Pages

Showing posts with label గుగాగీలు. Show all posts
Showing posts with label గుగాగీలు. Show all posts

19 April 2014

గుగాగీలు-15


@ గురువుగారు, పుస్తకమొకటి దొరికింది,
భాష తెలియదు.. ఏం పుస్తకమో ఇది,.
మీ దివ్యదృష్టితో చూసి సెలవిస్తారా స్వామి.

#ఇది కవిత్వ పుస్తకంరా,. నాయినా

@ఆహ, మీ దివ్యదృష్టి అమోఘం స్వామి,
క్షణం లో చెప్పేసారు, సమాధానాన్ని.

#ఒరేయ్ పిచ్చి శిష్యా,. దివ్యదృష్టలేదు,
గాడిదగుడ్డు లేదు,. ప్రపంచంలో ఎక్కడైనా సరే,.
అక్షరాలు తక్కువ, ఖాళీలు ఎక్కువ వుండే
ఒకే ఒక్క పుస్తకం,,. కవిత్వమేరా,.

ఒకటో తరగతి అక్షరాల బుక్కు తరువాత.,

23 September 2013

గుగాగీలు - 9


  
# శిష్యా ,ఇంతకాలమూ,.
నన్ను కీర్తిస్తూ,.కాల్లోత్తుతూ,కాకాలుపడుతూ,
ఆహో,,.నీ శుశ్రూషలకు మెచ్చాను,.కోరుకో నాయనా,.కోరుకో,,.
నీకేం కావాలో కోరుకో,. వరమిచ్చేస్తానిక, నీకు,...

@ గురవు గారు,. మహాకవిని కావలనే నా కలను ,
మీ మహిమతో తీర్చేయండి,.స్వామి,..
అంటూ నాలిక బయట పెట్టాడు శిష్యుడు,.

# అయ్యో,.నాయనా ,,ఎంత పని చేస్తివిరా,.
నాలికలపై గీస్తే కవులయ్యే రోజులా ఇవి.,
ఇవే శుశ్రూషణాలు,.ఏ కాకాలు తీరిన కవుల దగ్గరో,.
పత్రికాదుర్గాల దగ్గరో,,.కవితా ముఠాధిపతుల దగ్గరో,.
చేసుంటే,,.ఈ పాటికే పెద్దకవిగా వెలిగిపోయేవాడివిగదరా,.
నన్ను, క్షమించు శిష్యూ,,క్షమించు,.


30 August 2013

గుగాగీలు - 5


# ఒరేయ్,.శిష్యా ఎందుకలా,.
పాతకవిత్వంతో కుస్తీ పడుతూ,.
తల బొప్పికట్టించుకుంటావ్,..
ప్రశాంతంగా రాసుకోరాదూ,..
ఆధునికాంతర కొత్త కవిత్వం,.

@ యే పాతా,.కొత్త క్యా హై గుగా,..

# పిచ్చ (passion) తో  రాసేది పాతకవిత్వం ,...

చదివినోడికి పిచ్చెక్కించేది,..కొత్త కవిత్వం శిష్యా,..

2 August 2013

గుగాగీలు - 4


@ గురువు గారు,,నాకవిత్వానికి ఓ బ్రాండింగ్ కావాలి స్వామి,.
లేకుంటే పక్కన బాండ్ వేసేటోళ్లు దొరకడం లేదు,.

# రెండు ముద్రలు సిద్దంగా వున్నాయిరా ,శిష్యా నీ కోసం,..

@ సెలవియ్యండి స్వామి,..ఆత్రుతగావుంది,.నాకు,..

# మొదటిది,,.
స్వతహాగానే నువ్వు నకవిత్వవాదివి,,,.

@ అంటే ఏంటి స్వామి,.

# రాసేదాంట్లో కించిత్కవిత్వమేమి లేకపోయినా,,.
కవిత్వమని భ్రమ పడేవాళ్లంతా ఈ వాదులే నాయనా,,.

@ ఆహా,..ఏమీ చెప్పారు గుగా,,..
రెండో ముద్ర గుద్దేయండింక, త్వరగా,.. ప్రచారానికెళ్లాలి,..

# కవిత్వాన్ని నిరసిస్తూ కవిత్వం రాయడం నాయనా,..
అందంతా కవిత్వ నిందా వాదం,.షార్ట్ కట్లో అది కుకవిత్వంశిష్యా,.. 

@ మహా సంతోషం గుగా,.,.నాకూ రెండు బ్రాండ్లతో,

కొత్త ఇమేజీని  ప్రసాదించినందుకు,..


