" తేనెల తేటల మాటలతో " అంటూ మా పాఠశాల విద్యార్థినులు ఆలాపించిన గీతం వీడియో ఇది.
ఓ చిన్న ప్రయత్నం చేశాను, ఇలా కొన్ని మంచి పాటలను చిత్రీకరించి , కమ్మవారిపల్లె గ్రామానికి చెందిన
శ్రీ గుంటూరి భాస్కర రావు గారు మా పాఠశాలకు బహుకరించిన ప్రోజెక్టర్ సహాయంతో చుట్టుపక్కల గ్రామాలలో ప్రదర్శించాలని
అనుకుంటున్నాము. అక్షరాస్యత, పర్యావరణం, మద్యపానం లాంటి అంశాలతో వారి పిల్లలపై
చిత్రీకరించిన పాటలు,
తల్లిదండ్రులను కొంత ఆలోచింపచేస్తాయని ఆశ.
చిత్రీకరణ ఎలా వుందో మీరే చెప్పాలి,.......
మధు మోహన్ గారు, నా బ్లాగుకు స్వాగతం, వీడియో నచ్చినందుకు ధన్యవాదాలు.
ReplyDeleteచాలా బాగుంది భాస్కర్ గారు మీ ప్రయత్నం అభినందనీయం
ReplyDeleteరమేష్ గారు, నా బ్లాగుకి స్వాగతం, మీకు పిల్లల వీడియో నచ్చినందుకు ధన్యవాదాలు.
Deleteచాలా బావుంది. మీ ప్రయత్నానికి అభినందనలు.
ReplyDeleteఎంత ఆహ్లాదకర పంటపొలాలు. జొన్న కంకులు తలలు ఊపడం ఎంత నచ్చిందో !
వనమాలి గారు, మీ ఆభినందనలకు ధన్యవాదాలు,మా బడి పక్కనే వున్న పొలాలండి అవి.
Deleteమంచి ప్రయత్నం భాస్కర్ గారూ!
ReplyDeleteఅభినందలు నీకు...
@శ్రీ
శ్రీ గారు, నా ప్రయత్నాన్ని ప్రోత్సహించినందుకు ధన్యవాదలండి.
Deleteసర్, మంచి ప్రయత్నం. మంచి ఆలోచన.
ReplyDeleteఅభినందనలు మీకు...మెరాజ్
ఫాతిమా గారు, నా ఆలోచనను మెచ్చినందుకు ధన్యవాదాలండి, ఆచరణ కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నానండి.
Deleteఎంతో బావుంది. పిల్లలు మధ్యలో ఒకళ్ళనొకళ్ళని చూసుకొంటూ నవ్వుకొంటూంటే బావుంది. ఒక్కచోటే కూర్చొని కాకుండా, నడుస్తూనో నాట్యం చేస్తూనో పాడుతూంటే ఇంకా బావుంటుంది.
ReplyDeleteఅజ్ఞాత గారు, మీ అభినందనకి ధన్యవాదాలండి, ఈ సారి వీడియోలో మీరు ఇచ్చిన సలహాను పాటిస్తానండి, ఎడిటింగ్,కంపోజింగ్ కొంచెం కష్టమే అనిపించిందండి,మొదటిసారి కావడంతో..
Delete