Pages

21 September 2012

దేశమును ప్రేమించుమన్నా,,,,,


అవినీతి వటవృక్షపు ఊడలు,
నరనరాల్లో చొచ్చుకుపోతూ,
ఆకాశంలా విస్తరిస్తున్నప్పుడు.....
అసత్యపు పలుకులు
ప్రియమైన సత్యాలై,
అనుక్షణం హృదయాన్ని,
అగ్నిలా లోభరుచుకుంటున్నప్పుడు......
ఎదుటివాడిని ద్వేషించడమే,
దేశభక్తిగా కీర్తించబడుతున్నప్పుడు...
ఎవరెవరి కారణాలకో,,
లక్ష్యమే తెలియని అమాయకులు బలవుతున్నప్పుడు...
దేశం ముసుగులో,
సమాధులు మాత్రమే
నిర్మించబడుతున్నప్పుడు.........
దేశాన్ని ప్రేమించడమంటే,
తోటి మనిషిని ప్రేమించడం అని తెలిసికూడా,
గుండెలోతుల్లో  దాన్ని,
గుప్తనిధిలా దాచేస్తున్నప్పుడు......
ఎందుకని నేను దేశాన్ని ప్రేమించాలి ??
ఒకే ఒరలో వేల విరుద్ధతల ఖడ్గాలను,
ఇముడ్చుకున్న ఈ దేహం,
సాఫల్యతావైఫల్యాలను,
ఎలా విశ్లేషించగలదు, నా పిచ్చిగాని,.
దేశాన్ని ప్రేమించాలనే వుంది,
ఎందుకనే ప్రశ్న,తొలుస్తూనే వుంది.
సంఘర్షణల్లో పడి కొట్టుకుంటున్నందుకో,
సంఘర్షణే లేక బతుకుతున్నందుకో.....
అయినా, ఇదంతా నాకెందుకు...
దేశమనే సంకుచితత్వం,
మెదడుని ఉన్మాదంతో ఊపనంతవరకు,
నా దేశాన్ని ప్రేమిస్తూనేవుంటాను, నేను......
-----------------------------------
 నేడు గురజాడ 150 వ జయంతి
అందరికి  " ఆధునిక తెలుగు సాహిత్య దినోత్సవ శుభాకాంక్షలు "

19 comments:

  1. భాస్కర్ గారూ, చక్కటి భావ సంఘర్షణ,
    దేశ భక్తీ ఎందుకుండాలో బాగా తెలిపారు.
    మీ కవితల్లో మంచి అర్ధం ఉంటుంది.

    ReplyDelete
    Replies
    1. ఫాతిమా గారు, కవితను అభినందించినందుకు,నిరంతరం ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదలండి.

      Delete
  2. నేను నా దేశాన్ని ఎందుకు ప్రేమించాలి అనే భావం రావడమే
    దేశ ద్రోహానికి మొదటి మెట్టు...
    మీరు వ్రాసినవి నూటికి నూరు శాతం కరెక్టే...:-)
    కానీ,
    'జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి'...
    అని చెప్పిన శ్రీరామచంద్రునిలా
    తల్లిని ఎందుకు ప్రేమిస్తామో,
    తల్లిని గన్న తల్లి మాతృభూమిని అందుకే ప్రేమించాలి...
    మనుషుల్లో మంచిని చూడండి...
    మనిషిలోని మానవత్వాన్ని ప్రేమించండి...
    మనుషుల్లోని మంచి మనసును ప్రేమించండి...
    మీ ఆవేశాన్ని చక్కగా చెప్పారు కవితలో...
    అభినందనలు...
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. నూటికి నూరు శాతం అనేది ఎక్కువమంది వాడినా అది కరెక్ట్ కాదు. నూటికి నూరు పాల్లు లేదా నూరు శాతం అని వాడాలి.

