Pages

17 May 2012

ఇస్ట్ లు అను .........కవిత


రాత్రంతా కమ్మని కలలు కనీ కని,
పగలంతా శ్రమించీ, కష్టించీ,
రక్తం ధారపోసీ, పోసి
కన్నకలలకు, ఎర్రరంగు పులిమే,
చారిత్రక తప్పిదిస్ట్,
మన కమ్యూనిస్ట్.

ఎడాపెడా వాడిపారేస్తుంటారందరు.
విజ్ఞానమో,వినాశనమో
సుఖిస్తారో, నశిస్తారో
ప్రయోగమే కుటుంబం,
ఆలోచనలే ఆస్థి.
ఎవరికీ పట్టడు,ఎవరినీ పట్టించుకోడు.
 మన సైంటిస్ట్.

ముగ్గులేస్తూ మొగుడు,
పడక్కుర్చీలో పెళ్లాం.
మాటలెక్కువ,మార్పు తక్కువ.
మగజాతిని చీల్చిచెండాడే,ఉద్రేకిస్ట్
మన ఫెమినిస్ట్.

ఒకడి చేతిలో పెన్ను,ఇంకొకడి చేతిలో గన్ను.
లక్ష్యమేదైన,
గురిచూసి కాల్చడమే, రాయడమే
సిద్దాంతమేదైన,
ఎటో వైపుకి జనజీవితాన్ని నడిపించడమే,
ఎవర్నో ఒకర్ని వణికించడమే,
మావోయిస్ట్ -  జర్నలిస్ట్.


వాడి గోల వాడిదే, అదో ప్రపంచం.
రంగులో,  తలపులో, గీతలో, రాతలో
వ్యసనమో, అదే జీవితమో
లోకమే పట్టని పిచ్చి మా లోకం.
నిరంతర స్వప్నిస్ట్, మన ఆర్టిస్ట్.


అందరిలో
అప్పుడప్పుడు తొంగిచూస్తుంటాడు,
పక్కనోడి కష్టాలు చూస్తే చాలు
పైకి పలకరింపులు-మనసులో కిలకిలలు.
బయట పడని లోపలి మనిషి,
మనందరిలో మనిషి,శాడిస్ట్.

6 comments: