thittina ade navvu,
Nenu vesindi churake ayina..
neeku matram adi gaddi parake!!!!!

నా బ్లాగ్ ని వెంటాడే మిత్రులు రవిశేఖర్, 
రాజశేఖర్, శ్రీనివాస్ , జ్యోతి,
 తమ్ముల్లు రాజా, కిరణ్ లకు,మా ఆవిడకు, పిల్లలకు,
అమ్మనాన్నకి నిరంతర అభినందనలు.

ఇక నా పోస్ట్ లలో మొదటి మూడు స్థానాలలోని వున్నవి
1.మా ఆవిడ నానీలు (62)
2. నాకై.....(దీన్ని చదవనవసరం లేదు) (52)
3. ఐదు బ్లాగులు – ఐదు నానీలు (36 )

నాకైతే బాగా నచ్చింది " చిక్కుల్లో చిన్నారి"

అగ్రిగేటర్స్ హారం,సంకలిని లకు నా పోస్ట్ లను అందరికి చూపుతున్నందుకు ధన్యవాదములు.
కూడలి,మాలిక, జల్లెడ లలో ఇంకా చేరలేదు.

ఓ ముప్పై మూడు మందిని నేను వెంటాడుతున్నా, వాళ్లెవరు నా వంక చూస్తున్నట్లు లేదు. వాళ్లూ ఎప్పుడైన ఇటు చూస్తే మరంత ఆనందంగా వుంటుంది కదా!  అనిపిస్తుంది.

మరోసారి అందరికి
రెండు వేల వీక్షణల దినోత్సవ శుభాకాంక్షలు.

ఒకానొక ఫీలింగ్ -3




చక్కనైన నీ మోమున
కారుమబ్బు కదలాడితే,
బాధల జడివానలో
ముద్దయినది నా హృదయం.

21 May 2012

జ్ఞాపకమే జీవితం.ద్విపదలు


ఓ జ్ఞాపకం నీతో గడిపిన ప్రతిక్షణం.
ఇప్పుడు జ్ఞాపకమే జీవితం.
-------------- 
చిన్నారుల ఆటలు చిలిపి కేరింతలు.
ఇంట్లో పెద్దలు ఆటంక వాదులు.
------------------ 
బొంకు, రంకు బంగారమన్నాడు.
బుగ్గిపాలైంది, భవిష్యత్తు.

ఒకానొక ఫీలింగ్ -2




ఏనాడు నే చూడని
ఓ దృశ్యం చూసినట్లు,
ఏనాడు నను తాకని
ఓ వీచిక తాకినట్లు,
వేసవిలో ఓ మేఘం
నా మదిని గుద్దినట్టు,
నింగిలోన తారయేదో
నా ఎదురగా నిలిచినట్టు,

రోడ్డు మీద, నా ప్రక్కన
ఓ నల్లని మెరుపు తీగ
నన్ను చూసి నవ్వినట్లు,

అనుభూతి కలిగినది, సుమా
దారిన పరుచుకున్న
నీ చిరునవ్వు చూసి.

19 May 2012

ఏమీ లేదిక్కడ........


పరిచేందుకు
ఏమీ లేదిక్కడ.
ఇప్పుడిప్పుడే
పరుచుకుంటున్న వెన్నెల తప్ప.

వీచేందుకు
వింజామరలేవి,లేవిక్కడ.
కదుల్తున్న మబ్బుతునకలు,
చిరుసవ్వడులు చేస్తున్న,
చెట్ల ఆకులు తప్ప.

ధరించేందుకో,
విశ్రమించేందుకో,
దండెత్తేందుకో
ఏమి లేదిక్కడ.
నలుగుతున్న నిశ్శబ్ధం తప్ప.

ఇక, ఇప్పుడు
పరిహసించేందుకో,
పరీక్షించేందుకో,
ప్రేమించేందుకో,
కవిత్వం రాసేందుకో
ఏమీ లేదిక్కడ....

ఎండిపోయిన
కన్నీటి చారలు  తప్ప.
దగ్ధమైన గుండె బూడిద తప్ప.