      Delete
    2. ధన్యవాదాలు!
      మంచి విషయం చెప్పినందుకు......
      కానీ 'పాల్లు' కాదు...'పాళ్లు' అనుకుంటాను...
      @శ్రీ

      Delete
    3. బహు చక్కగా చెప్పారు

      Delete
    4. దేశద్రోహం,ఎంత మాట అనేశారు, శ్రీ గారు.
      దేశం అనే మాట సాపేక్షమైనదేమో...
      కులం,మతం అనే కట్టుబాటు లాగా, దేశం ఒక ఉన్నతమైన కట్టుబాటేమో...
      టాగుర్ గీతాంజలిలో
      Where the world has not been broken up into fragments
      By narrow domestic walls అంటారనుకుంటాను. ఆ గోడలలో దేశం కూడా వుంటుందేమో..
      కవితను చక్కగా విశ్లేషించి, అభినందించినందుకు ధన్యవాదాలండి.

      Delete
    5. బార్న్ టు పెర్ ఫామ్ గారు, నా బ్లాగు కు స్వాగతం, నా కవిత పైన కామెంట్ రాయకుండా, కామెంటు పై కామెంటు రాస్తారా,ఏం అన్యాయం చేసిందడి నా కవిత మీకు...వా......

      Delete
    6. ధన్యవాదాలు సంతు గారు.

      Delete
  3. దేశాన్ని ప్రేమించడమంటే,
    తోటి మనిషిని ప్రేమించడం అని తెలిసికూడా,
    గుండెలోతుల్లో దాన్ని,
    గుప్తనిధిలా దాచేస్తున్నప్పుడు......
    అద్భుతంగా వ్రాసారు భాస్కర్ గారూ.. ఆలోచన రేకెత్తించేలా.. ఈ లైన్స్ నాకు చాలా నచ్చాయి..

    ReplyDelete
    Replies
    1. సుభగారు, కవితా వాక్యాలు మీరు మెచ్చినందుకు ధన్యవాదాలండి.

      Delete
  4. ఏంటండి మీలో ఇంత అంతర్మధనం జరిగిందా:)
    ఎందుకు ప్రేమించాలంటే ఏమని చెప్పను?
    అన్నీ మీరే చక్కగా చెప్పేస్తేను...

    ReplyDelete
    Replies
    1. హ,హ.. అంతర్మధనం జరిపి కవిత్వం రాసే స్థాయి నాకెక్కడిదండి..
      ఏదో అలా రాసుకుంటూ పోవడమే, ఏది ఏమైనా దేశాన్ని ప్రేమించాల్సిందే కదా.
      ధన్యవాదాలు ప్రేరణ గారు.

      Delete
  5. ఆలోచింపచేస్తుంది మీ ఈ కవిత ఎందుకని.....
    But still"నా దేశాన్ని ప్రేమిస్తూనేవుంటాను నేను"

    ReplyDelete
    Replies
    1. కవితను మెచ్చినందుకు ధన్యవాదాలు పద్మార్పిత గారు.
      అవును, దేశాన్ని ప్రేమించాలి.

      Delete
  6. "దేశం ముసుగులో,
    సమాధులు మాత్రమే
    నిర్మించబడుతున్నప్పుడు........."

    ఇది చాలా బాగుంది.

    ఇక మీ ప్రశ్నకు నా సమాధానం ఏమిటంటే, ఈ దేశంలో పుట్టాము కాబట్టి ఈ దేశాన్ని ప్రేమించాలి. నాకు అంతకంటే గొప్ప కారణం ఏమీ కనిపించడంలేదు.

    ReplyDelete
    Replies
    1. బోనగిరి గారు, నా బ్లాగు కి స్వాగతం, కవితా వాక్యం నచ్చినందుకు ధన్యవాదాలు. ప్రతి వ్యక్తి దేశాన్ని ప్రేమిచడం, వ్యక్తులకంటే, పరిపాలకులకు చాలా అవసరమేమోనండి.

      Delete
  7. శ్రీ భాస్కర్ గారికి,నమస్కారములు.

    అత్యద్భుతమైనది మీ కవిత, మీ భావాలు. జోహారులు.

    మీ స్నేహశీలి,
    మాధవరావు.

    ReplyDelete
  8. మాధవరావు గారు, నా బ్లాగుకి స్వాగతం అండి.
    స్నేహపూర్వక అభినందనలకు ధన్యవాదాలండి.

    ReplyDelete