నీ నిరంతర నకవిత్వ,కుకవిత్వవాద కవిత్వంతో వర్ధిల్లు నాయానా,...

30 July 2013

గుగాగీలు - 3



@ఇక కవిత్వాన్ని వదిలేద్దామనుకుంటున్నాను గురువు గారు ,

#నాలుగు మాటలు చెప్తాను,
.వింటావా నాయానా,.

@చెప్పండి స్వామి,.మీరంతకంటే చేయగలిగేదేముంది కాని,..

# వేసుకున్నంత సులభంగా, తీసిపారెయ్యడానికి
అదేమన్నా భుజాన కండవా అనుకున్నావా,.
కవిత్వం కన్నా కవిత్వం అది,.

@ ఇక,రెండో మాట చెప్పండి, స్వామి

# కూరుకుపోవడం తెలుసా ఊబిలో,.
బయట పడాలని ప్రయత్నేంచే కొద్ది,
మరంత లోతుగా, మరంత బలంగా,
ఇరుక్కుపోతావ్,లొపల్లోపలే,.
ఇక మిగిలింది,.మునిగిపోవడమే,...

@అంతేనంటారా స్వామి,..అయితే,..మూడో మాట చెప్పెయండిక,..

# పద్మప్యూహం గుర్తుందిగా,..
ప్రవేశమే కాని,.మరలరావడం వుండదు,.
కవిత్వమూ అంతే,.
అంటించుకోవటం తప్ప,
వదిలించుకోవడం వుండదు,..
కడతేరిపోవడమే కాని,
కళ్లు తెరుచుకోవడం వుండదు,.

@దిస్ ఈజ్ టూ మచ్ గుగా,..
కళ్లు తిరుగుతున్నాయ్ నాకు,.
చివరిది చెప్పండిక,..వెళ్తాను,..

# కాష్మోరాని ప్రయోగించాడా,..చెప్పు,.
క్షణంలో వదలకొడతాను,.
కవిత్వం ఆవహించాక,.
ఏ కాద్రాలు  కాపాడలేడు,..
వాడి ఖర్మకి వాడ్ని వదిలేయడం తప్ప.,.

చివరి సీన్ - పడిపోయిన శిష్యుడి మొఖం మీద నీరు చిలుకరిస్తున్న గుగా,..

note,. కాద్ర ,. తులసీ నవలలో మంత్రగాని పేరు,..


25 July 2013

గుగాగీలు -2


@గురువుగారు,..ఓ సందేహం
అడుగునాయనా,..
@బలమైన కవిత్వం ఎలా రాయాలి స్వామి,..
ముందు కొన్ని కొత్త బూతులు నేర్చుకో నాయనా,..
తరువాత చెబుతాను, కవిత్వం సంగతి,...
------------------------------
కళ్లలో వెలుగు నింపుకొని,.
ఇలా అన్నాను,.ఎదురుగా కూర్చున్న అమాయకులతో

ఆలోచనలను చిదిమి, పెట్టే దీపాన్నే,
కవిత్వమంటారు నాయనలారా,..

వెనకనుంచి వెటకారపు వాక్కు ఇలా వినిపించింది,.
బుర్రలను చిధ్రం చేసేదాన్ని కాదా,.అంటూ,.

హతవిధీ,...

27 November 2012

గుగాగీలు


గురువు గారి గీతోపదేశాలు
@ గురువుగారు,
# చెప్పు నాయినా......
@ అక్కడో కవి,
రాసిన ప్రతి కవిత,
అద్భుతం స్వామి,,,,
# పోయి, దర్శించుకో  శిష్యా,...
దేవుడై ఉంటాడు.
------------------------------------
@  గురువు గారు,,
 # మళ్లీ ఏంటి నాయినా....
@ కవిత రాసుకొచ్చా స్వామి,..
# ఎలా వుందో,.....
@ గొప్పగా వచ్చింది తండ్రి..., శ్రీశ్రీనో, తిలకో రాసినట్లు,
# చించి, ఇంకోటి రాసుకురా,నీలా,...
నీవు మిగులుతావ్.,,,
------------------------------------------
@ గురువు గారు,.
,,,,,,,,,,,,,,,,,,,,,,,
పేపరు ముక్క తప్ప,
మరేమి లేదక్కడ.,
ఈ నాలుగు ముక్కలు తప్ప,..
నీ కిటికీలోంచి ,
ప్రపంచాన్ని చూడు,
స్వతంత్రుడవవుతావ్.
నీ కిటికీనే,
ప్రపంచమనుకుంటే,
మూర్ఖుడివవుతావ్.
------------------------------