తలవంచుకు బతకాలనే,
లొంగుబాటు సిద్దాంతపు,
తొలిపాఠం చెబుతుంది,
ఉమ్మనీటి తొట్టె నీకు,..
ఇరుకిరుకు మార్గాలలో
సర్దుకుంటు సాగాలనే
సత్యం భోధిస్తుంది నీకు,
ఈ లోకపు సింహద్వారం,..
బెరుకన్నది, పొగరన్నది,
వయసన్నది,సుఖమన్నది,
ఆకలైన,రోగమైన
కీర్తీ కండూతియైన,
సేవాదృక్పథమైనా,.
స్వార్థం, పరమార్థం
ప్రతిది ఒక లొంగుబాటు,...
ఉద్వేగం ఏదైనా,
అనుభూతులు ఎన్నైనా,.
గుణమైనా,వ్యసనమైన.,.
విశ్వాసం లొంగుబాటు,
విజయకాంక్ష లొంగుబాటు.,.
జ్ఞానం ఒక లొంగుబాటు
లొంగుబాటు లేని బతుకు
లేదెక్కడ లోకమందు,..
ఆరడుగుల నేలకో,
చితిమంటల జ్వాలకో,
తప్పనిసరి లొంగుబాటే,.
నీ దేహపు చివరి సాక్ష్యం,...
Inspiring kavita.
ReplyDeleteపద్మార్పిత గారు చాలా కాలానికి,...ధన్యవాదాలండి,..
Deleteనచ్చింది చాలా!
ReplyDeleteధన్యవాదాలు వెన్నల గారు,..
Deleteచాలా మంచి కవిత్వం . హాట్స్ అఫ్ యు భాస్కర్ గారు
ReplyDeleteవనజ గారు,ఆత్మీయంగా స్పందించినందుకు ధన్యవాదాలండి,.
Delete