Pages

7 April 2013

ఎందుకనో స్త్రీలు,,...1
కట్టుబాట్లకు భయపడి
కోటికలల వెలుగుల్ని,

ఆటుపోట్ల లయలకు
సంగమిస్తూ జీవితాన్ని,

ఆంక్షలకు బద్దులై
అంతులేని ఆకాంక్షలను,

పూలు రాలుతున్నంత సహజంగా,
ఎందుకో వదులుకుంటారు, స్త్రీలు.


2
మోయలేని భారాల్ని
అనంతమైన వేదనల్ని,
క్షోభిస్తూ వ్యసనాల్ని,

నిశ్శబ్ధ దుఃఖాల్లోకి
మౌన పయనాల్ని,

భూదేవంత సహనంతో
ఎందుకో భరిస్తారు, స్త్రీలు.

3
ఒడిదుడుకులు లేకుండా
ఒక ప్రవాహం నుంచి మరో ప్రవాహానికి,

చప్పుళ్లు చేయని చిరునవ్వులతో
ఒక ప్రపంచం నుండి మరో ప్రపంచానికి,

కించిత్ విషాదచ్ఛాయలు లేకుండా
ఒక పేరు నుంచి మరో పేరులోకి,

స్నేహ సంభాషణలంత సాధారణంగా,
ఎందుకో బదలాయించబడతారు, స్త్రీలు,.


4
ముందుగా సిద్దపడటం వల్లో
మరెందుకో తెలియదుగాని,

అపరిమిత మేధాతనమో,
బలీయమైన ప్రేమ బంధమో,
తప్పించుకోలేని అమాయకత్వమో,ఏమోగాని,

అరక్షణంలో,
తమని తాము మార్చుకుంటారు, స్త్రీలు,...

లిప్తపాటులో,
శక్తివంతమైన అస్థిత్వాన్ని,బలిస్తారు స్త్రీలు.

13 comments:

 1. బాగుందండీ. భావాన్ని వ్యక్తపఱచడం లో స్పష్టత బాగుంది.

  ReplyDelete
 2. చివరి పంక్తుల్లో ఉన్న ప్రతికూల అంశాల్ని మరచేలా ఎన్ని పంక్తుల్లో అనుకూలంగా వ్రాసినారు.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు లక్ష్మీదేవి గారు,..అయ్యయ్యో ప్రతికూలాంశాలు ఏం లేవండి,..దగ్గర దగ్గర అనుకూలంగానే వ్రాసాను,.నిజానికి మా స్కూల్లో పదవతరగతి తరువాత తల్లిదండ్రులు వద్దన్నారని,..బాగా చదివే ఆడపిల్లలు చదువు మానేయడం,..ఇంటిపేరు మారడం లాంటివి చూసినపుడు కలిగే ఫీలింగ్ రాసాను,.

   Delete
 3. చాలా బాగుంది భాస్కర్ గారు

  ప్రతికూల అంశాలని అనుకూల అంశాలుగా మార్చుకోగల నేర్పు ఉన్నందు వల్లనేమో .. వీరు స్త్రీలు అయ్యారు .

  ఒక ముఖ్య విషయం ఆడపిల్లలు అనడం మానేద్దాం అండి . అమ్మాయిలూ అందామే ! కొండవీటి సత్యవతి గారి స్పూర్తితో.

  ReplyDelete
  Replies
  1. వనజ గారు ధన్యవాదాలు,.పేరులో ఏముండదేమో,..ఆలోచనలలో మార్పుకోసం ప్రయత్నిస్తే బావుంటుందేమో,..

   Delete
 4. 1 & 2 -ఇప్పుడు , అంటే ప్రస్తుత సమాజం లో స్త్రీలు వదులుకోవటం ("అకాంక్షలను"),భరించటం ("వేదనలను") తగ్గిందని చెప్పచ్చేమో!
  3 -నిజమే కదా? ఎంత బాగా చెప్పారో!
  4.Outstanding lines భాస్కర్ గారు...చాల చాలా బాగా రాసారు.

  ReplyDelete
  Replies
  1. 1 & 2 పట్నాలలో కొంత వరకు ఫరవాలేదు కానీ,.పల్లెల్లో ఇది ఇప్పటికీ ఎక్కువే,...
   3 నచ్చినందుకు ధన్యవాదాలు,..
   4 హ,హ,..ఏదో సరదాగా నాలుగు వాక్యాలు రాద్దామనే ప్రయత్నమేనండి,..,బావుందని అనడం మీ గొప్పతనం,.

   Delete
 5. చాలా బాగుంది భాస్కర్ గారు

  ReplyDelete
  Replies
  1. మంజూ గారు ధన్యవాదాలండి,..

   Delete
 6. good one man, vallu ala kavaadaaniki kaaranam evaro manaki telusugaa

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు తనోజ్ గారు,..కారణాలు తెలుసు,.పరిష్కారాలే తెలియడం లేదు,..చాలా రోజుల తరువాత మీ అభినందన ఆనందదాయకం,.

   Delete
 7. చాలా బాగుంది భాస్కర్ గారు

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు శ్రీకాంత్ గారు,.

   Delete