Pages

14 April 2013

100% కవి



అంతరాంతరాళ లోతుల్లోకి,
ఎప్పుడన్నా తొంగి చూసుకున్నప్పుడు,
అక్కడ నీకో మనిషి కనిపించాలి,.

దురదృష్టవశాత్తు,.
కువకువలాడుతూ,
అక్కడకూడా కవిత్వమే రెపరెపలాడుతుంటే,..

ఓ నా ప్రియమైన కవి,.
విను నా చివరి మాట,..
ఇక మనిషిగా నువ్వు మరణించినట్లే,.....

7 comments:

  1. భాస్కర్ గారు మీ 100%కవి బావుంది..కొచెం పెద్దగా ఉంటె బావుండు అనిపించింది... కాని ఎలాగైతే కొచెం లోనే చాలా భావాలను దాచారు... నాకు
    "ఓ నా ప్రియమైన కవి,.
    విను నా చివరి మాట,..
    ఇక మనిషిగా నువ్వు మరణించినట్లే,....." ఇది బాగా నచ్చింది..మీరిలాగే రాస్తూ.. ఉండాలని నా కోరిక!

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు కార్తీక్ గారు,.. మీ బ్లాగ్ బాగుంది,,అభినందనలు,.

      Delete
  2. భాస్కర్ గారు, మీకు మనిషి కనపడుతున్నాడా? లేక కవిత్వమా? ఆ రహస్యం చెబుదురూ...
    కాని చాలా ఈ కవితలొ చాలా లోతైన అర్ధం ఉన్నట్టుంది.కవులకు మాత్రమే అర్ధం అవుతుందేమో? :))

    ReplyDelete
    Replies
    1. వెన్నల గారు, ధన్యవాదాలండి,...కవిత్వం కన్నా మానవత్వం మిన్న ,..స్పందనను భాషలోకి తర్జమా చేయడం కంటే,.సహాయం గా మార్చండం మంచిదనేమో(రెండు చేస్తే ఇంకా గొప్ప విషయం),అనే భావంలో రాసినట్లున్నాను,.

      Delete
  3. వాస్తవికకు చక్కని భావుకత తోడైతేనే ఇలాంటి మంచి కవితలు వస్తాయి. చక్కని కవితకు అభినందనలు.

    టీవీయస్.శాస్త్రి

    ReplyDelete
    Replies
    1. శాస్త్రీ గారు,.మీ ఆదరపూర్వక వ్యాఖ్యకు ధన్యవాదాలు సార్.

      Delete
  4. లక్ష్మీదేవి గారు, ధన్యవాదాలండి,

    ReplyDelete