Pages

16 May 2012

ఒకానొక ఫీలింగ్ - 1


సుకుమారివి
మనోహరివి
నవ్యానుభూతుల సంగమానివీ,నీవు.

సుస్మితమైన మోము నీది.
మరువలేని నవ్వు నీది.
నను ముంచెత్తిన వలపు నీది.

సునిశితమైన భావన నీవు.
మహోజ్వల స్పందన నీవు.
నడియాడు మెరుపు తీగ నీవు.

సుఖములన్నీ నీ కడ దాచి,
మరపురాని వేదనదరికే,
నను చేర్చినావా!  సుమా, నీవు.

5 comments:

  1. మీ మనోహరి, సుకుమారి
    కనిపిస్తోందండి మీ కవితలో...
    @శ్రీ

    ReplyDelete
  2. thank you sir, and heartly welcom to my blog.

    ReplyDelete
  3. చాలా బాగుంది. సుమ ని తలచుకుంటూ మీరు రాసిన కవిత!

    ReplyDelete