Pages

21 April 2013

ఉపసంహరణ



1
పరమ దయాళువైన, నా తండ్రీ,
చిందిచబడిన నీ రక్తము,
మానవజాతి సమస్త పాపాలను,
తరతరాలుగా తుడుస్తూనే వుందని,
విశ్వసిస్తున్నాం, నీ ముందు మోకరిల్లి,.

2
ప్రజల్ని, ప్రభుత్వాలను
నిర్లిప్త సమాజాలను
పశ్చాత్తాప ప్రకటనలను
ప్రతి దాన్ని కవిత్వకరించి,
సరిపుచ్చుకునే నాలాంటి కవులను
క్షమించకు తల్లీ, క్షమించకు
స్రవిస్తున్న నీ పసి రక్తంతో
తనివితీరా శపించు,
సమస్త జగత్తు మూల్యం చెల్లించేటట్లు.,.

3
విలువలు క్షీణిస్తూనే వుంటాయ్,
విశ్వం విస్తరిస్తూనే వుంది,.
అపార కరుణా కృపా సముద్రుడై,
ఆ భగవంతుడు,.
ప్రతి వారిని క్షమిస్తూనే వుంటాడు,.
క్షమించకుడని వారిని కూడా,.

4
ఈ మనుషుల మీద పిచ్చిప్రేమతో
మారతారనే, మిగిలిన కాస్తా నమ్మకంతో
బహుశా, శాపాన్ని ఉపసంహరించుకుందేమో,..
దైవస్వరూపమైన ఆ చిన్నారి మనస్సు,.
అమ్మా, నీకు ధన్యవాదాలు...

4 comments:

  1. ప్చ్... మానవత్వం లేని మనుషులనాలా? మనిషి జాతి కాదేమో అనుకోవాలా? మనుషులలో ఇంత హీనమైన వాళ్ళ మధ్య మనం నిత్యం తిరుగుతున్నాము అని భయపడాలా? ఏదీ ఏమైనా, నిత్యం అభద్రతా భావం తో ఆడపిల్లలు గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకుని బ్రతకాల్సిందేనా? ఆఖరికి ఇంత హింసకి గురి అవుతారన్న భయంతో ఇక పై కూడా అసలు ఆడపిల్లలనే కనకూడదు అనుకుంటే, తప్పు లేదేమో!

    ReplyDelete
    Replies
    1. ఎంత ఎక్కువ మాట్లడుతున్నామో,.అంత ఎక్కువగా జరుగుతున్నాయో,.బయటపడుతున్నాయో,...కొన్ని సార్లు నిజంగా భయంవేస్తుంది,..జాగ్రత్తపడటం తప్ప మనమేం చేయగలం,..ధన్యవాదాలండి,.

      Delete
  2. Replies
    1. శ్రీకాంత్ గారు ధన్యవాదాలండి,.ఆ గుర్తుకి అర్ధం, అర్థం కాలేదండి,..

      Delete