ప్రతి అక్షరం ఓ .......!! ( naaneelu -15)


పదాలు
దొరకడం లేదు.
భావాలను
దాయాల్సిదేనా?
                      ---------------------------                                                                  
ఆటోగ్రాఫ్ బుక్
బూజు దులిపాను.
ప్రతి అక్షరం
ఓ జ్ఞాపకం!!
---------------------- 
అడ్డంగా మాట్లాడేవాడు
అదృష్టవంతుడే.
ఆలోచించాల్సిన
పనే లేదు.
-----------------
                

18 May 2012

కొన్ని మాటలు – ఓ జీవితం -ఈ వీడియో




The value of a man should be seen
in what he gives and not in what he
 is able  to receive.


The secret to creativity is knowing 
how to hide your sources.



A person who never made a mistake 

never tried anything new.



A table, a chair, a bowl of fruit and 
violin; what else does a man
 need to be happy?


All religions, arts and  sciences are 

branches  of  the  same  tree




Before God we are all equally 
wise - and   equally  foolish.




17 May 2012

చిక్కుల్లో చిన్నారి



లెక్కలో, చిక్కులో
కూడికో, తీసివేతో
కుస్తీ పట్టడమే కన్నా,
ఈ చిన్న జీవితం.

చేతి వ్రేల్లే కాదు,
కాలి వ్రేల్లూ చాలవు  చిన్నా,
మనిషే ఇప్పుడు,
లెక్కై పోయాడు.



ఇస్ట్ లు అను .........కవిత


రాత్రంతా కమ్మని కలలు కనీ కని,
పగలంతా శ్రమించీ, కష్టించీ,
రక్తం ధారపోసీ, పోసి
కన్నకలలకు, ఎర్రరంగు పులిమే,
చారిత్రక తప్పిదిస్ట్,
మన కమ్యూనిస్ట్.

ఎడాపెడా వాడిపారేస్తుంటారందరు.
విజ్ఞానమో,వినాశనమో
సుఖిస్తారో, నశిస్తారో
ప్రయోగమే కుటుంబం,
ఆలోచనలే ఆస్థి.
ఎవరికీ పట్టడు,ఎవరినీ పట్టించుకోడు.
 మన సైంటిస్ట్.

ముగ్గులేస్తూ మొగుడు,
పడక్కుర్చీలో పెళ్లాం.
మాటలెక్కువ,మార్పు తక్కువ.
మగజాతిని చీల్చిచెండాడే,ఉద్రేకిస్ట్
మన ఫెమినిస్ట్.

ఒకడి చేతిలో పెన్ను,ఇంకొకడి చేతిలో గన్ను.
లక్ష్యమేదైన,
గురిచూసి కాల్చడమే, రాయడమే
సిద్దాంతమేదైన,
ఎటో వైపుకి జనజీవితాన్ని నడిపించడమే,
ఎవర్నో ఒకర్ని వణికించడమే,
మావోయిస్ట్ -  జర్నలిస్ట్.


వాడి గోల వాడిదే, అదో ప్రపంచం.
రంగులో,  తలపులో, గీతలో, రాతలో
వ్యసనమో, అదే జీవితమో
లోకమే పట్టని పిచ్చి మా లోకం.
నిరంతర స్వప్నిస్ట్, మన ఆర్టిస్ట్.


అందరిలో
అప్పుడప్పుడు తొంగిచూస్తుంటాడు,
పక్కనోడి కష్టాలు చూస్తే చాలు
పైకి పలకరింపులు-మనసులో కిలకిలలు.
బయట పడని లోపలి మనిషి,
మనందరిలో మనిషి,శాడిస్ట్.

16 May 2012

ఒంటరిగా నేను, వెన్నల. ద్విపదలు


గతాన్నే గతుకుతున్నావ్!
భవిష్యత్తు కూడు పెడుతుందా?
------------

చిత్తు కాగితం వెక్కిరిస్తుంది.
గాలొచ్చినప్పుడల్లా పైకెగిరి.
----------------
ఆకాశం లో చుక్కల జంట.
ఒంటరిగా నేను, వెన్నల.

ఒకానొక ఫీలింగ్ - 1


సుకుమారివి
మనోహరివి
నవ్యానుభూతుల సంగమానివీ,నీవు.

సుస్మితమైన మోము నీది.
మరువలేని నవ్వు నీది.
నను ముంచెత్తిన వలపు నీది.

సునిశితమైన భావన నీవు.
మహోజ్వల స్పందన నీవు.
నడియాడు మెరుపు తీగ నీవు.

సుఖములన్నీ నీ కడ దాచి,
మరపురాని వేదనదరికే,
నను చేర్చినావా!  సుమా, నీవు.