పరిచేందుకు
ఏమీ లేదిక్కడ.
ఇప్పుడిప్పుడే
పరుచుకుంటున్న వెన్నెల తప్ప.
వీచేందుకు
వింజామరలేవి,లేవిక్కడ.
కదుల్తున్న మబ్బుతునకలు,
చిరుసవ్వడులు చేస్తున్న,
చెట్ల ఆకులు తప్ప.
ధరించేందుకో,
విశ్రమించేందుకో,
దండెత్తేందుకో
ఏమి లేదిక్కడ.
నలుగుతున్న నిశ్శబ్ధం తప్ప.
ఇక, ఇప్పుడు
పరిహసించేందుకో,
పరీక్షించేందుకో,
పరీక్షించేందుకో,
ప్రేమించేందుకో,
కవిత్వం రాసేందుకో
ఏమీ లేదిక్కడ....
ఎండిపోయిన
కన్నీటి చారలు తప్ప.
దగ్ధమైన గుండె బూడిద తప్ప.
కన్నీటి చారలు,దగ్ధమైన గుండె బూడిద ....బాబోయి..ఎమైందండి భాస్కర్ గారు?
ReplyDeleteemi kaledandi, +ve ga raadhamane modalupetta,
ReplyDeletemodati rendu bhaghane vachhay, kani chivaraki ala migilindadi.